iDreamPost
android-app
ios-app

విరాట్ కోహ్లీ ఇంట శుభవార్త! వారసుడు వస్తున్నాడట!

  • Published Feb 03, 2024 | 7:21 PM Updated Updated Feb 03, 2024 | 7:21 PM

విరాట్ అభిమానులకు గుడ్ న్యూస్. జూనియర్ కోహ్లీ రాబోతున్నాడట. తమ రెండో బిడ్డ కోసం కోహ్లీ దంపతులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారట. దీనికి సంబంధించి ఏబీ డివిలియర్స్ సోషల్ మీడియా వేదికగా సీక్రెట్ వెల్లడించాడు.

విరాట్ అభిమానులకు గుడ్ న్యూస్. జూనియర్ కోహ్లీ రాబోతున్నాడట. తమ రెండో బిడ్డ కోసం కోహ్లీ దంపతులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారట. దీనికి సంబంధించి ఏబీ డివిలియర్స్ సోషల్ మీడియా వేదికగా సీక్రెట్ వెల్లడించాడు.

  • Published Feb 03, 2024 | 7:21 PMUpdated Feb 03, 2024 | 7:21 PM
విరాట్ కోహ్లీ ఇంట శుభవార్త! వారసుడు వస్తున్నాడట!

స్వదేశంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో భారత్ ఓటమిని చవిచూసింది. ఇక విశాఖ వేదికగా రెండో టెస్టు జరుగుతోంది. అయితే ఈ టెస్టు మ్యాచ్ లలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ కోహ్లీ దూరమయ్యారు. అయితే విరాట్ టెస్టు మ్యాచ్ లకు దూరం కావడానికి వ్యక్తిగత కారణాలే అని బీసీసీఐ తెలిపింది. ఇదిలా ఉంటే అసలు కోహ్లీ టెస్టు మ్యాచ్ లకు దూరమై కుటుంబంతో గడపడానికి గల కారణాలను సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

విరాట్ కోహ్లీ- అనుష్కశర్మ దంపతులకు ఇదివరకు కూతురు జన్మించిన విషయం తెలిసిందే. కాగా తమ గారాల పట్టీకి సంబంధించిన ఫొటోలను బయటికి రాకుండా ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇక ఈ మధ్య విరుష్క జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ టాక్ వినిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి మరింత బలాన్ని చేకూర్చుతూ ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇంట శుభవార్త వినిపించనుందట.

త్వరలోనే జూనియర్ కోహ్లీ వస్తున్నాడట. దీనికి సంబంధించిన విషయాన్నే డివిలియర్స్ వెల్లడించారు. విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ తమ 2వ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి విరాట్ తన కుటుంబంతో గడుపుతున్నాడు అని డివిలియర్స్ తెలిపాడు. ఇక జూనియర్ కోహ్లీ వస్తుండన్న వార్తల నేపథ్యంలో విరాట్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. విరుష్క దంపతులకు ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet