35 Chinna Katha Kaadu Review: 35 చిన్న కథ కాదు.. సినిమా రివ్యూ

35 Chinna Katha Kaadu Movie Review & Rating In Telugu: నివేదా థమాస్ కీలక పాత్రలో వస్తున్న 35 చిన్న కథ కాదు సినిమా గురించి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి.. ఆ సినిమా ఎలా ఉంది? ఎవరెలా చేశారు? తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

35 Chinna Katha Kaadu Movie Review & Rating In Telugu: నివేదా థమాస్ కీలక పాత్రలో వస్తున్న 35 చిన్న కథ కాదు సినిమా గురించి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి.. ఆ సినిమా ఎలా ఉంది? ఎవరెలా చేశారు? తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

35 చిన్న కథ కాదు

06-09-2024, ఫ్యామిలీ డ్రామా, 2h 25m U
U
  • నటినటులు:నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, తదితరులు
  • దర్శకత్వం:నంద కిశోర్ ఈమని
  • నిర్మాత:సిద్దార్థ్ రాళ్లపల్లి, సృజన్
  • సంగీతం:వివేక్ సాగర్
  • సినిమాటోగ్రఫీ:నికేత్ బొమ్మిరెడ్డి

Rating

2.75

టాలీవుడ్ ప్రేక్షకులు అభిరుచి గురించి అందరికీ తెలిసిందే. వాళ్లకు సినిమా పెద్దదా? చిన్నదా? అనేది అవసరం లేదు. సినిమాలో విషయం ఉందా.. లేదా? అనేదే ముఖ్యం. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలను కూడా పెద్ద హిట్లు చేస్తున్నారు. అలా ఒక చిన్న సినిమా అనే ట్యాగ్ తో వస్తున్న మూవీనే ’35 చిన్న కథ కాదు’. ఈ మూవీని దగ్గుబాటి రానా సమర్పిస్తున్నాడు. ఇది పదే పదే వచ్చే సినిమా కాదు అంటూ నాని కూడా చెప్పడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి.. ఆ అంచనాలను ఈ మూవీ రీచ్ అయ్యిందా? అసలు 35 చిన్న కథ కాదు సినిమా ఎలా ఉందో తెలియాలి అంటీ ఈ రివ్యూ చూసేయండి.

కథ:

ఈ కథ తిరుపతి నేపథ్యంలో జరుగుతూ ఉంటుంది. ప్రసాద్(విశ్వదేవ్) తిరుపతిలో ఒక RTC కండక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి తన సొంత మరదలు అయిన చిన్ను(నివేదా థామస్)తో వివాహం జరుగుతుంది. ఈ దంపతులకు అరుణ్- వరుణ్ అనే ఇద్దరు కుమారులు ఉంటారు. వరుణ్ అందరిలాంటి కుర్రాడే. కానీ, అరుణ్ మాత్రం కాస్త స్పెషల్ అని చెప్పాల్సిందే. అతనికి ఏ అనుమానం వచ్చినా కూడా దానిని తెలుసుకోకుండా ముందుకు వెళ్లలేడు. తనకు సరైన సమాధానం దొరక్కపోతే అసలు ఆ పని కూడా చేయడు. అలాగే అరుణ్ కు ‘0’కి సంబంధించి చాలా అనుమానాలు ఉంటాయి. అందరి పిల్లలకు లెక్కలు అంటే భయం అయితే.. అరుణ్ కి మాత్రం అవంటే చిరాకు. అన్నీ సబ్జెక్ట్స్ లో 80 మార్కులకు పైనే తెచ్చుకునే అరుణ్.. లెక్కల్లో మాత్రం పాస్ మార్కులు కూడా రావు. అదే స్కూల్ కి చాణక్య వర్మ(ప్రియదర్శి) లెక్కలు మాస్టారుగా వస్తాడు. చాణక్య- అరుణ్ మధ్య అనుకోని సంఘటన ఒకటి జరుగుతుంది. అందువల్ల స్కూల్లో పెద్ద గొడవే జరుగుతుంది. అరుణ్ లెక్కల్లో పాసైతే తప్ప.. స్కూల్లో కొనసాగే పరిస్థితి ఉండదు. అసలు చాణక్య- అరుణ్ మధ్య ఏం జరిగింది? అరుణ్ లెక్కల్లో పాస్ అయ్యాడా? స్కూల్ నుంచి పంపేశారా? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ:

ఈ మూవీ మొత్తం చిన్న పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని అందరికీ తెలిసిందే. అలాగే ఇది ఎంతో మందికి ఒక భూతంలా ఉండే లెక్కల చుట్టూ తిరుగుతూ ఉండే కథ. మూవీ మొత్తం కూడా మ్యాథ్స్.. దానిని చూసి పిల్లలు ఎంతలా భయ పడతారు అనే అంశాల చుట్టూనే కథ ఉండేలా డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు. ముందు లెక్కలంటే భయపడి.. ఆ తర్వాత ఆ మ్యాథ్స్ ఫియర్ ని ఎలా ఓవర్ కమ్ చేశారు అనే పాయింట్ మీద సినిమా నడుస్తూ ఉంటుంది. అదొక్కటే కాకుండా.. ఈ మూవీలో ఇంకో మంచి మెసేజ్ ఉంటుంది. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు.. అనుకంటే సాధించలేనిది ఏదీ లేదు అనే పాయింట్స్ మీద ఈ కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎలాగైనా లైఫ్ లో సెటిల్ కావాలి.. పిల్లలను ప్రయోజకులను చేయాలి అని కలలుగనే తండ్రి. ఎప్పుడూ పిల్లలు బాగా చదువుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి అని ఆశ పడుతూ ఉంటాడు.

అలాంటి తండ్రికి లెక్కలంటే పడని కొడుకు ఉంటాడు. అతని లైఫ్ లో మ్యాథ్స్ అంటే ఒక భూతం అనే చెప్పాలి. అలాంటి కుర్రాడు తన తల్లి సాయంతో ఆ లెక్కల భయాన్ని ఎలా అధిగమించాడు అనే పాయింట్ అందరినీ కట్టి పడేస్తుంది. ఈ అంశాన్ని చాలా సున్నితంగా.. అందరూ ఆలోచించేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇది అంత కొత్త కథ కాకపోయినా.. చిన్న కథ కాదు అని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే ఒక తండ్రి కలలను, ఒక కుర్రాడి భవిష్యత్తును, ఒక తల్లి ప్రయత్నాన్ని ఎంతో చక్కగా చూపించారు. అయితే ఈ సినిమాలో వచ్చిన ససస్య ఏంటంటే. కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇంకాస్త క్రిస్పీగా చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండు కదా అని భావన కలుగుతుంది. అలాగని మరీ ఓటీటీ కంటెంట్ అనుకోవడానికి లేదు. థియేటర్ కు వెళ్లి చూడదగిన చిత్రమే. పైగా చిన్న పిల్లలు వారి నటనతో ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించారు.

నటీనటుల పనితీరు- టెక్నికల్ పనితీరు:

ఈ మూవీ మొత్తాన్ని నివేధా థామస్ తన భుజానికి ఎత్తుకుంది అని చెప్పచ్చు. నివేధా నటించింది అనడం చాలా చిన్న మాట అవుతుంది. ఎందుకంటే ఆమె చిన్ను పాత్రలో జీవించేసింది. అలాగే విశ్వదేవ్ కూడా ప్రసాద్ పాత్రలో మెప్పించేశాడు. ఇంక మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్, హీరో ప్రియదర్శి అయితే చాణక్య పాత్రను నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాడు. ఇంక సీనియర్ యాక్టర్స్ భాగ్యరాజ్, గౌతమి కూడా తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. ఈ సినిమాలో ఉన్న పిల్లలు అందరూ కూడా తమ నటనతో మూవీని మరో స్థాయికి తీసుకెళ్లారు. అరుణ్ క్యారెక్టర్ చేసిన పిల్లాడు అందరి ఫేవరెట్ గా మారిపోతాడు.

ఇంక టెక్నికల్ విభాగం విషయానికి వస్తే.. డైరెక్టర్ నంద కిశోర్ ఈమని కథ, స్క్రీన్ ప్లేతో కాకుండా.. ఎమోషన్ డైలాగ్స్ తో కూడా మెప్పించాడు. తాను అనుకున్న కథను.. అనుకున్నట్లుగా తెరకెక్కించాడు. ఎక్కడా కూడా ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయడం, కంగారు పెట్టడంలాంటివి చేయలేదు. చిన్న కథ కాదు అని చెబుతూనే.. పెద్దగానే ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా స్థాయిని పెంచడంలో సినిమాటోగ్రఫీ కీలక పాత్ర పోషించింది అనే చెప్పాలి. అలాగే నేపథ్య సంగీతం, పాటలు కూడా కథకు తగినట్లు వెళ్తూ ఉంటాయి. ఎక్కడా కూడా స్థాయిని మాత్రం తగ్గించలేదు. అయితే మీకు సినిమా మొత్తం చూసిన తర్వాత మూవీని ఇంకాస్త క్రిస్ప్ చేసుంటే బాగుంటుంది అనే భావన కలగచ్చు. ఓవరాల్ గా నిర్మాణ విలువలు మాత్రం మెప్పిస్తాయి.

ప్లస్ లు:

  • నివేదా థామస్
  • కథ
  • ఎమోషన్స్

మైనస్లు:

  • అక్కడక్కడ సాగదీత
  • తెలిసిన ముఖాలు తక్కువ ఉండటం

చివరిగా: 35.. ఇది నిజంగానే చిన్న కథ కాదు..

రేటింగ్: 2.75/3

(*ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Show comments