IT Minister Duddilla Sridhar Babu Details: తెలంగాణ కొత్త IT మంత్రి శ్రీధర్ బాబు చదువు, బ్యాగ్రౌండ్ డీటెయిల్స్ ఇవే..

Duddilla Sridhar Babu: తెలంగాణ కొత్త IT మంత్రి శ్రీధర్ బాబు చదువు, బ్యాగ్రౌండ్ డీటెయిల్స్ ఇవే..

Duddilla Sridhar Babu Biography & Political Journey: తెలంగాణ కొత్త ఐటీ మంత్రి ఎవరు.. ఆ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అనే ప్రశ్నకు నేటితో జవాబు లభించింది. దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి ఐటీ శాఖ బాధ్యతలు అప్పగించారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన చదువు, బ్యాగ్రౌండ్ కు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..

Duddilla Sridhar Babu Biography & Political Journey: తెలంగాణ కొత్త ఐటీ మంత్రి ఎవరు.. ఆ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అనే ప్రశ్నకు నేటితో జవాబు లభించింది. దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి ఐటీ శాఖ బాధ్యతలు అప్పగించారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన చదువు, బ్యాగ్రౌండ్ కు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మరో 11 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నేడు వారికి శాఖలు కేటాయించారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఒక అంశం మీద జోరుగా చర్చ సాగింది. తెలంగాణకు రాబోయో నూతన ఐటీ మంత్రి ఎవరూ అనే దాని గురించి పెద్ద ఎత్తున చర్చించుకున్నారు జనాలు. ప్రస్తుతం దేశంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ నగరమే ఐటీలో అగ్రగామిగా ఉంది. ఐటీకి హైదరాబాద్ గుండెకాయలా మారింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. నగరానికి కంపెనీలు, పరిశ్రమలు రావని అప్పట్లో ప్రచారం చేశారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక రెండు సార్లు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఆ రెండుసార్లూ ఈ శాఖను కేటీఆరే చేపట్టారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

హైదరాబాద్ లో ఐటీరంగం చాలా అభివృద్ది చెందింది. ఎవరూ ఊహించని స్థాయిలో హైదరాబాద్ నగరంలో ఐటీ జోరు కొనసాగింది.. ఐటీ మినస్టర్గా తనదైన ముద్ర వేశారు కేటీఆర్. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. బీఆర్ఎస్ ఓడిపోయింది. దాంతో.. నెక్ట్స్‌ ఐటీ మినిస్టర్‌ ఎవరనే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేటీఆర్ స్థానాన్ని రీప్లేస్ చేసేది ఎవరంటూ జోరుగా చర్చించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేటీఆర్ లాంటి డైనమిక్ లీడర్ కే ఐటీ పదవి కట్టబెట్టాలని సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్, యువత సోషల్ మీడియా వేదికన డిమాండ్ చేశారు.

ఈనేపథ్యంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేరు తెర మీదకు వచ్చింది. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం.. దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకే ఈ శాఖ కేటాయిస్తారని అభిప్రాయపడ్డారు. చివరకు వారు చెప్పినట్లుగానే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పగించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. రేవంత్ కేబినెట్లో దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మంత్రి పదవి లభించింది. ఆయనకు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖలు  కేటాయించారు.

లాయర్ టూ ఐటీ మినిస్టర్..

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా శ్రీధర్ బాబుకి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ ఎన్నికల్లో ఆయన మంథని నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆయన చదువు, బ్యాగ్రౌండ్ వివరాలకు వస్తే.. ప్రముఖ కాంగ్రెస్ నేత శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు, జయమ్మలకు 1969 మార్చి 30న జన్మించారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టారు.

అయితే తండ్రి శ్రీపాద రావు మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు శ్రీధర్ బాబు. తండ్రి తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చిన ఆయన 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, శాసన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

సరికొత్త రికార్డు..

ఉన్నత చదువులు చదువుకున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాజకీయాల్లో వివాదరహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాక ఆయన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు రికార్డును బ్రేక్ చేశారు. ఇప్పటి వరకు ఉమ్మ కరీంనగర్ జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత ఎవరూ లేరు. మంథని నియోజకవర్గం నుంచి పీవీ నరసింహారావు నాలుగుసార్లు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ రికార్డును దుద్దిళ్ల శ్రీధర్ బాబు బ్రేక్ చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా చరిత్ర సృష్టించారు.

క్రికెట్‌ ప్లేయర్‌ కూడా..

ఇక శ్రీధర్‌బాబు గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన మంచి క్రికెటర్ అని తెలిసింది. శ్రీధర్‌బాబు నిజాం కళాశాల, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించారు. శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ కేడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి శైలాజా రామయ్యర్ ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఇప్పటి వరకు ఆయన ఏ పదవి చెపట్టినా.. సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తూ.. గుర్తింపు తెచ్చుకోగా.. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా కూడా తన మార్క్‌ చూపిస్తారని అంటున్నారు. ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

Show comments