Venkateswarlu
Neru Movie Review & Rating in Telugu: ప్రమోగాలకు పెద్ద పీట వేసే మోహన్‌లాల్ తాజాగా ‘నెరు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
Neru Movie Review & Rating in Telugu: ప్రమోగాలకు పెద్ద పీట వేసే మోహన్‌లాల్ తాజాగా ‘నెరు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
Venkateswarlu
మలయాళ సినిమా అంటే.. ప్రయోగాలకు మారు పేరులా మారిపోయింది. చిన్న హీరో పెద్ద హీరో అన్న తేడా లేకుండా అందరూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇక, ఈ నేపథ్యంలోనే మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ తాజాగా ‘నెరు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ డిసెంబర్ 21వ తేదీన మలయాళ థియేటర్లలో విడుదల అయింది. అక్కడ సినిమాకు మంచి స్పందన వచ్చింది. దాదాపు నెల రోజులకు ‘నెరు’ ఓటీటీకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సందడి చేస్తూ ఉంది. మూవీకి థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ మంచి స్పందన వస్తోంది.
సారా మహ్మద్ ( అనస్వర రాజన్) అనే అంధురాలిని గుర్తు తెలియని ఓ వ్యక్తి రేప్ చేస్తాడు. ఆమెపై అత్యాచారం జరిపింది ఎవరో పోలీసులు కనిపెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. శిల్పి అయిన సారా తనపై అత్యాచారం చేసిన వ్యక్తి రూపాన్ని శిల్పంగా తయారు చేస్తుంది. ఆ విగ్రహంతో పోలీకలు ఉన్న మైఖేల్ జోసెఫ్(శంకర్ ఇందుచూడన్)ను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. మైఖేల్ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు కావటంతో కేసు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సుప్రసిద్ధ లాయర్ రాజశేఖర్( సిద్ధిఖీ) మైఖేల్ తరపున కేసు వాదిస్తాడు. మైఖేల్‌కు బెయిల్ వస్తుంది. అతడు బయటకు రాగానే కేసు వాపసు తీసుకోమని సారాను అడుగుతారు. అందుకు ఆమె ఒప్పుకోదు. ఈ నేపథ్యంలోనే లాయర్ విజయ్ మోహన్( మోహన్‌లాల్) కేసు టేకప్ చేస్తాడు. తర్వాత ఏం జరిగింది. కేసులో సారా గెలిచిందా లేదా? మూవీలో ప్రియమణి పాత్ర ఏంటి అన్నదే మిగిలిన కథ.
దృశ్యం సినిమాలతో మలయాళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు జీతూ జోషఫ్. దృశ్యం సినిమాల్లో మలయాళంలో మోహన్ లాల్ నటించారు. వీరి కాంబినేషన్‌లో తర్వాత కూడా పలు సినిమాలు వచ్చాయి. అన్నీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలే. అన్నీ బాగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు నెరు విషయంలోనూ ఇదే జరిగింది. మూవీలో సస్పెన్స్ మొదటినుంచి చివరి వరకు కొనసాగుతుంది. చివరకు ఏం జరుగుతుందా? అన్న ప్రశ్న మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే, జీతూ ప్రతి సినిమాలో కథలోకి వెళ్లడానికి ఓ అరగంట టైం తీసుకుంటూ ఉంటారు. ఈ మూవీలోనూ అదే జరిగింది. మూమీ ప్రారంభంలో కొంచెం స్లోగా అనిపించినా.. సారాను అత్యాచారం చేసింది ఎవరు? అన్న ప్రశ్నతో మొదలవుతుంది సినిమా. తర్వాత అరగంటకే నిందితుడు తెరపైకి వస్తాడు. మొదటి ట్విస్ట్ రివీల్ అయినా తర్వాత ఏం జరుగుతుంది అన్న సస్పెన్స్ మాత్రం ఎక్కడా తగ్గదు. స్క్రీన్ ప్లే రాసుకోవటంలో జీతూ తనకు తానే సాటి అని మరో సారి నిరూపించుకున్నాడు. ప్రతీ అంశం మనకు అద్భుతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా కోర్టు రూము సీన్లు మనల్ని కుర్చీ అంచుల్లో కూర్చోబెడతాయి. మొత్తానికి జీతూ ఓ మ్యాజిక్ చేశాడు.
మోహన్‌లాల్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 40 ఏళ్ల తన అనుభవం ప్రతీ సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. అయితే, పాత్రకు పాత్రకు మధ్య వేరియేషన్స్ చూపించడంలో తన మార్కును చాటుకుంటున్నారు. లాయర్ విజయ్ మోహన్ పాత్రలో మోహన్‌లాల్ అద్భుతంగా నటించారు. తెరపై విజయ్ తప్ప మోహన్‌లాల్ కనిపించరు. ఇక, ప్రియమణి తన పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన వారు కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా చేశారు.
సస్పెన్స్ థ్రిలర్ల్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం లాంటిది. ఈ విషయంలో విష్ణు శ్యామ్ తన పని తీరు చూపించారు. ప్రతీ సీనులో మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఇక, సినిమాటోగ్రాఫర్ సతీష్ కురుప్ ప్రతీ షాట్ కన్నుల ముందుకు తీసుకువచ్చారు. తెరపై అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఎడిటర్ విఎస్ వినాయకన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతీ షాట్, ప్రతీ సీన్ ప్రేక్షకులు మెచ్చేలా ఎడిటింగ్ చేశారు.