ఆసీస్ బౌలర్లను దంచికొడుతూ.. మార్క్రమ్ విధ్వంసకర శతకం

  • Author Soma Sekhar Published - 09:53 PM, Tue - 12 September 23
  • Author Soma Sekhar Published - 09:53 PM, Tue - 12 September 23
ఆసీస్ బౌలర్లను దంచికొడుతూ.. మార్క్రమ్ విధ్వంసకర శతకం

ప్రస్తుతం ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య 5 మ్యాచ్ ల వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా తాజాగా కీలకమైన మూడో వన్డే జరుగుతోంది. తొలి రెండు వన్డేల్లో ఓడిన కసితో ఉన్న సౌతాఫ్రికా బ్యాటర్లు ఈ మ్యాచ్ లో చెలరేగిపోయారు. ముఖ్యంగా ప్రోటీస్ టీమ్ స్టార్ ప్లేయర్ ఎయిడెన్ మార్ర్కమ్ ఆసీస్ బౌలర్లను చీల్చిచెండాడుతూ.. విధ్వంసకర శతకం బాదాడు. దీంతో ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది సౌతాఫ్రికా టీమ్. మార్క్రమ్ కు తోడుగా మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.

5 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా.. సౌతాఫ్రికా-ఆసీస్ మధ్య తాజాగా మూడో వన్డే జరుగుతోంది. కీలకమైన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు విజృంభించారు. ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలింగ్ ను దంచికొట్టారు. సౌతాఫ్రికా జట్టులో స్టార్ ప్లేయర్ ఎయిడెన్ మార్క్రమ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో మార్క్రమ్ ఓ విధంగా థండర్ ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. ఒకనొక దశలో సెంచరీ చేస్తాడో.. చెయ్యడో అన్న సందేహం నుంచి విధ్వంసకర శతకం బాదాడు ఈ బ్యాటర్. మార్క్రమ్ కేవలం 74 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

మిగతా ప్లేయర్లలో ఓపెనర్ డి కాక్(82), కెప్టెన్ బవుమా(57), హెండ్రిక్స్(39) పరుగులతో రాణించారు. ఇక ఆసీస్ బౌలర్లలో హెడ్ 2 వికెట్లు తీయగా, సంగా, నాథన్ ఎల్లిస్, స్టోయినిస్ తలా ఓ వికెట్ తీశారు. అనంతరం 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు ఓపెనర్లు మంచి శుభారంభమే ఇచ్చారు. వీరిద్దరు తొలి వికెట్ కు 7.5 ఓవర్లలోనే 79 పరుగులు జోడించారు. అయితే ఈ జంటను మగళ విడగొట్టాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన మిచెల్ మార్ష్ తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ప్రస్తుతం వార్నర్ 30 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లతో 54 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

Show comments