T20 World Cup: మరో సంచలనం.. ఆఫ్ఘాన్‌ చేతిలో న్యూజిలాండ్‌ చిత్తు!

AFG vs NZ, Afghanistan, New Zealand, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో మరో సంచలనం నమోదైంది. బ్లాక్‌ క్యాప్స్‌కు టీ20ల్లో డేంజరస్‌ టీమ్‌గా మారిన ఆఫ్ఘనిస్థాన్‌ ఊహించని షాక్‌ ఇచ్చి.. చిత్తు చిత్తుగా ఓడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

AFG vs NZ, Afghanistan, New Zealand, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో మరో సంచలనం నమోదైంది. బ్లాక్‌ క్యాప్స్‌కు టీ20ల్లో డేంజరస్‌ టీమ్‌గా మారిన ఆఫ్ఘనిస్థాన్‌ ఊహించని షాక్‌ ఇచ్చి.. చిత్తు చిత్తుగా ఓడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో మరో సంచలనం నమోదు అయింది. ఇటీవల పాకిస్థాన్‌ను అమెరికా లాంటి పసికూన జట్టు ఓడించింది. ఇప్పుడు టీ20 క్రికెట్‌లో ఎంతో పటిష్టమైన న్యూజిలాండ్‌కు షాకిస్తూ.. డేంజరస్‌ టీమ్‌ ఆఫ్ఘనిస్థాన్‌ విజయం సాధించింది. వెస్టిండీస్‌లోని గయానా వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఆఫ్ఘాన్‌ బౌలర్లు రషీద్‌ ఖాన్‌, ఫరూఖీ వికెట్ల పంట పండించారు. రషీద్‌ 4, ఫరూఖీ 3 వికెట్లతో న్యూజిలాండ్‌ను కుప్పకూల్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్థాన్‌కు ఓపెనర్‌ రహమనుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు ఏకంగా 103 పరగులు జోడించారు. గుర్బాజ్‌ 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 80 పరుగులు చేసి అదరగొట్టాడు.

అలాగే ఇబ్రహీం జద్రాన్‌ 41 బంతుల్లో 44 పరుగులు చేసి రాణించారు. అజ్మతుల్లా 13 బంతుల్లో 22 పరుగులు పర్వాలేదనిపించాడు. అయితే.. ఓపెనర్లు ఇచ్చిన స్టార్ట్‌ను తర్వాత వచ్చిన బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. నబీ 0, కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ 6, కరీమ్‌ జనత్‌ 1 గుల్బుద్దీన్‌ 0, నజీబుల్లా 1 ఇలా అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో.. ఆఫ్ఘనిస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితం అయింది. 160 పరుగుల టార్గెట్‌తో బరిలోకి న్యూజిలాండ్‌ను ఆఫ్ఘాన్‌ స్టార్‌ బౌలర్‌ ఫజల్‌ హక్‌ ఫరూఖీ వణికించాడు. ఓపెనర్లు ఫిన్‌ అలెన్‌ను గోల్డెన్‌ డక్‌గా అవుట్‌ చేశాడు. తర్వాత డెవాన్‌ కాన్వెను కూడా అవుట్‌ చేశాడు. ఫరూఖీకి రషీద్‌ ఖాన్ కూడా తోడయ్యాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను రషీద్‌ ఖాన్‌ అవుట్‌ అయ్యాడు.

ఇలా వరుసగా న్యూజిలాండ్‌ వికెట్లు కోల్పోతూ వచ్చింది. మొత్తంగా కేవలం 75 పరుగులకే కుప్పకూలి.. ఏకంగా 84 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో కేవలం ఇద్దరు మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ చేశారు. 9 మంది ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే అవుట్‌ అయ్యారు. అలెన్‌, కాన్వె, విలియమ్సన్‌, డార్లీ మిచెల్‌, బ్రాస్‌వెల్‌, సాంట్నర్‌ ఇలా అంతా సింగిల్‌ డిజిట్‌కే అవుట్‌ అయ్యారు. ఆఫ్ఘనిస్థాన్‌ బౌలర్లలో ఫరూఖీ 4, రషీద్‌ ఖాన్‌ 4, మొహమ్మద్‌ నబీ 2 వికెట్లు సాధించి.. ఆఫ్ఘన్‌కు అద్భుతమైన విజయం అందించారు. మరి ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆఫ్ఘాన్‌ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments