Love Me If You Dare Movie Review: బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించిన లవ్ మీ మూవీ రివ్యూ! ఎలా ఉందంటే?

Love Me If You Dare Movie Review: బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించిన లవ్ మీ మూవీ రివ్యూ! ఎలా ఉందంటే?

Love Me If You Dare Movie Review: దిల్ రాజు మేనల్లుడు, రౌడీ బాయ్స్ మూవీ హీరో ఆశిష్, బేబీ సినిమాతో పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య నటించిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ మూవీ లవ్ మీ. బేబీ సినిమాతో బేబీగా అలరించిన వైష్ణవి చైతన్య ఖాతాలో హిట్ పడిందా? రౌడీ బాయ్స్ తో అలరించిన ఆశిష్ ఈ మూవీతో హిట్ అందుకున్నారా? లేదా? రివ్యూలో చూద్దాం. 

Love Me If You Dare Movie Review: దిల్ రాజు మేనల్లుడు, రౌడీ బాయ్స్ మూవీ హీరో ఆశిష్, బేబీ సినిమాతో పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య నటించిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ మూవీ లవ్ మీ. బేబీ సినిమాతో బేబీగా అలరించిన వైష్ణవి చైతన్య ఖాతాలో హిట్ పడిందా? రౌడీ బాయ్స్ తో అలరించిన ఆశిష్ ఈ మూవీతో హిట్ అందుకున్నారా? లేదా? రివ్యూలో చూద్దాం. 

లవ్ మీ ఇఫ్ యూ డేర్

25/05/2024, UA
హారర్
  • నటినటులు:ఆశిష్, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి, రవికృష్ణ తదితరులు
  • దర్శకత్వం:అరుణ్ భీమవరపు
  • నిర్మాత:హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి
  • సంగీతం:ఎం.ఎం. కీరవాణి
  • సినిమాటోగ్రఫీ:పీసీ శ్రీరామ్

2

దిల్ రాజు కాంపౌండ్ నుంచి వచ్చిన ఆశిష్ తొలి ప్రయత్నంలో రౌడీ బాయ్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పర్వాలేదనిపించుకున్నారు. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇక బేబీ మూవీతో మెప్పించిన వైష్ణవి చైతన్య కూడా ఈ మూవీలో ఆశిష్ కి జోడీగా నటించింది. బేబీ హిట్ తర్వాత వైష్ణవి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మూవీ అంచనాలను అందుకుందా? లేదా? రివ్యూలో చూద్దాం. 

కథ: 

అర్జున్ (ఆశిష్) దేవుడన్నా, దయ్యాలన్నా నమ్మకం లేని వ్యక్తి. దయ్యాలున్నాయని ఎవరైనా అంటే అక్కడికి వెళ్లి దాని అంతు చూసి అసలు లేవు అని సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంటాడు. తాను చేసే పనిని వీడియోలు చేసి యూట్యూబ్ లో పెడుతుంటాడు. ఈ విషయంలో అర్జున్ కి సోదరుడు ప్రతాప్ (రవికృష్ణ) సహాయపడుతుంటాడు. ఈ క్రమంలో ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ ప్రియ (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి అర్జున్ కి చెప్తుంది. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓ ఊరిలో పాడుబడ్డ బిల్డింగ్ లో దెయ్యం తిరుగుతుందని.. చిన్న పాప చనిపోయి దయ్యంగా మారిందని.. దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే చంపేస్తుందని చెప్తుంది. ఎలాగైనా ఆ దయ్యాన్ని ప్రేమలో పడేసి కథేంటో తెలుసుకుందామని అనుకుంటాడు. అయితే అక్కడ ఒక పాప నిజంగానే ఉంటుంది. దయ్యం కాదని తెలుసుకుంటాడు. అసలు దివ్యవతి ఎవరు? ఆమె కథ ఏంటి? ఈ పాప ఎవరు? ఈ పాపకి, దివ్యవతికి సంబంధం ఏంటి? అసలు దివ్యవతి కథను ప్రియ అర్జున్ కి ఎందుకు చెప్పింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.    

విశ్లేషణ:

హీరో దయ్యాన్ని ప్రేమించడం అనేది కొత్త పాయింటే కానీ కానీ దాన్ని కన్విన్స్ చేయడం చాలా ముఖ్యం. మరోపక్క ఇన్వెస్టిగేటివ్ కోణంలో చూపిస్తూ ఇంట్రస్ట్ కల్పించాలి. ఈ రెండిటినీ బ్యాలన్స్ చేస్తూ తీయడం అనేది కష్టంతో కూడుకున్న పని. ఈ విషయంలో దర్శకుడు అరుణ్ భీమవరపు తడబడినట్లు కనబడుతుంది. కథలో కొత్తదనం ఉన్నా కూడా ఆడియన్స్ ని కన్విన్స్ చేయడంలో విఫలమయ్యారు. అమ్మాయిల మిస్సింగ్ పాయింట్ ని ట్విస్ట్ లా పెట్టడం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అక్కడక్కడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నా గానీ అర్జున్, ప్రతాప్, ప్రియ క్యారెక్టర్స్ మధ్య వచ్చే సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు. అర్జున్ చేసే ఇన్విస్టిగేషన్ తో సెకండాఫ్ ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. ఈ క్రమంలోనే మిస్ అయిన అమ్మాయిల గురించి తెలుస్తుంది. వీళ్ళకి, దివ్యవతికి ఉన్న లింక్ ని ఆసక్తికరంగా చూపించినప్పటికీ ఆ తర్వాత జరిగే ఎపిసోడ్ బోర్ కలిగిస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం థ్రిల్లింగ్ గా ఉంది. 

నటీనటుల పనితీరు:

దయ్యాలు లేవని నిరూపించే పాత్రలో ఆశిష్ బాగా నటించారు. ఇక వైష్ణవి చైతన్యకి ఫస్ట్ హాఫ్ లో అంత ప్రాధాన్యత ఉన్న సీన్స్ కనబడవు కానీ సెకండాఫ్ లో మాత్రం ఆమె చుట్టూ కథ తిరుగుతుంది. అర్జున్ అన్న పాత్రలో చేసిన రవికృష్ణ పాత్ర మేరకు పర్వాలేదనిపిస్తారు. 

సాంకేతిక పనితీరు:

కథలో కొత్తదనం ఉన్నా కానీ దాన్ని ఇంట్రస్టింగ్ గా మలచడంలో దర్శకుడు అరుణ్ తడబడ్డారు. ఎం.ఎం. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు ఓకే. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌లు:

  • కథలో కొత్తదనం
  • హారర్ సన్నివేశాలు, అక్కడక్కడా కొన్ని ట్విస్టులు

మైనస్‌లు:

  • స్క్రీన్ ప్లే
  • కన్ఫ్యూజ్ చేసే సెకండాఫ్

చివరగా: లవ్ మీ పర్వాలేదనిపించే సినిమా. 

రేటింగ్: 2/5

గమనిక: ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

Show comments