SNP
Aiden Markram, Shamar Joseph, SA vs WI: సౌతాఫ్రికా జట్టుకు బ్యాటింగ్‌లో నమ్మదగిన బ్యాటర్‌గా మారిన మార్కరమ్‌ను మడతబెట్టేశాడు ఓ కరేబియన్ కుర్ర బౌలర్. అతని దెబ్బకు మార్కరమ్ నోరెళ్లబెట్టాడు. ఆ సూపర్ డెలవరీ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Aiden Markram, Shamar Joseph, SA vs WI: సౌతాఫ్రికా జట్టుకు బ్యాటింగ్‌లో నమ్మదగిన బ్యాటర్‌గా మారిన మార్కరమ్‌ను మడతబెట్టేశాడు ఓ కరేబియన్ కుర్ర బౌలర్. అతని దెబ్బకు మార్కరమ్ నోరెళ్లబెట్టాడు. ఆ సూపర్ డెలవరీ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్లలో ఎడెన్ మార్కరమ్ ఒకడు. క్రీజ్‌లో కుదురుకుంటే.. ఎలాంటి బౌలర్‌నైనా కనికరం లేకుండా కొట్టేస్తాడు. మంచి స్టైలిష్ అండ్ టెక్నికల్లీ సౌండ్ ప్లేయర్‌గా పేరుతెచ్చకున్న మార్కరమ్ మావనే నోరెళ్లబెట్టేలా చేశాడు కరేబియన్ కుర్ర బౌలర్. ఓ సూపర్ డెలవరీతో మార్కరమ్ కనీసం బ్యాట్‌ను కొంచెం కూడా కదిలించకముందే.. వికెట్లను బాల్‌తో గాల్లోకి గిరాటేయించాడు. వెస్టిండీస్ జట్టులో సంచలనంగా మారిన షమర్ జోసెఫ్ ఈ అద్భుతంగా చేశాడు. అతను వేసిన బాల్‌ను అంచనా వేయడంలో మార్కరమ్ పూర్తిగా విఫలం అయ్యాడు. అసలు ఏం జరిగిందో కూడా అతనికి అర్థం కాలేదు.
గురువారం గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య మ్యాచ్ ప్రారంభం అయింది. ప్రొటీస్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ ఆరంభించిన కొద్ది సేపటికే ఓపెనర్ టోనీ డి జోర్జి వికెట్ కోల్పోయింది. అతను కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి.. పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత.. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాల్సిన బాధ్యత మార్కరమ్‌పై పడింది. 29 బంతుల్లో 14 పరుగులు చేసి.. క్రీజ్‌లో కుదురుకునే ప్రయత్నం చేస్తున్న మార్కరమ్.. విండీస్ యువ ఆల్‌రౌండర్ షమర్ జోసెఫ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ మూడో బంతికి ఒక అద్భుతమైన ఇన్‌స్వింత్ డెలవరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు.
నిజానికి ఆ బాల్‌ను మార్కరమ్ ఆడకుండా వదిలేద్దాం అనుకున్నాడు.. కానీ షమర్ సూపర్ టెన్నిక్‌తో బాల్ బుల్లెట్ వేగంతో లోపలికి దూసుకొచ్చి.. ఆఫ్ స్టంప్‌ను ఢీ కొట్టింది. అసలు ఏం జరిగిందో అర్థం కాక మార్కరమ్ కొద్ది సేప అలాగే షాక్‌లో ఉండిపోయి.. వెనక్కి తిరిగి వికెట్లను చూసుకున్నాడు. తర్వాత చేసేదేం లేక పెవిలియన్ బాట పట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 160 పరుగులకే కుప్పకూలింది. ట్రిస్టన్ స్టబ్స్ 26, బెండింగ్‌హామ్ 28, డేన్ పీడ్ట్ 38, నాంద్రే బర్గర్ 23 పరుగులు చేసి రాణించారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. కెప్టెన్ బవుమాతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. జెసన్ హోల్డర్ 33 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. మరి ఈ మ్యాచ్‌లో షమర్ జోసెఫ్ సూపర్ డెలవరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
SHAMAR JOSEPH HAS PICKED A FIFER…!!! 🫡pic.twitter.com/rZ9vufczhK
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 15, 2024