వీడియో: ఇతనెవరో బుమ్రాకి తమ్ముడిలా ఉన్నాడు.. బుల్లెట్‌ బంతులతో వికెట్లు గాల్లో ఎగరేస్తున్నాడు!

Aaqib Khan, Rajat Patidar, Duleep Trophy 2024: దేశవాళి క్రికెట్‌ టోర్నీ దులీఫ్‌ ట్రోఫీలో ఓ కుర్ర బౌలర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అతని బౌలింగ్‌కి వికెట్లు గాల్లో డ్యాన్స్‌ చేస్తున్నాయి. మరి బౌలర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Aaqib Khan, Rajat Patidar, Duleep Trophy 2024: దేశవాళి క్రికెట్‌ టోర్నీ దులీఫ్‌ ట్రోఫీలో ఓ కుర్ర బౌలర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అతని బౌలింగ్‌కి వికెట్లు గాల్లో డ్యాన్స్‌ చేస్తున్నాయి. మరి బౌలర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకవైపు టీమిండియా స్టార్‌ బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌.. బంగ్లాదేశ్‌ పని పడుతుంటే.. మరోవైపు భారత యువ బౌలర్లు ప్రతిష్టాత్మక దేశవాళి టోర్నీ దులీప్‌ ట్రోఫీలో దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా ఆకిబ్‌ ఖాన్‌ అనే కుర్రాడు నిప్పులు చెరుగుతున్నాడు. అతని పదునైన పేస్‌ చూస్తుంటే.. వామ్మో ఇతనెవరో బుమ్రాకు తమ్ముడిలా ఉన్నాడే అని అనిపిస్తోందంటూ క్రికెట్‌ అభిమానులు మెచ్చుకుంటున్నారు. దులీప్‌ ట్రోఫీలో భాగంగా.. అనంతపురంలోని రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ స్టేడియంలో ఇండియా-ఏ, ఇండియా-సీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ తరఫున ఆడుతున్న ఆకిబ్‌ ఖాన్‌ సూపర్‌ బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. 20 ఏళ్ల ఈ కుర్రాడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవాడు.

ఇండియా-సీ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ తొలి బంతికే రుతురాజ్‌ గైక్వాడ్‌ను అవుట్‌ చేశాడు ఆకిబ్‌ ఖాన్‌. వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చిన గైక్వాడ్‌ అవుట్‌ అయ్యాడు. నెక్ట్స్‌ బాల్‌కే రజత్‌ పాటిదార్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు ఆకిబ్‌ ఖాన్‌. అతని బాల్‌ వేగానికి వికెట్‌ గాల్లోకి ఎగిరిపడింది. ఆ డెలవరీకి రజత్‌ పాటిదార్‌ ఖంగుతిన్నాడు. ఆ బాల్‌ను ఆడలేక నేలపై కూర్చుండిపోయాడు. పాటిదార్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయిన విధానం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అబ్బ ఏం తీశాడు రా బాబు వికెట్‌ అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. 297 పరుగులకే ఆలౌట్‌ అయింది. రావత్‌ 124 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అలాగే ములాని 44, ఆవేష్‌ ఖాన్‌ 51 పరుగులు చేసి రాణించాడు. ఇండియా-సీ బౌలర్లలో కంబోజ్‌ 3, వైశాఖ్‌ 4, యాదవ్‌ 2 వికెట్లతో రాణించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇండియా-సీ జట్టు 23 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసి బ్యాటింగ్‌ చేస్తోంది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 17, సాయి సుదర్శన్‌ 17, పాటిదార్‌ 0, ఇషాన్‌ కిషన్‌ 5 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. బాబా ఇంద్రజిత్‌ 17, అభిషేక్‌ పొరెల్‌ 28 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మరి ఈ మ్యాచ్‌లో ఆకిద్‌ ఖాన్‌ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments