Ooru Peru Bhairavakona Review: ఊరి పేరు భైరవకోన సినిమా రివ్యూ!

Ooru Peru Bhairavakona Movie Review In Telugu: సందీప్ కిషన్- వర్షా బొల్లమ్మ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

Ooru Peru Bhairavakona Movie Review In Telugu: సందీప్ కిషన్- వర్షా బొల్లమ్మ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

Ooru Peru Bhairavakona

20240214, Fantasy Thriller, 2h 16m U/A
U/A
  • నటినటులు:Sundeep Kishan, Varsha Bollamma, Kavya Thapar, Others
  • దర్శకత్వం:Vi Anand
  • నిర్మాత:Anil Sunkara, Rajesh Danda
  • సంగీతం:Shekar Chandra
  • సినిమాటోగ్రఫీ:Raj Thota

Rating

2.25

యంగ్ హీరో సందీప్ కిషన్ కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. కుర్రాళ్లలో ప్రామిసింగ్ హీరో అనే ట్యాగునైతే సొంతం చేసుకున్నాడు. అయితే సందీప్ కిషన్ ఎక్కువ ప్రయోగాలు చేస్తూ ఉంటాడని అందరికీ తెలిసిందే. ఆ ప్రయోగాల్లో భాగంగా వచ్చిందే ఈ ఊరి పేరు భైరవకోన. నిజానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఫిబ్రవరి 14న పెయిడ్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 16న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. మరి.. ఈ మూవీ ఎలా ఉంది? చెప్పినట్లుగానే సందీప్ కిషన్- వర్షా బొల్లమ్మ హిట్టు కొట్టారా? వంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ రివ్యూ చూసేయండి..

కథ:

బసవ( సందీప్ కిషన్) అతని ఫ్రెండ్ జాన్ ( వైవా హర్ష) ఒక దొంగతనం చేసి.. అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి ఎంటర్ అవుతారు. వీరితో పాటు గీత ( కావ్య థాపర్) కూడా ఆ ఊరిలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుండి వీరి ముగ్గురికి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా భైరవకోనలో అన్నీ సంఘటనలు భయానకంగా తోస్తాయి. ఈ సమయంలోనే బసవ దొంగలించిన బంగారాన్ని.. రాజప్ప దక్కించుకుంటాడు. అవి తిరిగి దక్కించుకోవాలంటే కుదరదు. అసలు ఆ భైరవకోనకి మిగతా ఊర్లకి ఉండే తేడా ఏమిటి? గరుడ పురాణంలో మిస్ అయిన నాలుగు పేజీల్లో భైరవకోన గురించి ఏమి చెప్పారు. తాను ప్రేమించిన భూమి( వర్ష బోల్లమ్మ) కోసం బసవ ఎందుకు దొంగగా మారాడు? అతనికి భైరవకోనలో ఎదురైన ట్విస్ట్ ఏమిటి? ఇలాంటి అన్నీ ప్రశ్నలకి సమాధానమే “ఊరు పేరు భైరవకోన” సినిమా.

విశ్లేషణ:

ఏదైనా కథ చెప్తే అది మనదై ఉండాలి. హీరో పాత్రలో మనల్ని మనం ఊహించుకొగలగాలి. కథలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్ కి కనెక్ట్ కాగలగాలి. ఎంత ఫాంటసీ జానార్ అయినా.. దానికి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ఆనాటి పాతాళభైరవి నుండి జగదేకవీరుడు అతిలోక సుందరి వరకు, అమ్మోరు నుండి అరుంధతి వరకు అన్నీ ఆడియన్స్ ను ఎమోషనల్ గా టచ్ చేసిన చిత్రాలే. ఆఖరికి మొన్నటికి మొన్న వచ్చిన భింబిసార కూడా ఈ కోవకే చెందుతుంది. ఎమోషనల్ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయిన ఫాంటసీ చిత్రాలు ఏవి బాగా ఆడిన దాఖలాలు లేవు. దురదృష్టవశాత్తు ఊరు పేరు భైరవకోన కూడా ఇదే కోవలోకి వచ్చే చిత్రం. అలా అని.. భైరవకోనలో ఎంగేజింగ్ కంటెంట్ లేదా అంటే కచ్చితంగా ఉంది. అక్కడక్కడా చైర్ ఎడ్జ్ పై కూర్చోబెట్టి టెన్షన్ పుట్టించే సీన్స్ కూడా ఉన్నాయి. కానీ..లాజిక్ కి చాలా దూరంగా, ఎమోషన్ మిస్ అయిన ఆ సీన్స్ భైరవకోనని గట్టించలేకపోయాయి.

భైరవకోన పరిచయ సన్నివేశాలతో దర్శకుడు.. చాలా సులువుగా తన కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే కథ భైరవకోన లోకి ప్రవేశిస్తుందో అక్కడ నుండి సినిమాటిక్ లిబరిటీ చాలా ఎక్కువ అయిపోతోంది. కానీ.. ఫస్ట్ ఆఫ్ లో బసవ, భూమి ట్రాక్ విడిగా నడుస్తూ ఉండటం, భైరవకోన అసలు ట్విస్ట్ ఇంటర్వెల్ వరకు రీవీల్ చేయకపోవడంతో ఓ మంచి ఫాంటసీ అడ్వెంచర్ మూవీ చూస్తున్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది. వీటికి తోడు వైవా హర్షా, వెన్నల కిషోర్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అవ్వడం కలిసి వచ్చింది. కానీ.., ఎప్పుడైతే ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అవుతుందో అక్కడ నుండి భైరవకోన కథ.. సామాన్య ప్రేక్షకుడు ఓన్ చేసుకోలేనంత దూరం వెళ్ళిపోతుంది.

భైరవకోన సెకండ్ ఆఫ్ కాస్త ఇంట్రెస్టింగ్ గా మొదలైనా, కథలోని ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతున్నా.. ఆడియన్స్ వాటి వేటికీ పెద్దగా ఎంగేజ్ అయ్యే పరిస్థితి కనిపించదు. మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ కూడా ఓ విషాదాంతంతో ముగియడం క సినిమాని మరింత భారంగా మార్చేసింది. అన్నిటికీ మించి.. అత్యంత బలహీనమైన క్లయిమ్యాక్స్ కూడా భైరవకోనకి పెద్ద మైనస్ గా మారింది. ఫస్ట్ ఆఫ్ లో జనరేట్ అయినా కాసంత ఫన్, రియాలిటీకి కాస్త దగ్గరగా కథ ఉన్నా.. భైరవకోన ఫలితం మరోలా ఉండేది.

నటీనటుల పనితీరు:

తెలుగులో ఎప్పటికైనా ఓ మంచి సక్సెస్ కి అన్నీ అర్హతలు ఉన్న హీరో సందీప్ కిషన్. సినిమా కోసం సందీప్ ఎంత కష్టడతాడో అందరికీ తెలుసు. భైరవకోనలో కూడా ఈ కష్టం కనిపించింది. కాకుంటే.. లుక్ పరంగా మాత్రం పెద్దగా గుడ్ వర్క్ జరగలేదు. ఇక భూమి పాత్రలో వర్ష బోల్లమ్మ అదరగొట్టింది. కావ్య థాపర్ కి కూడా కావాల్సినంత స్క్రీన్ స్పేస్ దొరకడం విశేషం. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. మిగతా నటీనటులు పర్వాలేదు.

టెక్నికల్ విభాగం:

శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగుంది. నిజమేనా చెబుతున్న పాట పెద్ద ఎసెట్. ఇక బిజీఎం కూడా ఆకట్టుకుంటుంది. సినిమా అంతా కథతో నిండిపోవడంతో ఎడిటర్ ఎక్కడా వేలు పెట్టడానికి లేకుండా పోయింది. కెమెరా వర్క్ ఓకే అనిపించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం బాగున్నాయి. చివరగా డైరెక్టర్ వి.ఐ. ఆనంద్. కాస్త తెలివి తగ్గించుకొని కథలు రాసుకుంటే… మేకర్ దాన్ని అద్భుతంగా తెరకెక్కించగలడు. కానీ.. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంలో తప్ప.. ఎక్కడా ఆనంద్ తన కథని సింపుల్ గా చెప్పింది లేదు. ఇదే అతనికి అతి పెద్ద మైనస్ గా మారుతోంది. ఆఖరికి భైరవకోన లో కూడా ఇదే రిపీట్ అయ్యింది.

ప్లస్:

  • ఫస్ట్ ఆఫ్
  • మెయిన్ లీడ్
  • వెన్నెల కిషోర్
  • వైవా హర్ష

మైనస్ :

  • సెకండ్ ఆఫ్
  • ఎమోషన్ మిస్ అవ్వడం
  • వీక్ క్లయిమ్యాక్స్

రేటింగ్: 2.25

చివరి మాట: భైరవకోన.. ఫాంటసీ ఎక్కువ అయిపొయింది

Show comments