Purushothamudu Review: పురుషోత్తముడు సినిమా రివ్యూ.. రాజ్ తరుణ్ హిట్ కొట్టాడా?

డైరెక్టర్ రామ్ భీమన-రాజ్ తరుణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పురుషోత్తముడు' మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ హిట్ కొట్టాడా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.

డైరెక్టర్ రామ్ భీమన-రాజ్ తరుణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పురుషోత్తముడు' మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ హిట్ కొట్టాడా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.

పురుషోత్తముడు

జులై 26, ఫ్యామిలీ ఎంటర్ టైనర్,
థియేటర్స్ లో
  • నటినటులు:రాజ్ తరుణ్, హాసిని సుధీర్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మనందం తదితరులు
  • దర్శకత్వం:రామ్ భీమన
  • నిర్మాత:డాక్టర్ రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్
  • సంగీతం:గోపీ సుందర్
  • సినిమాటోగ్రఫీ:పీజీ విందా

Rating

2.5/5

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కు ప్రస్తుతం కష్టకాలం నడుస్తోంది. ఇటు కెరీర్ పరంగా హిట్ లేకపోవడం, అటు వ్యక్తిగతంగా సమస్యల్లో చిక్కుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో రాజ్ తరుణ్ నటించిన ‘పురుషోత్తముడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ భీమన దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించిందా? రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ పడ్డట్లేనా? ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

పుట్టుకతోనే రచిత్ రామ్(రాజ్ తరుణ్) కోటీశ్వరుడు. అతడి తండ్రి ఆదిత్య రామ్(మురళీ శర్మ) ఇండియాలనే గొప్ప కంపెనీ అయిన పీఆర్ గ్రూప్స్ అధినేత. రామ్ లండన్ లో చదువు పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చేస్తాడు. పీఆర్ గ్రూప్స్ కంపెనీకి సీఈవోగా నియమించాలని తండ్రి అనుకుంటాడు. అయితే అందుకు రామ్ పెద్దమ్మ వసుంధర(రమ్మకృష్ణ) అడ్డు చెబుతుంది. సీఈవోగా ఎన్నికయ్యే వ్యక్తి 100 రోజులు కామన్ మ్యాన్ లా జీవించాలని పట్టుబడుతుంది. దాంతో తనను తాను నిరూపించుకునేందుకు రామ్ ఆంధ్రప్రదేశ్ లోని ఓ పల్లెటూరుకు వస్తాడు. అక్కడే అమ్ము(హాసినీ సుధీర్) పరిచయం అవుతుంది. వారి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ ఊర్లో ఉన్న పూల రైతులను సమస్యల నుంచి రామ్ ఎలా కాపాడాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

కోటీశ్వరుడైన వారసుడు ఆస్తినంతా వదులుకుని ఓ పల్లెటూరుకు వచ్చి సాధారణ జీవితం గడపటం, ఆ ఊరి సమస్యలు తీర్చి వారి పాలిట దేవుడిలా మారడం లాంటి కథలు టాలీవుడ్ కు కొత్తేం కాదు. పురుషోత్తముడు కూడా ఇలాంటి కథే. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడే చాలా మంది మహేశ్ బాబు శ్రీమంతుడు సినిమాలా ఉందని కామెంట్స్ చేశారు. ఇక పాత్రను పరిచయం చేయడం, సినిమాను కథలోకి తీసుకెళ్లడంలో డైరెక్టర్ స్పీడ్ గానే ఉన్నాడు. రాయపులంక చేరుకున్నాక కథ స్లో అవుతుంది. రామ్-అమ్ము మధ్య ప్రేమ చిగురించే క్రమంలో వచ్చే సీన్లు ప్రేక్షకులక వినోదాన్ని పంచుతాయి. ఇక ఎప్పుడైతే ఆ ఊరు పూల రైతులకు జరుగున్న అన్యాయాలపై తిరగబడటానికి హీరో సిద్ధపడతాడో.. అప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది.

ఇక సెకండాఫ్ విషయానికి వచ్చే సరికి ఇంకా స్టోరీ ఇంకా నెమ్మదిస్తుంది. ఫస్టాఫే పడుతూ లేస్తూ సాగిందనుకున్న ప్రేక్షకులకు సెంకడాఫ్ ఇంకాస్త బోర్ తెప్పిస్తుంది. కథలో ఎక్కడా బలమైన సంఘర్షణను తీసుకురాలేకపోయాడు దర్శకుడు. పైగా విలన్ పాత్రను కూడా స్ట్రాంగ్ గా చూపించలేకపోడు. క్లైమాక్స్ కూడా ఊహకు తగ్గట్లుగానే ఉంది. అయితే పతాక సన్నివేశాల్లో ప్రకాశ్ రాజ్ ఎంట్రీ.. ఆయన చెప్పే డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఎవరెలా చేశారంటే: 

రచిత్ రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా సరిపోయాడు. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించాడు. అయితే అక్కడక్కడ తన స్థాయికి మించిన ఎలివేషన్లు కాస్త అతిగా అనిపిస్తాయి. అమ్ము పాత్రలో పల్లెటూరు యువతిగా హాసిని సుధీర్ ఆకట్టుకుంది. రమ్యకృష్ణ, మురళీ శర్మ లు ఎప్పటిలాగే తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రవీణ్ పాత్ర సినిమాలో నవ్వులు పంచుతుంది. సత్య, బ్రహ్మనందం తళుక్కున మెరిపించారు. టెక్నికల్ విభాగానికి వస్తే.. కెమెరామెన్ పీజీ విందా పల్లెటూరి అందాలను అద్భుతంగా చూపించాడు. గోపీ సుందర్ బాణీలు, బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే.. రామ్ భీమన కథలో కొత్తదనం కనిపించకపోగా.. స్టోరీ మెుత్తం ఊహించిన విధంగానే సాగుతుంది.

బలాలు

  • రాజ్ తరుణ్ నటన
  • ఫస్టాఫ్ లో కొన్ని సీన్లు

బలహీనతలు

  • రొటీన్ స్టోరీ
  • స్లో నెరేషన్
  • సెకండాఫ్

చివరి మాట: ఈ పురుషోత్తముడు ‘విజయోత్తముడు’ కాలేకపోయాడు.

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ఇదికూడా చదవండి: Raayan Review: రాయన్ మూవీ రివ్యూ! ధనుష్ తన 50వ చిత్రంతో హిట్ కొట్టాడా?

Show comments