World Cup 2023: ఆఫ్ఘాన్‌ విజయాలకు కారణం.. మహారాజా ఆఫ్‌ ఇండియన్‌ టీమ్‌!

ఆఫ్ఘానిస్థాన్‌ సాధిస్తున్నవి సంచలన విజయాలు కాదు.. వారి కష్టానికి దక్కుతున్న ఫలితం. అయితే.. ఆఫ్ఘాన్‌ కష్టానికి ఓ అద్భుత శక్తి కూడా ఉంది. చాలా సార్లు గెలుపు ముంగిట వరకు వచ్చి.. ఒత్తిడికి తలొంచే ఆఫ్ఘాన్‌ టీమ్‌.. ఇప్పుడు ఒత్తిడి చిత్తు చేసి మరీ మ్యాచ్‌లు గెలుస్తుంది. అయితే.. ఆఫ్ఘాన్‌ టీమ్‌లో మార్పుకు కారణం ఓ వ్యక్తి. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆఫ్ఘానిస్థాన్‌ సాధిస్తున్నవి సంచలన విజయాలు కాదు.. వారి కష్టానికి దక్కుతున్న ఫలితం. అయితే.. ఆఫ్ఘాన్‌ కష్టానికి ఓ అద్భుత శక్తి కూడా ఉంది. చాలా సార్లు గెలుపు ముంగిట వరకు వచ్చి.. ఒత్తిడికి తలొంచే ఆఫ్ఘాన్‌ టీమ్‌.. ఇప్పుడు ఒత్తిడి చిత్తు చేసి మరీ మ్యాచ్‌లు గెలుస్తుంది. అయితే.. ఆఫ్ఘాన్‌ టీమ్‌లో మార్పుకు కారణం ఓ వ్యక్తి. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వరల్డ్‌ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు అద్భుతాలు నమోదు చేస్తుంది. ఇండియాతో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనే ఆఫ్ఘనిస్థాన్‌ పసికూనలా ఆడింది. బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ మంచి పోటీనే ఇచ్చింది. కానీ, అనూహ్యంగా ఇంగ్లండ్‌ లాంటి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమ్‌ను ఓడించి ఈ వరల్డ్‌ కప్‌లో తొలి సంచనలం నమోదు చేసింది. తాజాగా సోమవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే.. ప్రస్తుతం టీమిండియా ఎలా ఆడుతుంతో అచ్చం అలాగే ఆడింది. బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌ అన్ని విభాగాల్లో పాకిస్థాన్‌ను డామినేట్‌ చేస్తూ.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే.. ఈ విజయాన్ని సంచలనం అనే కంటే.. ఆఫ్ఘనిస్థాన్‌ కష్టానికి ప్రతిఫలంగా చెప్పాలి.

ఇదేదో లక్‌లో వచ్చిన విజయమో, పాకిస్థాన్‌ చెత్త ఆటతో ఆఫ్ఘాన్‌కు దక్కిన గెలుపో కాదు.. ఆఫ్ఘాన్‌ అద్భుత క్రికెట్‌కు దక్కిన గుర్తింపుగా చెప్పుకోవాలి. ఎందుకంటే.. మ్యాచ్‌ ఆసాంతం ఎక్కడా కూడా ఓ సాధారణ జట్టులా ఆడలేదు. పాకిస్థాన్‌ కంటే ఎంతో బలమైన జట్టు ఎలా అయితే.. ఒక పద్ధతి ప్రకారం ఆడింది. మ్యాచ్‌లో ఎక్కడా కూడా తత్తరపాటు గానీ, ఏదో గుడ్డి ఊపుడు గానీ, లేదు.. ప్రాపర్‌ వన్డే క్రికెట్‌ ఆడి మరీ గెలిచింది ఆఫ్ఘనిస్థాన్. అందుకే.. ఈ విజయాన్ని ఆఫ్ఘనిస్థాన్‌ గెలుపులా చూడాలని కానీ, వరల్డ్‌ కప్‌లో ఆప్సెట్‌గానో, లేక సంచలనంగానో చూడకూడదు. అయితే.. ఈ వరల్డ్‌ కప్‌లో ఆఫ్ఘాన్‌ అసాధారణ ప్రదర్శన వెనుక ఆ జట్టులోని ఆటగాళ్ల ఏళ్లనాటి కష్టం, పట్టుదల ఉన్నా కూడా.. వారికి అదనంగా ఓ శక్తి జతకలిసింది. అదే ఇప్పుడు వారిని విజయాల వైపు నడిపిస్తుంది.

ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు ఇప్పుడనే కాదు. గతంలోనూ పలు మ్యాచ్‌ల్లో పెద్ద పెద్ద జట్లును ఓడించేంత పని చేసింది. మ్యాచ్‌ చివరి వరకు ఆఫ్ఘాన్‌ గెలుస్తుందనేలా వారి ఆట సాగేది. కానీ, ఒత్తిడిని తట్టుకోలేక గెలవాల్సిన చాలా మ్యాచ్‌ల్లో ఆఫ్ఘాన్‌ ఓడిపోయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం ఉన్న పెద్ద జట్లకు, అద్బుత టాలెంట్‌ ఉండి, అనుభవం లేని చిన్న జట్లకు ప్రధానంగా ఉండే తేడా ఒక్కటే.. ఒత్తిడిని బ్యాలెన్స్‌ చేయడం. చిన్న జట్లు ఒత్తిడికి చిత్తు అయితే.. పెద్ద టీమ్స్‌ ఒత్తిడి జయించి విజయం వశం చేసుకుంటాయి. అయితే.. తాజాగా పాకిస్థాన్‌లో కూడా ఒత్తిడి జయిస్తున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. నిన్నటి మ్యాచే అందుకు మంచి ఉదాహరణ. విజయానికి 80 పరుగులు కావాల్సిన దశ నుంచి రన్‌ ఏ బాల్‌ ఇక్వెషన్‌ ఉంది. సాధారణంగా పాత ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు అయితే.. ఈ ఒత్తిడిలో వికెట్లు కోల్పోతూ.. భారీ షాట్లు ఆడుతూ తత్తరపాటుకు గురయ్యేది.

కానీ, నిన్నటి మ్యాచ్‌లో హష్మతుల్లా, రహ్మత్‌ ఎక్కడా కూడా టెన్షన్‌ పడలేదు. సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ.. చాలా ఈజీగా లక్ష్యం దిశగా సాగారు. చెత్త బంతులు పడినప్పుడే బౌండరీలు బాదారు. కావాల్సిన రన్‌రేట్‌ను మెయిటెంన్‌ చేస్తూ.. ఎంతో పరిణతి చెందిన టీమ్‌లా ఆడారు. చివరి కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అద్భుత విజయం అందుకున్నారు. అయితే.. నిన్నటి మ్యాచ్‌ తర్వాత చాలా మంది ఆఫ్ఘనిస్థాన్‌ విజయం కంటే.. వారిలో వచ్చిన ప్రెజర్‌ హ్యాండిల్‌ ఎబిలిటీ గురించి ఎక్కువగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆ అద్భుత పవర్‌ వెనుక ఓ ఇండియన్‌ మహారాజా ఉన్నాడనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు​. అతనే.. టీమిండియా మాజీ కెప్టెన్‌ అజయ్‌ జడేజా. ఇతన్ని మహారాజా ఆఫ్‌ ఇండియన్‌ టీమ్‌ అని పిలిచేవారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో టీమిండియాకు దూరమైనా.. అంతకుముందు టీమిండియాలో అజయ్‌ జడేజా ఓ సంచలనం.

1992 నుంచి 2000 వరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన అజయ్‌ జడేజా.. అద్భుత ఫీల్డర్‌గా, అలాగే మంచి బ్యాటర్‌గా పేరుతెచ్చుకున్నాడు. కొన్ని మ్యాచ్‌లకు టీమిండియా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. టీమిండియా తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడిన అనుభవం ఉంది అజయ్‌ జడేజాకు. టెస్టుల్లో 576, వన్డేల్లో 5359 పరుగులున్నాయి. అయితే.. అజయ్‌ జడేజాకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే.. ఒత్తిడి తట్టుకుని అద్భుతంగా ఆడటం. పైగా జడేజా అద్భుతమైన మోటివేటర్‌ అని కూడా అతనితో ఆడిన ఆటగాళ్లు చెబుతుంటారు. 1996 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌తో క్వార్టర్‌ ఫైనల్‌లో జరిగిన మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లో 45 రన్స్ చేసి టీమిండియాకు సంచలన విజయం అందించాడు అజయ్‌ జడేజా. అతని కెరీర్‌లో ఇది గొప్ప ఇన్నింగ్స్‌గా నిలిచిపోయింది. ఇప్పుడే అదే అనుభవాన్ని ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్‌తో పంచుకుంటూ.. ఆ జట్టులో అద్భుతమైన మార్పు తెస్తున్నాడు. అజయ్‌ జడేజా ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరి ఆఫ్ఘాన్‌ విజయాల వెనుక అజయ్‌ జడేజా ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ దసరా సెలబ్రేషన్స్.. ఆయుధ పూజ అదిరింది!

Show comments