వీడియో: వీడెవడో కోహ్లీకి వారసుడిలా ఉన్నాడు! పాక్‌కు కోహ్లీలా సేమ్‌ ట్రీట్మెంట్‌ ఇచ్చాడుగా..!

Aaron Jones, Virat Kohli, Haris Rauf, PAK vs USA: టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ను అమెరికా ఓడించడంలో ఓ కోహ్లీ ఫ్యాన్‌ సాయపడ్డాడు. రెండేళ్ల క్రితం కోహ్లీ ఏం చేశాడో ఇప్పుడు అతను అదే చేశాడు. కానీ, అప్పుడు ఇప్పుడు బలైంది మాత్రం ఒక్కడే. అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..

Aaron Jones, Virat Kohli, Haris Rauf, PAK vs USA: టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ను అమెరికా ఓడించడంలో ఓ కోహ్లీ ఫ్యాన్‌ సాయపడ్డాడు. రెండేళ్ల క్రితం కోహ్లీ ఏం చేశాడో ఇప్పుడు అతను అదే చేశాడు. కానీ, అప్పుడు ఇప్పుడు బలైంది మాత్రం ఒక్కడే. అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ చిత్తుగా ఓడింది. అది కూడా ఒక అసోసియేట్‌ టీమ్‌ అయిన అమెరికా చేతుల్లో చిత్తుగా ఓడి.. ఘోర అవమానం మూటగట్టుకుంది. ఈ విజయంతో అమెరికా ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో తొలి సంచలనం నమోదు చేసింది. వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో చిన్న టీమ్స్‌ పెద్ద జట్లకు షాక్‌ ఇవ్వడం కామన్‌గా మారిపోయినా.. మరి అమెరికా లాంటి పసికూన జట్టు.. టీ20ల్లో డేంజరస్‌ టీమ్‌గా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్‌ను ఓడించడం అంటే చిన్న విషయం కాదు. ఈ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసినా.. పాక్‌ గెలవలేకపోయింది. అయితే.. ఈ ఓటమికి కారణం పాక్‌ స్టార్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ అంటూ కూడా సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఓటమికి, ఇప్పుడు అమెరికా చేతిలో ఓటమికి రౌఫ్‌ బౌలింగ్‌ కారణం అంటూ పాక్‌ క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో జరిగిన ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను అంత సాధారణంగా ఏ క్రికెట్‌ అభిమాని కూడా మర్చిపోడు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిందా మ్యాచ్‌.. టీమిండియాను దేవుడిలా గెలిపించాడు విరాట్‌ కోహ్లీ. చివరి 8 బంతుల్లో 28 పరుగులు అవసరమైన సమయంలో.. 19వ ఓవర్‌ వేస్తున్న హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో చివరి రెండు బంతుల్లో రెండు సిక్సులు కొట్టి.. మ్యాచ్‌ను ఇండియా వైపు తిప్పేశాడు. మొత్తంగా 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. భారత్‌ను గెలిపించాడు కోహ్లీ. ఆ మ్యాచ్‌లో కొట్టిన స్ట్రైయిట్‌ సిక్స్‌ను షాట్‌ ఆఫ్‌ ది సెంచరీగా ఐసీసీనే ప్రకటించింది. అంతటి ప్రెజర్‌లో విరాట్‌ కోహ్లీ కనుక ఆడాడు, నా బౌలింగ్‌లో మరో బ్యాటర్‌కు అంత బాగా ఆడే సీన్‌ లేదు అంటూ.. ఓటమిని కవర్‌ చేసుకున్నాడు హరీస్‌ రౌఫ్‌.

కానీ, ఇప్పుడు ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ను గెలిపించడానికి చివరి ఓవర్‌లో 15 పరుగులు డిఫెండ్‌ చేయడానికి చివరి ఓవర్‌ వేసేందుకు వచ్చిన హరీస్‌ రౌఫ్‌.. ఈ సారి ఎదురుగా కోహ్లీ లేకపోయినా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. ఈ సారి కోహ్లీ ప్లేస్‌లో రౌఫ్‌కు ఎదురుగా.. ఆరోన్‌ జోన్స్‌ అనే బ్యాటర్‌ నిలిచాడు. మ్యాచ్‌ గెలవడానికి 3 బంతుల్లో 12 పరుగులు అవసరమైన సమయంలో ఓ అద్భుతమైన సిక్స్‌తో మ్యాచ్‌ను అమెరికా వైపు తిప్పేశాడు. ఇక చివరి 2 బంతుల్లో 6 పరుగులు అవసరం కాగా.. 5 పరుగులు చేసి అమెరికా మ్యాచ్‌ను టై చేసుకున్నా.. తర్వాత సూపర్‌ ఓవర్‌లో సూపర్‌ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ గెలిచి.. చరిత్ర సృష్టించింది. మరి టీ20 వరల్డ్‌ కప్స్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో.. గెలవాల్సిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్‌ ఓటమికి కారణమై.. 2022లో కోహ్లీ చేతుల్లో, ఇప్పుడు ఆరోన్‌ చేతుల్లో హరీస్‌ రౌఫ్‌ బలి కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments