Ajay Ratra: BCCI సెలక్షన్ కమిటీలో మార్పు!  మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా ఎంట్రీ..

Ajay Ratra, BCCI: బీసీసీఐ సెలక్షన్ కమిటీలో కీలక మార్పు చోటుచేసుకుంది. సలీల్ అంకోలా స్థానంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రాను కొత్త సభ్యుడిగా తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Ajay Ratra, BCCI: బీసీసీఐ సెలక్షన్ కమిటీలో కీలక మార్పు చోటుచేసుకుంది. సలీల్ అంకోలా స్థానంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రాను కొత్త సభ్యుడిగా తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా త్వరలోనే బంగ్లాదేశ్ లో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీలో కీలక మార్పు చేసింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో ఓ కొత్త సభ్యుడు ఎంట్రీ ఇచ్చాడు. సలీల్ అంకోలా స్థానంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రాను కమిటీలోకి తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఇంత సడెన్ గా సెలక్షన్ కమిటీలో ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

బీసీసీఐ సెలక్షన్ కమిటీలో కీలక మార్పు చోటుచేసుకుంది. సలీల్ అంకోలా స్థానంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రాను కొత్త సభ్యుడిగా తీసుకున్నారు. కాగా.. అజిత్ అగార్కర్, సలీల్ అంకోలాలు ఇద్దరు కూడా వెస్ట్ జోన్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దాంతో ఈ మార్పు చేయాల్సి వచ్చింది. సంప్రదాయం ప్రకారం బీసీసీఐ సెలక్షన్ కమిటీలో ఉండాల్సిన అయిదుగురు వివిధ జోన్లకు ప్రాతినిథ్యం వహిస్తారు. ప్రస్తుతం అజయ్ రాత్రా నార్త్ జోన్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, శ్రీధరన్ శరత్ లు సభ్యులుగా ఉన్నారు. తాజాగా అజయ్ రాత్రా ఈ కమిటీలో చేరాడు.

ఇక అజయ్ రాత్రా కెరీర్ విషయానికి వస్తే.. వికెట్ కీపర్ గా భారత్ కు సేవలందించిన రాత్రా 6 టెస్టులు, 12 వన్డేలు ఆడాడు. 90 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 4 వేల పరుగులు చేశాడు. అలాగే అస్సామ్, యూపీ, పంజాబ్ జట్లకు హెడ్ కోచ్ గా వ్యవహరించాడు. కాగా.. సెలక్టర్ పదవికి జనవరిలో దరఖాస్తులను కోరింది. ఈ నేపథ్యంలో రాత్రాతో పాటుగా రితిందర్ సింగ్ సోథీ, శక్తి సింగ్, అజయ్ మెహ్రాలను ఇంటర్వ్యూ చేసి.. ఫైనల్ గా అజయ్ రాత్రాను అశోక్ మల్హోత్రా నేతృత్వంలోని క్రికెట్ సలహా సంఘం ఎంపిక చేసింది. “ఇది నాకు దక్కిన గౌరవం, పెద్ద సవాల్. టీమిండియాకు సేవలందించడానికి ఉత్సాహంతో ఉన్నాను” అని ఎంపిక తర్వాత రాత్రా చెప్పుకొచ్చాడు.

Show comments