iDreamPost
android-app
ios-app

Hardik Pandya: హార్ధిక్‌ పాండ్యాను కష్టాల్లోకి నెట్టిన రోహిత్‌ శర్మ భార్య: భారత మాజీ క్రికెటర్‌

  • Published Feb 08, 2024 | 4:46 PM Updated Updated Feb 08, 2024 | 4:46 PM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భార్య రితికా వల్ల.. మరో స్టార్‌ క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా కష్టాల్లో పడతాడని ఓ మాజీ క్రికెటర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మరి రితికా వల్ల.. పాండ్యా ఎలాంటి కష్టాల్లో పడతాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భార్య రితికా వల్ల.. మరో స్టార్‌ క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా కష్టాల్లో పడతాడని ఓ మాజీ క్రికెటర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మరి రితికా వల్ల.. పాండ్యా ఎలాంటి కష్టాల్లో పడతాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 08, 2024 | 4:46 PMUpdated Feb 08, 2024 | 4:46 PM
Hardik Pandya: హార్ధిక్‌ పాండ్యాను కష్టాల్లోకి నెట్టిన రోహిత్‌ శర్మ భార్య: భారత మాజీ క్రికెటర్‌

టీమిండియా విజయాలు, అపజయాలకంటే.. ఐపీఎల్‌ టీమ్‌ ముంబై ఇండియన్స్‌ గురించే సోషల్‌ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది. రెండు నెలల క్రితం రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా తప్పించి, అతని స్థానంలో హార్ధిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా నియమించినప్పటి నుంచి ఈ అగ్గి రాజుకుంది. 2022 సీజన్‌ కంటే ముందు ముంబైని వీడిన పాండ్యా.. గుజరాత్‌ టైటాన్స్‌ టీమ్‌కు కెప్టెన్‌గా వెళ్లాడు. తొలి సీజన్‌లోనే ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అలాగే 2023లో రన్నరప్‌గా నిలిచింది గుజరాత్‌ టైటాన్స్‌. కానీ, ఏమైందో ఏమో కానీ, గుజరాత్‌ను వీడి తిరిగి ముంబైలోకి వచ్చాడు పాండ్యా. ముంబైలోకి పాండ్యా రావడాన్ని రోహిత్‌ ఫ్యాన్స్‌ స్వాగతించారు. కానీ, రోహిత్‌ను తప్పించి పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం వారికి ఆగ్రహం తెప్పించింది. క్రికెట్‌ వర్గాల్లో అదే హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇప్పటి వరకు ఈ విషయంపై రోహిత్‌ శర్మ కానీ, పాండ్యా కానీ స్పందించలేదు. అయితే.. ఇటీవల ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి, పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడం వెనుక కారణం ఇదే అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మపై ఒత్తిడి తగ్గించేందుకు ముంబై ఇండియన్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బౌచర్‌ వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై రోహిత్‌ శర్మ భార్య రితికా డైరెక్ట్‌గా స్పందించింది. బౌచర్‌ ఇంటర్వ్యూకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందులో చాలా తప్పు ఉందంటూ కామెంట్‌ చేసింది. దాంతో.. మరోసారి ఈ విషయంపై తీవ్ర దుమారం రేగింది.

అయితే.. రోహిత్‌ శర్మ భార్య రితికా స్పందించడం హార్ధిక్‌ పాండ్యాను ఒత్తిడిలోకి నెడుతుందని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. రితికా కామెంట్‌తో రాజుకున్న ఈ గొడవ ఇప్పట్లో చల్లారేలా లేదని ఆయన అన్నాడు. ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్న పాండ్యా.. ఐపీఎల్‌ పైనే పూర్తిగా ఫోకస్‌ పెట్టాడు. గాయంతో భారత జట్టుకు దూరమైన.. వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ లాంటి బిగ్‌ టీమ్‌ను నడిపించనున్నాడు. అందుకోసం తనను తాను రెడీ చేసుకుంటున్నాడు. మరి రితికా చేసిన కామెంట్‌.. పాండ్యాపై ఒత్తిడి పెంచి అతనిని కష్టాల్లోకి నెడుతుందని చోప్రా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş