Sundaram Master Review in Telugu: సుందరం మాస్టర్ సినిమా రివ్యూ!

Sundaram Master Movie Review & Rating in Telugu: ఇటీవల కాలంలో షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోల ద్వారా తమను తాము ప్రూవ్ చేసుకుని సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా హీరోలుగా చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ రైటర్ పద్మభూషణ్, రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాలతో ఆకట్టుకున్నారు. తాజాగా ఇదే కోవలో వైవా హర్ష కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సుందరం మాస్టర్ సినిమాతో మన ముందుకు వచ్చేశారు. మరి వైవా హర్ష నటించిన సుందరం మాస్టర్ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

Sundaram Master

20240223, Comedy, Drama, 2h 1m U
U
  • నటినటులు: Harsha Chemudu, Divya Sripada, Chaitu Babu
  • దర్శకత్వం:Kalyan Santhosh
  • నిర్మాత:Swetha Kakarlapudi, Sudheer Kumar Kurra, Hemanth Kurru, Shalini Nambu, Ravi Teja
  • సంగీతం:Sricharan Pakala
  • సినిమాటోగ్రఫీ:Deepak Yaragera

Rating

2.5

యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ల ద్వారా పరిచయం అయిన వైవా హర్ష.. కమెడియన్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో హర్ష తొలిసారి హీరోగా నటిస్తోన్న చిత్రం సుందరం మాస్టార్‌. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి సుందరం మాస్టార్‌ ప్రేక్షకులను అలరించాడా.. లేదా అంటే..

కథ:

సుందరం మాస్టర్‌ గవర్నమెంట్‌ టీచర్‌. ఇంగ్లీష్‌ నేర్పడం కోసం అతడిని మిర్యాలమెట్ట అనే గ్రామానికి పంపుతారు. కానీ అక్కడి గ్రామస్తులు అందరూ ఇంగ్లీష్‌లో మాట్లాడటం సుందరాన్ని ఆశ్చర్యపరుస్తుంది. మరి సుందరం తను వెళ్లిన పనిని పూర్తి చేస్తాడా.. ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ:

సినిమా ఫస్టాఫ్‌ అంతా కామెడీతో బాగానే సాగింది. గ్రామస్తులకు ఇంగ్లీష్‌ రాదనుకుని.. వారికి నేర్పించడం కోసం సుందరం చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి. ఇంటర్వెల్ ముందు వరకు నవ్వించిన సుందరం మాస్టర్.. తర్వాత అంతగా కామెడీ చేయలేదు. సెకండాఫ్ అంతా ఫిలాసఫీ ఎక్కువ ఉండి.. ఆ సన్నివేశాలను డీల్‌ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్‌ అంతా కామెడీగా సాగిన సుందరం మాస్టర్‌ సెకాండాఫ్‌లో మాత్రం నిరాశపరిచాడు. 

నటీ, నటుల పనితీరు:

యూట్యూబ్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హర్ష చెముడు.. ఈమధ్య కాలంలో అనేక సినిమాల్లో కమెడియన్‌గా కూడా చేశాడు. ఇక సుందరం మాస్టర్‌ సినిమాలో అతడితే ప్రధాన పాత్ర. గ్రామస్తులకు ఇంగ్లీష్‌ నేర్పే టీచర్‌గా ఈ సినిమాలో నటించాడు. అలానే ఈ చిత్రంలో దివ్య శ్రీపాద, బాలకృష్ణ నీలకంఠపుర, మిగతా నటీనటులు గ్రామస్తుల పాత్రలో కనిపించారు. శ్రీచరణ్‌ పాకాల అందించిన మ్యూజిక్‌ బాగుంది.

బలాలు

  • ప్రథమార్థం లోని కామెడీ
  • శ్రీచరణ్‌ మ్యూజిక్‌
  • ప్రీక్లైమాక్స్‌

బలహీనతలు

  • క్లైమాక్స్‌ సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోలేదు
  • సుందరం మారిన తీరును సరిగా ఎలివేట్‌ చేయలేకపోవడం

రేటింగ్:2.5/5

చివరి మాట: సుందరం మాస్టార్‌ చెప్పిన కథ పూర్తిగా అర్థం కాలేదు

(గమనిక): ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
Show comments