Kalki 2898 AD Review: ఎలాంటి స్పాయిలర్స్‌ లేని కల్కి మూవీ రివ్యూ!

Kalki 2898 AD Movie Review & Rating in Telugu: కల్కి సినిమా పై వచ్చినన్ని అంచనాలు ఈ మధ్యకాలంలో ఏ చిత్రం మీద రాలేదు. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ విడుదలైన కల్కి చిత్రం ఎలా ఉందంటే..

Kalki 2898 AD Movie Review & Rating in Telugu: కల్కి సినిమా పై వచ్చినన్ని అంచనాలు ఈ మధ్యకాలంలో ఏ చిత్రం మీద రాలేదు. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ విడుదలైన కల్కి చిత్రం ఎలా ఉందంటే..

కల్కి 2898 ఏడీ

27-03-24, పీరియాడికల్‌, మైథాలిజికల్‌, సైన్స్‌ ఫిక్షన్‌, 2h 58m U/A
U/A
  • నటినటులు:ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకోనే, కమల్‌ హాసన్‌, దిశా పటానీ, విజయ్‌ దేవరకొండ తదితరులు
  • దర్శకత్వం:నాగ్‌ అశ్విన్‌
  • నిర్మాత:అశ్వనీ దత్‌
  • సంగీతం:సంతోష్ నారాయణన్
  • సినిమాటోగ్రఫీ:జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్

Rating

3

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇది వరకు లేని రీతిలో తెరకెక్కిన చిత్రం “కల్కి 2898”. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూ.600 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. నాగ్ అశ్విన్ ఎలాంటి మ్యాజిక్ చేశాడు. అంచనాలను అందుకోవడంలో ఈ టీమ్ ఎంత వరకు సక్సెస్ అయ్యింది? ప్రభాస్ రేంజ్ కి తగ్గ స్థాయిలో ఈ సినిమా ఉందా? ఇలాంటి అన్నీ విషయాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం

అలెర్ట్:

ఈ రివ్యూ ధైర్యంగా చదవచ్చు. ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా ఇస్తున్నాము

కథ:

కురుక్షేత్ర యుద్ధం అనంతరం అశ్వత్థామని శ్రీకృష్ణుడు శపిస్తాడు. అక్కడ నుండి కొన్ని వేల సంవత్సరాల తరువాత.. భూమి మీద కలియుగం చివరికి వచ్చేస్తుంది. ఆ సమయానికి భూమిపై మూడు ప్రాంతాలు మాత్రమే మిగులుతాయి. ఒకటి కాశీ, రెండు శంభల, మూడు కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ ని ఏలుతున్న యాస్కిన్ ( కమల్ హాసన్) అక్కడ అందరికీ ప్రభవు. కాశీలో సాధారణ జనాలు నివసిస్తూ ఉంటారు. అక్కడ వారికి ఎలాంటి రిసోర్సెస్ ఉండవు. ఇక శంభలలోని ప్రజలు అంతా కాంప్లెక్స్ కి ఎదురు తిరిగిన రెబల్స్. అయితే.., కాశీలోని అందరూ.. ఎక్కువ యూనిట్స్( డబ్బులు) సంపాదించి కాంప్లెక్స్ చేరుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో భైరవ (ప్రభాస్) కూడా ఒకడు. అతని పార్టనర్ బుజ్జి. ఇదే సమయంలో కాంప్లెక్స్ లో గర్భిణీలపై ప్రాజెక్ట్-K ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అయితే.. ఆ మిషన్ నుండి సుమతి ( దీపికా పదుకునే) తప్పించుకోగా, ఆమెపై బౌంటీ పెడుతారు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న భైరవ.. సుమతిని పట్టుకోవడానికి వెళ్తాడు. అక్కడ.. అతన్ని అశ్వత్థామ (అమితా బచ్చన్) అడ్డుకుంటాడు. అసలు.. సుమతి కడుపులోని బిడ్డని అశ్వత్థామ ఎందుకు కాపాడుతుంటాడు? శంభల ప్రజలు సుమతి రాక కోసం ఎందుకు ఎదురుచూస్తూ ఉంటారు? అశ్వత్థామని మించిన శక్తి భైరవకి ఎలా వచ్చింది? ఆ క్లైమ్యాక్స్ ట్విస్ట్ ఏంటి? ఇలాంటి అన్నీ ప్రశ్నలకి సమాధానమే “కల్కి 2898”.

విశ్లేషణ:

కల్కి సినిమా టైటిల్ కార్డ్స్‌ నుండే నాగ్ అశ్విన్ కథలోకి వెళ్ళిపోయాడు. కలియుగంలో మనుషుల చేసిన తప్పులకి భూలోకం ఎలా చెడిపోద్దో అండర్ ప్లేలో బాగా చూపించాడు. ఇక.. కల్కి యూనివర్స్ లోకి వెళ్ళాక.. కథలో భాగమైన కాశీ, శంభల, కాంప్లెక్స్ ప్రాంతాలను ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత సమయం తీసుకున్నాడు. అలాగే.. భైరవ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా సమయం తీసుకున్నాడు. కాకుంటే.. ఇక్కడ బోర్ కొట్టకుండా చిన్న చిన్న గెస్ట్ రోల్స్ పెట్టి.. మ్యాజిక్ చేశాడు. ఇక ఎప్పుడైతే అశ్వత్థామ పాత్ర కథలోకి వస్తుందో.. అక్కడి నుండి కల్కి స్కేల్ మారిపోయింది. కథలో వేగం పుంజుకుంది. అలాంటి ఉత్కంఠ మధ్య.. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. ఇక్కడి వరకు సినిమాలో అంత పెద్ద మ్యాజిక్ జరగకపోయినా.. అందుకు కావాల్సిన పరిస్థితులను నాగ్ అశ్విన్ సిద్ధం చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు

ఇక కల్కికి ఆయువుపట్టు అంటే సెకండ్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. కథలో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ, భైరవ క్యారెక్టర్ వెయిట్ పెంచుతూ సాగిన కథనం ఆకట్టుకుంటుంది. ఇక్కడ మాత్రం నాగ్ అశ్విన్ సినిమాని పరుగులు పెట్టించాడు. ఇక కథ శంభలకి చేరాక కూడా దర్శకుడు నేరుగా మెయిన్ పాయింట్ లోకి వెళ్లిపోయి, ప్రేక్షకుడికి బోర్ ఫీల్‌ అవ్వకుండా మంచి పని చేశాడు. ఇక్కడ కూడా అశ్వత్థామ, భైరవ మధ్య యాక్షన్ సీక్వెన్స్ మాత్రమేనా? ఇంకేమి మెరుపులు లేవా? అని ఆడియన్స్ ఆలోచనలో పడుతున్న సమయంలో ఫ్యూజులు ఎగిరిపోయే క్లైమ్యాక్స్ ట్విస్ట్ తో ఒక్కసారిగా సినిమా స్థాయిని పెంచేశాడు. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ చొక్కాలే కాదు, నరాలు చించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే.., ఈ మొత్తం కథనంలో మహాభారతం సీక్వెన్స్ ని నాగ్ అశ్విన్ వాడుకున్న తీరు మాత్రం నిజంగా అమోఘం.

నటీనటుల పనితీరు:

ప్రభాస్ స్క్రీన్ పై కనిపిస్తేనే వందల కోట్లు వచ్చి పడుతున్న ఇలాంటి సమయంలో.. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేశాడంటే నిజంగా హ్యాట్సాఫ్ అని చెప్పొచ్చు. ఇది ఓ రకంగా రిస్క్ లాంటిదే. ఆ రిస్క్ చేశాడు కాబట్టే.. ఇంత మంచి సినిమాని దక్కించుకోగలిగాడు. ఇక కల్కిలో ప్రభాస్ యాక్షన్, కామెడీ, అన్నీ అదిరిపోయాయి. కామెడీ టైమింగ్ మాత్రం వేరే లెవల్. అన్నిటికీ మించి క్లైమాక్స్‌లో ఆ రాజసం రెబల్ స్టార్ కి తప్ప.. ఇంకెవ్వరికీ సాధ్యం అయ్యేది కాదు. ఇక ప్రధానంగా అమితా బచ్చన్ గురించి చెప్పుకోవాలి. 80 ఏళ్ళ వయసులో ఇలాంటి పాత్ర దొరకడం ఆయన అదృష్టం అని చెప్పడానికి ఎలాంటి సందేహం, తడబాటు అవసరమే లేదు. అందుకుతగ్గట్టే అశ్వత్థామ పాత్రలో అమితాబ్ సూపర్ గా సెట్ అయిపోయారు. ఇక కమల్, దీపికా పదుకోనే, విజయ్ దేవరకొండ వంటి భారీ స్టార్ కాస్ట్ యాడ్ అయ్యి.. అద్భుతం చేశారు. సినిమాలో బోలెడు స్టార్ కాస్ట్. అందరూ ది బెస్ట్ ఇచ్చేశారు.

టెక్నీకల్ విభాగం:

“కల్కి 2898″ని కేవలం ఒక సాధారణ సినిమాగా చెప్పలేము. రూ.600 కోట్లతో, అంతకుమించిన గొప్ప ఆలోచనతో నాగ్ అశ్విన్ సృష్టించిన మరో సృష్టి అని చెప్పుకోవచ్చు. మహాభారతంలోని కొన్ని పాత్రలను యుగాంతం అనే పాయింట్ కి లింక్ చేసి.. నాగ్ అశ్విన్ అద్భుతమైన కథ రాసుకున్నాడు. అంతటి గొప్ప కథని నమ్మి ఇంత ఖర్చు పెట్టిన వైజయంతీ మూవీస్ ధైర్యాన్ని ఎంత కొనియాడిన తక్కువే. టెక్నికల్‌గా కల్కి విజువల్ వండర్. టీమ్ ని మెచ్చుకుని తీరాల్సిందే, ఒక్క ఆర్.ఆర్ విషయంలోనే కంప్లైంట్! ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇండియన్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిపోయాడు. ఆయన విజన్ కి హ్యాట్సాఫ్.

బలాలు:

  • ప్రభాస్
  • అమితాబచ్చన్
  • బుజ్జి
  • కథ బేస్ లైన్
  • క్లైమ్యాక్స్ ట్విస్ట్

బలహీనతలు:

  • సాధారణంగా సాగిన ఫస్ట్ ఆఫ్
  • ప్రభాస్ పాత్ర నిడివి
  • బ్యాగ్రౌండ్ స్కోర్

రేటింగ్: 3/5

చివరి మాట: “కల్కి 2898” : మహాభారతం ఎలిమెంట్స్ తో మ్యాజిక్ చేసే విజువల్ వండర్

Show comments