Somesekhar
ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతుండగా మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ పై ఓ విమానం అనుమానస్పదంగా చక్కర్లు కొట్టడమే కాకుండా ఓ బ్యానర్ ను సైతం ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఆటగాళ్ల భద్రతపై ఆందోళన రేకెత్తుతోంది.
ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతుండగా మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ పై ఓ విమానం అనుమానస్పదంగా చక్కర్లు కొట్టడమే కాకుండా ఓ బ్యానర్ ను సైతం ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఆటగాళ్ల భద్రతపై ఆందోళన రేకెత్తుతోంది.
Somesekhar
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య నాసౌవ్ కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చివరి వరకూ నరాలు తెగే ఉత్కంఠతతో సాగిన ఈ హై ఓల్టేజ్ పోరులో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి భద్రతా లోపం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతుండగా మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ పై ఓ విమానం అనుమానస్పదంగా చక్కర్లు కొట్టడమే కాకుండా ఓ బ్యానర్ ను సైతం ప్రదర్శించింది.
ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ లో భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది. తొలి నుంచి వరల్డ్ కప్ కు టెర్రరిస్టుల నుంచి ముప్పు ఉందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆటగాళ్లకు భద్రతను కట్టుదిట్టం చేసింది అమెరికా ప్రభుత్వం. ఈ విషయంపై ఐసీసీ కూడా ప్లేయర్ల ప్రాణాలకు ఎలాంటి సమస్య రాకుండా ఆధునిక భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇలాంటి సమయంలో తాజాగా జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ విమానం అనుమానాస్పదంగా చక్కర్లు కొట్టడం, పైగా ఇమ్రాన్ ఖాన్ ను రిలీజ్ చేయాలి అంటూ బ్యానర్ ను ప్రదర్శించడం కలకలం రేపింది.
సాధారణంగా ఇంటర్నేషనల్ మ్యాచ్ లు జరుగుతున్న క్రికెట్ స్టేడియాల పరిధిలో ఎలాంటి విమానాలను ఎగరనివ్వరు. ఇందుకు సంబంధించి ముందుగానే భద్రతా దళాలు పూర్తి సెక్యూరిటీని చూసుకుంటాయి. అలాంటిది ఇండియా-పాక్ మ్యాచ్ లాంటి హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుండగా.. గ్రౌండ్ గగనతలంలో విమానం చక్కర్లు కొట్టడం, రిలీజ్ ఇమ్రాన్ ఖాన్ బ్యానర్ ను ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశాం అని చెప్పిన అమెరికా ఈ లోపాన్ని ఎందుకు గుర్తించలేకపోయింది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగిలిపోయింది. విమానం ఇలా చెక్కర్లు కొట్టడంతో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన రేకెత్తుతోంది. ఇప్పటికే పాక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారత్-పాక్ మ్యాచ్ పై దాడి చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇలా ఫ్లైట్ చక్కర్లు కొట్టడం.. రిలీజ్ ఇమ్రాన్ ఖాన్ అనే బ్యానర్ ను ప్రదర్శించడం ఆందోళనకు దారితీస్తోంది. మరి ఈ భద్రతా వైఫల్యంపై అమెరికా, ఐసీసీ ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి.
Release Imran Khan 🇵🇰#PakvsInd pic.twitter.com/FOPnnWy3Se
— PTI (@PTIofficial) June 9, 2024