iDreamPost
android-app
ios-app

ఆ రోజుల్లో జహీర్ ఖాన్ క్రేజ్ గురించి తెలిపే వీడియో! గ్రౌండ్‌లోనే లవ్ ప్రపోజ్!

  • Published Aug 10, 2024 | 3:19 PM Updated Updated Aug 10, 2024 | 3:19 PM

Zaheer Khan, Love Proposal, IND vs PAK, Bengaluru: భారత మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌కు అప్పట్లో ఎంత క్రేజ్‌ ఉండేదో చెప్పేందుకు ఈ ఒక్క వీడియో చాలు. పైగా సోషల్‌ మీడియా లేని రోజుల్లోనే ఈ వీడియో తెగ వైరల్‌ అయింది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Zaheer Khan, Love Proposal, IND vs PAK, Bengaluru: భారత మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌కు అప్పట్లో ఎంత క్రేజ్‌ ఉండేదో చెప్పేందుకు ఈ ఒక్క వీడియో చాలు. పైగా సోషల్‌ మీడియా లేని రోజుల్లోనే ఈ వీడియో తెగ వైరల్‌ అయింది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Aug 10, 2024 | 3:19 PMUpdated Aug 10, 2024 | 3:19 PM
ఆ రోజుల్లో జహీర్ ఖాన్ క్రేజ్ గురించి తెలిపే వీడియో! గ్రౌండ్‌లోనే లవ్ ప్రపోజ్!

భారత క్రికెటర్లకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యువకులు మాత్రమే కాదు.. అమ్మాయిలు కూడా కొంతమంది క్రికెటర్లను ఎంతో అభిమానిస్తారు. మరీ ముఖ్యంగా కాస్త అందంగా ఉండే క్రికెటర్లకు అయితే.. లేడీ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ మామూలుగా ఉండదు. ఇప్పుడంటే.. సోషల్‌ మీడియా జమానాలో విరాట్‌ కోహ్లీ, శుబ్‌మన్‌ గిల్‌ లాంటి క్రికెటర్లకు లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బీభత్సంగా ఉంది. కానీ, అసలు సోషల్‌ మీడియా అంటే ఏంటో కూడా తెలియని రోజుల్లో.. ఓ భారత క్రికెటర్‌కు లేడీ క్రికెట్‌ ఫ్యాన్స్‌లో ఊహించలేని రేంజ్‌లో క్రేజ్‌ ఉండేది. ఆ క్రికెటర్‌ మరెవరో కాదు.. భారత మాజీ స్టార్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌.

యువరాజ్‌ సింగ్‌ లాంటి యంగ్‌ డైనమిక్‌ హ్యాండ్సమ్‌ క్రికెటర్‌ టీమిండియాలో ఉన్నా కూడా.. జహీర్‌ ఖాన్‌కు అమ్మాయిల్లో పిచ్చ క్రేజ్‌ ఉండేది. అందుకు మంచి ఉదాహరణే ఈ వీడియో. ఏకంగా మ్యాచ్‌ జరుగుతున్న సమయంలోనే లైవ్‌లో ఓ అందమైన అమ్మాయి జహీర్‌ ఖాన్‌కు ప్రపోజ్‌ చేసింది. అ వీడియో అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ ఓ సెన్సేషన్‌. 2005లో ఇండియా, పాకిస్థాన్‌ మధ్య 3 మ్యాచ్‌ల టీవీఎస్‌ టెస్ట్‌ సిరీస్‌ జరిగింది. బెంగళూరు వేదికగా జరిగిన మూడో టెస్టులో ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌ చోటు చేసుకుంది.

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ సమయంలో.. సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ క్రీజ్‌లో ఉన్నారు. ఆ మ్యాచ్‌ ఆడని జహీర్ ఖాన్‌ మిగతా ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చోని మ్యాచ్‌ చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఓ అమ్మాయి ‘జహీర్‌ ఐ లవ్‌ యూ’ అంటూ ప్లకార్డు పట్టుకుని స్టేడియంలో కూర్చుంది. కెమెరామెన్‌ ఆమెను ఫోకస్‌ చేయడంతో.. బిగ్ స్క్రీన్‌పై ఆమె కనిపించింది. వెంటనే జహీర్‌కు ఒక ప్లైయింగ్‌ కిస్‌ ఇచ్చింది. అది బిగ్‌ స్క్రీన్‌పై చూసిన యువరాజ్‌ సింగ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో తన వెనకాలే కూర్చోని ఉన్న జహీర్‌ ఖాన్‌ను ఆటపట్టించాడు. వెంటనే జహీర్ కూడా తన లేడీ ఫ్యాన్‌ను నిరాశపర్చకుండా సరదాగా ఒక ఫ్లైకింగ్‌ కిస్‌ ఇచ్చి.. ఆమెను ఉత్సాహపర్చాడు. ఇదంతా అప్పట్లో తెగ వైరల్‌ అయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో జహీర్‌ను యువీ ఆటపట్టించడం కూడా హైలెట్‌గా మారింది. మరి కింద ఉన్న ఆ వీడియో చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbigbossgrandpashabet