RCB ఓటమి.. కామెంట్రీ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న AB డివిలియర్స్‌!

Ab De Villiers, RCB vs RR, IPL 2024: ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతుల్లో ఆర్సీబీ ఓటమి పాలైన తర్వాత.. ఏబీ డివిలియర్స్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Ab De Villiers, RCB vs RR, IPL 2024: ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతుల్లో ఆర్సీబీ ఓటమి పాలైన తర్వాత.. ఏబీ డివిలియర్స్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024 ఆరంభంలో ఆర్సీబీ ఆట చూసి.. ఈ సీజన్‌లో ఫస్ట్‌ ఇంటికి వెళ్లే టీమ్‌ ఆర్సీబీనే అనిపించింది అందరికి. తొలి 8 మ్యాచ్‌ల్లో ఏకంగా 7 మ్యాచ్‌లు ఓడిపోయింది. కానీ, అక్కడి ఉంచి అనూహ్యంగా పుంజుకుని.. వరుస విజయాలతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ప్లే ఆఫ్స్‌కు చేరింది. అసలు ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ వరకు వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు. కానీ, ప్లే ఆఫ్స్‌కు ఒక యుద్ధం చేసి వచ్చిన ఆర్సీబీ.. ఎలిమినేటర్‌లోనే తమ పోరాటం ముగించింది. ఎంతో అద్భుతంగా ఆడి.. సరైన ఫలితం దక్కకుండానే ఈ సీజన్‌ను ముగించింది. ఐపీఎల్‌ ట్రోఫీ కొట్టాలనే వారి కల మళ్లీ అలాగే మిగిలిపోయింది. ఆర్సీబీ ఓటమిని తట్టుకోలేక చాలా మంది అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిలో దిగ్గజ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ కూడా ఉన్నాడు.

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌.. చాలా కాలం పాటు ఆర్సీబీకి ఆడిన విషయం తెలిసిందే. విరాట్‌ కోహ్లీతో కలిసి ఎన్నో మ్యాచ్‌ల్లో ఆర్సీబీని గెలిపించాడు. కానీ, కప్పు మాత్రం అందించలేకపోయాడు. డివిలియర్స్‌ లేకపోయినా.. కోహ్లీ ఒంటరిగానే ఐపీఎల్‌ టైటిల్‌ కోసం పోరాడుతున్నాడు. అతని పోరాటానికి ఈ ఏడాది ఫలితం దక్కుతుందేమో అని ఎంతో ఆశగా డివిలియర్స్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ చూశాడు. ఆర్సీబీ కచ్చితంగా గెలిచి తీరుతుంది అంటూ.. తన ఫుల్‌ సపోర్ట్‌ ఆర్సీబీకి ఇచ్చాడు. కానీ, ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ ఓటమిని చూసి తట్టుకోలేక.. కామెంట్రీ బాక్స్‌లో ఉన్న డివిలియర్స్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసింది. కోహ్లీ 33, గ్రీన్‌ 27, పాటిదార్‌ 34, లోమ్రోర్‌ 32 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌ 3, అశ్విన్‌ 2 వికెట్లతో సత్తా చాటారు. బౌల్ట్‌, సందీప్‌ శర్మ, చాహల్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. ఇక 173 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగుల చేసి గెలిచింది. జైస్వాల్‌ 45, రియాన్‌ పరాగ్‌ 36, హేట్‌మేయర్‌ 26 పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌ 2, ఫెర్గుసన్‌, కరణ్‌ శర్మ, గ్రీన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ప్రదర్శనతో పాటు.. ఆర్సీబీ ఓడిపోయిందని ఏబీ డివిలియర్స్‌ కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments