పాండ్యా కెప్టెన్‌ కాకపోవడానికి గంభీర్‌ కారణం కాదు! అసలు విలన్‌ ఎవరో తెలిసిపోయింది!

Hardik Pandya, Captaincy, IND vs SL: భారత టీ20 జట్టు కెప్టెన్సీని హార్దిక్‌ పాండ్యాకు రాకుండా చేసింది గంభీర్‌ కాదు.. దాని వెనుక మరో పెద్ద హస్తం ఉన్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Hardik Pandya, Captaincy, IND vs SL: భారత టీ20 జట్టు కెప్టెన్సీని హార్దిక్‌ పాండ్యాకు రాకుండా చేసింది గంభీర్‌ కాదు.. దాని వెనుక మరో పెద్ద హస్తం ఉన్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఒక్క శ్రీలంక టూర్‌ కోసం ప్రకటించిన జట్లతో బీసీసీఐ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పేసింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత రోహిత్‌ శర్మ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో టీ20 కెప్టెన్‌ పోస్ట్‌ ఖాళీ అయింది. అలా టీ20 క్రికెట్‌లో టీమిండియా నడిపించే క్రికెటర్‌ ఎవరు? వన్డేలకు రోహిత్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తారా? రోహిత్‌ తర్వాత టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌ ఎవరు? ఇలా అన్ని ప్రశ్నలకు జవాబు వచ్చేసింది. టీ20 జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది బీసీసీఐ. అలాగే టీ20, వన్డేలకు యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. దీంతో.. టీమిండియా ఫ్యూచర్‌ కెప్టెన్‌ గిల్‌ అనే విషయంపై క్లారిటీ వచ్చింది.

ఇదంతా బాగానే ఉన్నా.. హార్ధిక్‌ పాండ్యాకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో అద్భుతమైన ప్రదర్శన చేసినా.. పాండ్యాకు బీసీసీఐ దారుణంగా అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రోహిత్‌ శర్మ తర్వాత.. హార్ధిక్‌ పాండ్యానే టీ20 జట్టుకు పర్మినెంట్‌ కెప్టెన్‌ అవుతాడని అంతా భావించారు. కానీ, బీసీసీఐ అతనికి షాకిస్తూ.. సూర్యకుమార్‌ యాదవ్‌ను కెప్టెన్‌ను చేసింది. పైగా అతనికున్న వైస్‌ కెప్టెన్సీని కూడా లాగేసుకొని శుబ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెప్టెన్ చేసింది. అయితే.. ఇదంతా కొత్త హెడ్‌ కోచ్‌ గంభీర్‌ చేసిన పనే అని ప్రచారం జరిగింది. కానీ, కొత్తగా మరో పేరు వెలుగులోకి వచ్చింది.

హార్ధిక్‌ పాండ్యాను టీ20 జట్టుకు కెప్టెన్‌ చేయకుండా అడ్డుపడింది గౌతమ్‌ గంభీర్‌ కాదని, టీమిండియా మాజీ క్రికెటర్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌.. పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చేందుకు అస్సలు ఒప్పుకోలేదని బీసీసీఐ0 అధికారులు అనాధికారికంగా వెల్లడిస్తున్నారు. టీ20 జట్టుకు ఎవర్ని కెప్టెన్‌ను చేయాలని మీటింగ్‌లో పాండ్యాను అజిత్‌ అగార్కర్ పూర్తిగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఒకసారి ఛాంపియన్‌, ఒక సారి రన్నరప్‌గా నిలిపిన పాండ్యా.. ముంబై ఇండియన్స్‌ విషయంలో మాత్రం తేలిపోయాడు. అయితే.. గుజరాత్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలో హెడ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా కారణంగా ఆ జట్టు సక్సెస్‌ అయిందని, పాండ్యా కెప్టెన్సీ వల్ల కాదన అగార్కర్‌ గట్టిగా వాదించడంతోనే పాండ్యాకు టీ20 కెప్టెన్సీ దక్కలేదని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో.. పాండ్యా కెరీర్‌లో అసలు విలన్‌ అజిత్‌ అగార్కర్‌ అంటూ కొంత మంది క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments