ఆసియా కప్ 2023 గ్రూప్ 4లో భాగంగా ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇండియా-పాక్ లు ఈ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ పోరు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు మాజీ క్రికెటర్లు టీమిండియాకు కొన్ని సలహాలు కూడా ఇస్తున్నాడు. పాకిస్థాన్ ను ఈ మ్యాచ్ లో ఓడించాలంటే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాగే నంబర్ 8లోనూ బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని కోరుకుంటే మాత్రం పాక్ పై టీమిండియా గెలవడం కష్టమేనని చెప్పుకొచ్చాడు. ఇక శార్దూల్ ఠాకూర్ జట్టులో ఉంటే టీమిండియా గెలవడం కష్టమేనని జోస్యం చెప్పాడు ఈ మాజీ బ్యాటర్.
ఆసియా కప్ లో మరో కీలక మ్యాచ్ కు రంగం సిద్దమైంది. గ్రూప్ 4లో భాగంగా.. ఆదివారం ఇండియా-పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా సైతం పాక్ ను ఓడించి టోర్నీలో ముందుకుసాగాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే టీమిండియా బ్యాటింగ్ లైనప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. పాక్ ను ఓడించాలంటే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయా పడ్డాడు.
అలాగే నంబర్ 8లో కూడా బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని కోరుకుంటే మాత్రం పాక్ పై గెలవడం కష్టమే అని జోస్యం చెప్పాడు. శార్దూల్ ప్లేస్ లో కచ్చితంగా షమీని ఆడించాలని ఆయన సూచించాడు. గత మ్యాచ్ సాగిన తీరును బట్టే నేను ఈ మాట చెబుతున్నాను, జట్టులో కనీసం ముగ్గురు నాణ్యమైన పేసర్లు ఉండాలని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. బుమ్రా, సిరాజ్ లతో పాటుగా షమీ ఉండాలని చోప్రా పేర్కొన్నాడు. పాక్ తో మ్యాచ్ లో శార్దూల్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్ లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. మరి యాజమాన్యం తుది జట్టులో షమీకి చోటిస్తుందో.. లేక శార్దూల్ వైపే మెుగ్గుచూపుతుందో వేచి చూడాలి. కాగా.. ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.