SNP
IND vs SL, Suryakumar Yadav, Ravi Bishnoi: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత కుర్రాళ్లు అదరగొట్టారు. మరి ఈ విజయానికి దోహదం చేసిన ఐదు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
IND vs SL, Suryakumar Yadav, Ravi Bishnoi: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత కుర్రాళ్లు అదరగొట్టారు. మరి ఈ విజయానికి దోహదం చేసిన ఐదు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. ఆదివారం పల్లెకలె వేదికగా రెండో టీ20 మ్యాచ్ ఆడింది. వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత.. టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభమై 3 బంతులు పడగానే మరోసారి భారీ వర్షం వచ్చింది. దీంతో.. అంపైర్లు భారత ఇన్నింగ్స్‌ను 8 ఓవర్లకు కుదించి 78 టార్గెట్‌గా నిర్దేశించారు. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కానీ వర్షం కారణంగా భారత్‌కు 8 ఓవర్లలో 78 రన్స్ టార్గెట్ ఇచ్చారు. ఈ టార్గెట్‌ను 6.3 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా. మరి ఈ సూర్య సేన సాధించిన ఈ విజయానికి దోహదం చేసిన ఐదు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. బౌలింగ్
ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఆరంభంలో కాస్త పరుగులు ఎక్కువగా ఇచ్చినా.. సరైన టైమ్‌లో లంక బ్యాటర్లను కట్టడి చేసి.. భారీ స్కోర్ రాకుండా చేశారు. 15 ఓవర్లు ముగిసే సరికి.. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 130 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది లంక. చేతిలో 8 వికెట్లు ఉండటంతో ఈజీగా 180 పరుగుల వరకు చేస్తుందని అంతా భావించారు. ఇక్కడి నుంచి భారత బౌలర్లు రవి బిష్ణోయ్, హార్ధిక్ పాండ్యా అక్షర్‌పటేల్ అద్భుతమైన బౌలింగ్‌తో లంకను కట్టడి చేశారు. 15 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసిన లంకను.. 20 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్లు కూల్చి.. లంకను కేవలం 161 పరుగులకే పరిమితం చేశారు. ఇది టీమిండియా సూపర్ కమ్‌బ్యాక్ అని చెప్పాలి.
2. బ్యాటింగ్
టీమిండియా ఇన్నింగ్స్‌కి ముందు భారీ వర్షం పడింది. వర్షం అలాగే కొనసాగి ఉంటే.. మ్యాచ్ రద్దు అయ్యేది. కానీ, వర్షం ఆగడంతో టీమిండియా టార్గెట్‌ను 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. అప్పటికే మూడు బంతులు ఆడిన భారత ఓపెనర్ యశస్వి జైస్వాల 6 పరుగులు చేశాడు. ఇంకా 7.3 ఓవర్లలో 72 పరుగులు చేయాలి. ఇలాంటి సమయంలో.. టీమిండియా స్టార్ బ్యాటర్లు చెలరేగిపోయారు. జైస్వాల్ 15 బంతుల్లో 30, కెప్టెన్ సూర్య 12 బంతుల్లో 26, హార్ధిక్ పాండ్యా 9 బంతుల్లోనే 22 పరుగులు చేసి.. 6.3 ఓవర్లోనే మ్యాచ్‌ను ముగించారు.
3. వర్షం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 162 పరుగుల ఫైటింగ్ టార్గెట్‌ను టీమిండియా ముందు ఉంచింది. కానీ, ఆ తర్వాత వర్షం కావడంతో టీమిండియా టార్గెట్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 8 ఓవర్లలో 78 రన్స్‌గా అంపైర్లు నిర్దేశించారు. అయినా కూడా అది టఫ్ టార్గెటే. కానీ, భారీ వర్షం వచ్చి ఉండటం, గ్రౌండ్ అంతా తడిగా ఉండటంతో.. శ్రీలంక బౌలర్లకు బాల్‌పై గ్రిప్ దొరకడం కష్టమైంది. బాల్ స్కిడ్ అవుతూ.. బ్యాటర్‌పైకి ఈజీగా వచ్చింది. ఈ ఛాన్స్‌ను అద్భుతంగా వాడుకున్న భారత బ్యాటర్లు 6.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు.
4. టాస్
ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి దోహదం చేసిన మరో విషయం టాస్. వర్షం కారణంగా మ్యాచ్ 45 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. అయితే.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలవగానే మారుమాట్లాడకుండా.. వెంటనే బౌలింగ్ తీసుకున్నాడు. ఆల్రెడీ వర్షం వచ్చి ఉండటం, మళ్లీ వర్షం వచ్చే సూచనలు ఉండటంతో ఛేజింగ్ తీసుకున్నాడు. అది మనకు కలిసొచ్చింది. ఒక వేళ లంక టాస్ గెలిచి ఉంటే.. వాళ్లు కూడా బౌలింగే ఎంచుకునే వాళ్లు. అప్పుడు ఫలితం వేరేలా ఉండేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వర్షం కారణంగా టాస్ కీలకంగా మారింది.
5. సూర్య కెప్టెన్సీ
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి ఎక్కువ మార్కులు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఇవ్వాలి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దగ్గర్నుంచి.. బౌలింగ్ మార్పులు వరకు సూర్య అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ముఖ్యంగా బౌలింగ్ మార్పుల్లో తన మార్క్ చూపించాడు. 15 ఓవర్ల తర్వాత 130/2గా ఉన్న లంక 161కే పరిమితం అయిందంటే.. అందుకు సూర్య చేసిన బౌలింగ్ ఛేంజెస్ కూడా కారణమే. పైగా భారీగా పరుగులు ఇస్తున్న బౌలర్లను మళ్లీ కంటీన్యూ చేయకుండా ఆరుగురు బౌలర్లను వినియోగించాడు. సిరాజ్, అర్షదీప్‌లకు 3 ఓవర్లకే పరిమితం చేశాడు. అలాగే రియాన్ పరాగ్‌తో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయించాడు. మరి టీమిండియా విజయానికి దోహదం చేసిన ఈ ఐదు కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#TeamIndia complete a 7 wicket win over Sri Lanka in the 2nd T20I (DLS method) 🙌
They lead the 3 match series 2-0 👍
Scorecard ▶️ https://t.co/R4Ug6MQGYW#SLvIND pic.twitter.com/BfoEjBog4R
— BCCI (@BCCI) July 28, 2024
For his intelligent bowling and three wickets, Ravi Bishnoi is awarded the Player of the Match 🏆
Scorecard ▶️ https://t.co/R4Ug6MQGYW#TeamIndia | #SLvIND pic.twitter.com/cnqzWiRo75
— BCCI (@BCCI) July 28, 2024