కోహ్లీ, రోహిత్‌ కాదు.. తెలుగు అభిమానుల్లో ఈ క్రికెటర్‌ క్రేజ్‌ చూడండి!

Ruturaj Gaikwad, Anantapur, Duleep Trophy 2024: భారత యువ క్రికెటర్‌, సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ కాళ్లు మొక్కాడో అభిమాని. ఆ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Ruturaj Gaikwad, Anantapur, Duleep Trophy 2024: భారత యువ క్రికెటర్‌, సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ కాళ్లు మొక్కాడో అభిమాని. ఆ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియాలో కొంతమంది స్టార్‌ క్రికెటర్లకు ఊహకందని క్రేజ్‌ ఉంటుంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లాంటి ప్లేయర్లు ఆ కోవకు చెందిన ఆటగాళ్లే. కానీ, వీళ్లని మించే క్రేజ్‌ను రుతురాజ్‌ గైక్వాడ్‌ సంపాదించుకున్నట్లు కనిపిస్తోంది. అది కూడా తెలుగు క్రికెట్‌ అభిమానుల్లో అలాంటి క్రేజ్‌ అంటే మాటలు కాదు. తాజాగా దులీప్‌ ట్రోఫీలో టీమిండియా స్టార్‌ క్రికెటర్లు చాలా మంది ఆడుతున్న విషయం తెలిసిందే. రిషభ్‌ పంత్‌, శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి వాళ్లతో పాటు రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా ఈ టోర్నీలో ఆడుతున్నాడు. ఇండియా-సీ టీమ్‌కు అతనే కెప్టెన్‌.

ఇండియా-డీ జట్టుతో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో గల రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో.. రుతురాజ్‌ గైక్వాడ్‌ ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి అతని కాళ్లు మొక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి క్రేజ్‌ను ఇప్పటి వరకు సచిన్‌ టెండూల్కర్‌, ధోని, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలకు మాత్రమే చూశాం అని.. వాళ్లకు కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో సాధించిన తర్వాత మాత్రమే అంత క్రేజ్‌ వచ్చిందని.. కానీ, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇంకా టీమిండియాలో చోటు కోసం స్ట్రగల్‌ ఫేస్‌ చేస్తున్న క్రమంలోనే ఇంత క్రేజ్‌ రావడంతో చాలా ఆశ్చర్యంగా ఉందని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు.

అయితే.. రుతురాజ్‌ గైక్వాడ్‌ టీమిండియాలో ప్లేస్‌ను పర్మినెంట్‌ చేసుకోలేకపోతున్నా.. డొమెస్టిక్‌ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో అద్భుత ఆటతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అతను చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ధోని అండర్‌లో ఆడటం, ఆ తర్వాత అదే టీమ్‌కు కెప్టెన్‌గా మారడంతో.. సీఎస్‌కే ఫ్యాన్స్‌లో చాలా మంది రుతురాజ్‌ను కాస్త స్పెషల్‌గా ఇష్టపడతారు. పైగా చాలా టాలెంట్‌ ఉన్నా.. టీమిండియాలో చోటు దక్కడం లేదనే సింపథి కూడా రుతురాజ్‌పై ఉంది. అతనికి క్రేజ్‌ రావడానికి అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక సీఎస్‌కేను తమిళనాడు వాళ్లే కాకుండా.. తెలుగు క్రికెట్‌ అభిమానులు కూడా సపోర్ట్‌ చేస్తూ ఉంటారు. అందుకు కారణం ధోని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోని శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న రుతురాజ్‌ను కూడా అంతే అభిమానంగా చూస్తున్నారు తెలుగు అభిమానులు. ఈ క్రమంలోనే తన అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాడో ఓ తెలుగు ఫ్యాన్‌. మరి అనంతపురంలో ఓ క్రికెట్‌ ఫ్యాన్‌ ఈ విధంగా రుతురాజ్‌ గైక్వాడ్‌ కాళ్లు మొక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments