SNP
SNP
క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో బ్యాటర్లు భారీ సిక్సులు కొట్టిన సందర్భాల్లో బాల్ వెళ్లి స్టాండ్స్‌లో కూర్చున్న ప్రేక్షకుల మధ్య పడుతుంది. ఆ బాల్‌ను అందుకునేందుకు ప్రేక్షకుల పోటీ పడతారు. ఎవరో ఒక్కరికే ఆ బాల్ అందుతుంది.. దాంతో వాళ్లు సంతోషంతో ఊగిపోతారు. క్యాచ్ పట్టినంత సంబరపడి ఎగిరి గంతులేస్తుంటారు. సహజరంగా ఇది ప్రతి క్రికెట్ మ్యాచ్‌లో చూసే సీన్లే. కానీ, ఇలాంటి ఓ సందర్భం వచ్చినప్పుడు ఓ క్రికెట్ అభిమాని కాస్త వెరైటీగా స్పందించాడు. అతను చేసిన పనికి ఏకంగా అంపైర్లే షాక్ తిన్నారు. అంతకీ అతను ఏం చేశాడు? అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య డర్బన్ వేదికగా ఆదివారం మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్ తన్వీర్ సంఘా వేసిన 15వ ఓవర్ చివరి బంతికి దక్షిణాఫ్రికా ఆటగాడు డోనోవన్ ఫెరీరా కొట్టిన భారీ షాట్‌తో బాల్ వెళ్లి ప్రేక్షకుల మధ్య పడింది. ఆ బాల్‌ను అందుకున్న ఓ సౌతాఫ్రికా ఫ్యాన్ బాల్‌పై ఏదో రాసి.. తిరిగి బాల్‌ను గ్రౌండ్‌లోకి విసిరాడు. బాల్‌ను పరిశీలించిన తర్వాత అంపైర్లు షాక్ అయ్యారు.
ఆ బాల్‌పై అతను తన సంతకం చేశాడు. ఆటోగ్రాఫ్ చేసిన బాల్‌తో ఆటను కొనసాగించేందుకు అంపైర్లు అంగీకరించలేదు. బాల్‌పై అతని సంతకం చెరిపేసిన తర్వాత తిరిగి ఆటను కొనసాగించారు. ఈ విచిత్ర సంఘటన చూసి అంపైర్లతో పాటు ఆటగాళ్లు, కామెంటేటర్లు నవ్వుకున్నారు. సాధారణంగా ఆటగాళ్ల ఆటోగ్రాఫ్‌లను ప్రేక్షకులు అడిగి తీసుకుంటారు. బ్యాట్, బాల్, క్యాప్‌లపై ఆటోగ్రాఫ్ చేసి ఇస్తే.. సంతోషంగా తీసుకుంటారు. కానీ, ఇక్కడ క్రికెట్ ఫ్యాన్ తన ఆటగ్రాఫ్‌తో ఉన్న బాల్‌ను తిరిగి క్రికెటర్లకు ఇచ్చాడు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A fan in the crowd autographed the match ball and threw it back onto the field during the third T20I between South Africa and Australia👀 pic.twitter.com/0bNMF7KQzn
— CricTracker (@Cricketracker) September 3, 2023
ఇదీ చదవండి: సిక్సులతో హడలెత్తించిన హల్క్! కొడితే ఇలా కొట్టాలి.. సెంచరీ!