SNP
ఐపీఎల్ 2024 కోసం తాజాగా ఆటగాళ్ల మినీ వేలం జరిగింది. ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఎంతో దూకుడుగా వ్యవహరించింది. రూ.20.50 కోట్ల భారీ ధరపెట్టి ఓ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసింది. ఈ వేలంతో మరి ఎస్‌ఆర్‌హెచ్ బలపడిందా? లేదా? ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ 2024 కోసం తాజాగా ఆటగాళ్ల మినీ వేలం జరిగింది. ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఎంతో దూకుడుగా వ్యవహరించింది. రూ.20.50 కోట్ల భారీ ధరపెట్టి ఓ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసింది. ఈ వేలంతో మరి ఎస్‌ఆర్‌హెచ్ బలపడిందా? లేదా? ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్ కోసం మంగళవారం దుబాయ్ వేదికగా ఆటగాళ్ల మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డులు బద్దలు అయ్యాయి. అత్యధికగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి కోల్‌కత్తా నైట్ రైడర్స దక్కించుకుంది. గతంలో ఏ ఆటగాడికి కూడా ఇంత భారీ మొత్తం చెల్లించలేదు. అయితే.. అంతకంటే ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. స్టార్క్ కొనుగోలు కంటే ముందు.. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధరగా కమిన్స్‌కు చెల్లించిన మొత్తం నిలిచింది. కానీ, ఆ రికార్డు ఇదే వేలంలో బ్రేక్ కావడం విశేషం. ఈ మినీ వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ ఎంతో దూకుడుగా వ్యవహరించింది. ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, వనిందు హసరంగా, జయ్‌దేవ్ ఉనద్కట్, ఆకాశ్ సింగ్, జాథవెద్ సుబ్రమణ్యన్ లను కొనుగోలు చేసింది. అయితే.. ఈ మినీ వేలం తర్వాత.. ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ బలపడిందా? లేక మరింత బలహీనపడిందా? అనే అనుమానులు హైదరాబాద్ అభిమానుల్లో నెలకొన్నాయి. అసలు మినీ ఆక్షన్ తర్వాత.. ఎస్‌ఆర్‌హెచ్ పూర్తి టీమ్‌ను పరిశీలించి.. టీమ్ కాంబినేషన్, ప్లేయింగ్ ఎలా ఉండబోతుందో చూసి.. ఎస్‌ఆర్‌హెచ్ బలపడిందా? బలహీన పడిందా చూద్దాం..
మంగళవారం కొనుగోలు చేసిన ఆటగాళ్లతో కలిపి, అసలు మొత్తం టీమ్ ఏంటో ఒకసారి చూద్దాం.. అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, హెన్రీచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, షెహ్‌బాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజలక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, వనిందు హసరంగా, జయ్‌దేవ్ ఉనద్కట్, ఆకాశ్ సింగ్, జాథవెద్ సుబ్రమణ్యన్. ఇలా పేర్లు చూసుకుంటూ వెళ్తే.. పేపర్‌పై సన్‌రైజర్స్ ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. కానీ, బరిలోకి దిగాల్సిన ఆటగాళ్లు కేవలం 11 మంది మాత్రమే అనే విషయం అందరికి తెలిసిందే. పైగా అందులోనూ చాలా రూల్స్ ఉన్నాయి. విదేశీ ఆటగాళ్లు నలుగురికి మించి టీమ్‌లో ఉండకూడదు. ఈ రూల్‌ను బహుషా ఎస్‌ఆర్‌హెచ్ మర్చిపోయిందా? అనే అనుమానం కూడా కలుగుతోంది. ఎందుకంటే.. ఇప్పటికే జట్టులో భారీగా విదేశీ ఆటగాళ్లు ఉన్నా.. వేలంలో మళ్లీ ఫారెన్ ప్లేయర్స్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
ప్యాట్ కమిన్స్‌కు రూ.20.50 కోట్ల భారీ ధర పెట్టింది. ట్రావిస్ హెడ్ మంచి పిక్ అనుకున్నా.. వనిందు హసరంగాను తక్కువ ధరకే దక్కించకుంది. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్‌లో ఉన్న విదేశీ ఆటగాళ్లను ఒకసారి చూస్తే.. కెప్టెన్ మార్కరమ్, గ్లెన్ ఫిలిప్స్, క్లాసెన్, మార్కో జాన్సెన్, ఫరూఖీ, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, వనిందు హసరంగా.. ఇలా అందరూ స్టార్ ఆటగాళ్ల. వీరిని పక్కనపెడితే.. టీమ్‌లో పెద్దగా పసలేదు. ఎస్‌ఆర్‌హెచ్ బలం అంతా విదేశీ ఆటగాళ్లే. కానీ, టీమ్‌లో ఉండాల్సింది నలుగురు మాత్రమే. మరి ఇంతమంది స్టార్ ఆటగాళ్లలో నాలుగురి మాత్రమే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంచడం సన్‌రైజర్స్ హెడ్ కోచ్, టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సమస్య. కెప్టెన్‌గా ఉన్న మార్కరమ్ కచ్చితంగా టీమ్‌లో ఉండాల్సింది. ఇక మిగిలింది మూడు స్థానాలు వారిలో భారీ ధర పెట్టి కొన్న కమిన్స్ కూడా టీమ్‌లో ఉంటాడు. ఇక రెండు స్థానాల్లో ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్, ఆల్‌రౌండర్‌గా మార్కో జాన్సెన్‌లను ఆడించే అవకాశం ఉంది. దీంతో.. మిగతా స్టార్ ప్లేయర్లు బెంచ్‌కే పరిమతం అవుతారు. ఈ రకంగా ఫారెన్ ప్లేయర్ల విషయంలో ఎస్‌ఆర్‌హెచ్ స్ట్రాటజీ విఫలమైందనే చెప్పాలి. ఇండియన్ టీమ్ నుంచి స్టార్ ప్లేయర్లు లేకపోవడం, దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న స్వదేశి ప్లేయర్లపై కూడా ఎస్‌ఆర్‌హెచ్ పెద్దగా నమ్మకం ఉంచకపోవడం దెబ్బ కొట్టే విషయమే.
ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, మయాంక్ అగర్వాల్, మార్కో జాన్సెన్, వాసింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, టీ.నటరాజన్.
— IndianPremierLeague (@IPL) December 20, 2023