SNP
Harshit Rana, Mayank Agarwal, IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ విషయంలో బీసీసీఐ సీరియస్ అయి.. చర్యలు తీసుకుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Harshit Rana, Mayank Agarwal, IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ విషయంలో బీసీసీఐ సీరియస్ అయి.. చర్యలు తీసుకుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ థ్రిల్లర్‌గా సాగింది. చివరి బంతి వరకు వెళ్లిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టీమ్ సూపర్ విక్టరీ కొట్టింది. చివరి ఓవర్‌తో మ్యాచ్‌కు హీరోగా మారిన హర్షిత్ రానాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే.. ఆ సంతోషాన్ని బీసీసీఐ ఎక్కువ సేపు ఉంచలేదు. మ్యాచ్ గెలిపించి హీరో అయిన హర్షిత్ రానాకు మ్యాచ్ ఫీజులో ఏకంగా 60 శాతం కోత పెట్టి.. తీవ్ర చర్యలు తీసుకుంది. అదేంటి మ్యాచ్ గెలిపిస్తే.. అవార్డులు ఇవ్వాలి కానీ, ఇలా జరిమానాలు విధిస్తారా? అని షాక్ అవ్వకండి. మనోడు మ్యాచ్ గెలిపించే ప్రదర్శన కంటే ముందు.. కాస్త అతి చేశాడు. అందుకే బీసీసీఐ బుద్ధి చెప్పింది. ఇంతకీ హర్షిత్ రానా ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..
కేకేఆర్ విధించిన 209 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. పవర్ ప్లేలో ఇద్దరూ బౌండరీలతో చెలరేగుతూ.. కేకేఆర్ బౌలర్లను పూర్తిగా డామినేట్ చేశారు. కేవలం 5.2 ఓవర్లలోనే ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు 60 పరుగులు బాదేశారు. ఇదే ఊపులో మయాంక్ అగర్వాల్.. హర్షిత్ రానా వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్ మూడో బంతికి భారీ షాట్ ఆడాడు. అది సరిగా కనెక్ట్ కాకపోవడంతో బౌండరీ లైన్ వద్ద రింకూ సింగ్ చేతుల్లో పడింది. ఇక కేకేఆర్‌కు తొలి వికెట్ అందించిన సంతోషంలో బౌలర్ హర్షిత్ రానా కాస్త అతి చేశాడు. మయాంక్ అగర్వాల్ ముందుకు వెళ్లి అతనికి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. ఇద్దరు కొద్ది సేపు అలానే కళ్లలో కళ్లుపెట్టి చూసుకున్నారు. కానీ, మయాంక్ ఏం మాట్లాడకుండా కామ్‌గా వెళ్లిపోయాడు. ఇదే ఇప్పుడు హర్షిత్‌కు 60 శాతం ఫైన్ పడేందుకు కారణమైంది.
అలా ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి నిబంధనలు ఉల్లఘించడంతో హర్షిత్ రానా మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తూ.. మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ సాల్ట్ 54, రమన్‌దీప్‌సింగ్ 35, రింకూ సింగ్ 23, ఆండ్రీ రస్సెల్ 64 పరుగులతో రాణించారు. 13 ఓవర్ల వరకు సాధారణంగా సాగిన కేకేఆర్ ఇన్నింగ్స్.. రమన్‌దీప్, రస్సెల్ హిట్టింగ్‌తో స్కోర్‌బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లి 200 మార్క్ దాటింది. ఇక 209 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి 4 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. హెన్రిచ్ క్లాసెన్ 29 బంతుల్లో 8 సిక్సులతో 63 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినా.. ఎస్‌ఆర్‌హెచ్‌ను గట్టెక్కించలేకపోయాడు. చివరి ఓవర్‌లో 13 పరుగులను హర్షిత్ రానా అద్భుతంగా డిఫెండ్ చేశాడు. అయినా కూడా అతనికి 60 శాతం ఫైన్ పడింది. మరి హర్షిత్‌కు పడిన ఫైన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Harshit Rana fined 60% of his match fees for giving Mayank Agarwal a send off. pic.twitter.com/kTXDBOXUtB
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2024