SNP
Terrorists, Ahmedabad, Virat Kohli, RCB vs RR: ఆర్సీబీ, ఆర్‌ఆర్ మధ్య జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌కి ముందు ఊహించని విషయం బయటికి వచ్చింది. కోహ్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Terrorists, Ahmedabad, Virat Kohli, RCB vs RR: ఆర్సీబీ, ఆర్‌ఆర్ మధ్య జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌కి ముందు ఊహించని విషయం బయటికి వచ్చింది. కోహ్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SNP
అహ్మాదాబాద్ వేదికగా నేడు(బుధవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగునున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం కొన్ని కోట్ల మంది క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్ నేపథ్యంలో కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉందని సమాచారం. అందుకోసం.. ఏకంగా 10 వేల మందిని సెక్యూరిటీగా పెడుతున్నట్లు తెలుస్తోంది. అందులో ఏకంగా 5 వేల మంది గుజరాత్ పోలీసులు కాగా.. 5 వేల మంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించారు. ప్రస్తుతం ఆర్సీబీ వర్సెస్ ఆర్‌ఆర్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మాదాబాద్‌లో భారీ కోలాహలం నెలకొంది. అయితే.. అహ్మాదాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడటంతో.. పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు. స్టార్ ప్లేయర్ అయిన కోహ్లీ కోసం ఏకంగా 10 వేల మందిని సెక్యూరిటీ పెట్టారు. అలాగే ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దు చేశారు. ఈ విషయం తెలిసి.. కోహ్లీ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ, పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినా.. మరికొంత మంది అహ్మాదాబాద్‌లో దిగి ఉంటారనే అనుమానంతో పోలీసులు కోహ్లీకి ఈ రేంజ్ భద్రతను కలిపించారు. అయితే.. ఈ మ్యాచ్ ఆర్సీబీకి ఎంతో కీలకం అనే విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి వరుసగా మరో మూడు మ్యాచ్‌లు గెలిస్తే.. ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడుతుంది. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిస్తే.. క్వాలిఫైయర్-2లో ఈ నెల 24న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తలపడుతుంది. ఒక వేళ క్వాలిఫైయర్-2లో గెలిస్తే.. 26న కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌లు గెలిస్తే.. ఆర్సీబీ చరిత్ర సృష్టించినట్లే. 16 ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీ వచ్చి వాళ్ల ఒళ్లో పడుతుంది. దీని కోసమే ఆర్సీబీ అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక ఆర్సీబీ టీమ్ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇద్దరు మంచి స్టార్ట్స్ ఇస్తూ.. టీమ్‌ను ముందుకు నడిపిస్తున్నారు. వీరితో పాటు రజత్ పాటిదార్, కామెరున్ గ్రీన్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మ్యాక్స్‌వెల్ కూడా తన స్థాయి తగ్గట్లు ఆడితే.. క్వాలిఫైయర్-2లో ఆర్సీబీ విజయం పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా ఆర్సీబీ బౌలర్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీని ప్లే ఆఫ్స్‌కు చేర్చారు. ఆర్సీబీ ప్రదర్శనపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకపోయినా.. కోహ్లీ భద్రతకు ముప్పు ఉందనే విషయం అభిమానులను ఎక్కువ ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Four ISIS terrorists are arrested by Gujarat ATS at Ahmedabad airport. Their names are
1. Mohamed Nusrath
2. Mohamed Nafran,
3. Mohamed Faris
4. Mohamed RasdeenThey are from Srilanka and were planning some attacks in India…
Guess what’s common between them? pic.twitter.com/GzI9zLicHa
— Mr Sinha (Modi’s family) (@MrSinha_) May 20, 2024