రూ.50 కోట్లతో రోహిత్‌ శర్మను కొనడంపై స్పందించిన LSG ఓనర్‌ గోయెంకా! ఏమన్నారంటే..?

Rohit Sharma, LSG, Sanjiv Goenka, IPL 2025: టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ కోసం ప్రత్యేకంగా రూ.50 కోట్ల బడ్జెట్‌ను పక్కనపెట్టారని వస్తున్న వార్తలపై తాజాగా ఎల్‌ఎస్‌జీ ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా స్పందించారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, LSG, Sanjiv Goenka, IPL 2025: టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ కోసం ప్రత్యేకంగా రూ.50 కోట్ల బడ్జెట్‌ను పక్కనపెట్టారని వస్తున్న వార్తలపై తాజాగా ఎల్‌ఎస్‌జీ ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా స్పందించారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు.. రాబోయే ఐపీఎల్‌ కోసం కూడా ఫుల్‌ డిమాండ్‌ ఉంది. కొన్నేళ్ల పాటు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్‌.. ఆ టీమ్‌కు తన కెప్టెన్సీలో ఏకంగా 5 కప్పులు అందించాడు. కానీ, ఐపీఎల్‌ 2024 సీజన్‌ కంటే ముందు రోహిత్‌ శర్మ స్థానంలో హార్ధిక్‌ పాండ్యాను కెప్టెన​్‌గా నియమించడంతో రోహిత్‌ ఆ టీమ్‌ నుంచి బయటికి వస్తున్నాడనే ప్రచారం జరిగింది. దాంతో.. రోహిత్‌ శర్మను తీసుకునేందుకు కొన్ని టీమ్స్‌ రెడీగా ఉన్నాయని.. రోహిత్‌ ఐపీఎల్‌ వేలంలో పాల్గొంటే ఏకంగా రూ.50 కోట్లు పెట్టి అయినా అతన్ని తీసుకుంటారనే వార్తలు వచ్చాయి.

అలా రోహిత్‌ కోసం రూ.50 కోట్లు పెట్టేందుకు అందరి కంటే ముందే సిద్ధమైన టీమ్‌గా లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేరు వినిపించింది. తాజాగా ఇదే విషయంపై ఆ జట్టు ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా కూడా స్పందించాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమ్‌ 2022లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆ జట్టు మూడు ఐపీఎల్‌ సీజన్లు ఆడింది. ఐపీఎల్‌ 2022, 2023 సీజన్స్‌లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. కానీ, ఐపీఎల్‌ 2024లో ఫ్లే ఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. వరుసగా మూడేళ్లు ఆ జట్టు కప్పు కొట్టడంలో విఫలమైంది. దాంతో పాటు ఐపీఎల్‌ 2024 సీజన్‌లో గ్రౌండ్‌లోనే ఆ జట్టు కెప్టెన​ కేఎల్‌ రాహుల్‌తో ఓనర్‌ గోయెంకా సీరియస్‌గా మాట్టాడుతూ కనిపించారు. దాంతో రాహుల్‌ లక్నో కెప్టెన్సీ గుడ్‌ బై చెప్తాడని, లేదా లక్నోనే అతని స్థానంలో కొత్త కెప్టెన్‌ నియమిస్తుందనే ప్రచారం సాగింది.

ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌లో వచ్చిన విభేదాల కారణంగా రోహిత్‌ శర్మ వేలంలో పాల్గొంటే రూ.50 కోట్లు అయినా పెట్టి అతన్ని టీమ్‌లోకి తీసుకోవాలని, అందుకోసం బడ్జెట్‌ కూడా పక్కనపెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే.. రోహిత్‌ శర్మ లాంటి ప్లేయర్‌ను ఏ ఫ్రాంచైజీ అయినా తమ టీమ్‌లో ఉండాలని కోరుకుంటుందని, అతను వేలంలో పాల్గొంటే కచ్చితంగా భారీ డిమాండ్‌ ఉంటుందని సంజీవ్‌ గోయెంకా అన్నారు. అయితే.. కేవలం ఒక్క ఆటగాడి కోసమే రూ.50 కోట్లు పక్కనపెడితే మిగతా టీమ్‌ను ఎలా బిల్డ్‌ చేసుకుంటారంటూ ప్రశ్నించారు. అంటే ఒక వేళ రోహిత్‌ వేలంలోకి వస్తే.. భారీ ధర వస్తుందని కానీ, అది రూ.50 కోట్లు కాదనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి

Show comments