iDreamPost
android-app
ios-app

నన్ను ఎవరూ బెదిరించలేరు : తమిళి సై

  • Published Apr 19, 2022 | 8:58 AM Updated Updated Apr 19, 2022 | 9:57 AM
  • Published Apr 19, 2022 | 8:58 AMUpdated Apr 19, 2022 | 9:57 AM
నన్ను ఎవరూ బెదిరించలేరు : తమిళి సై

‘‘నా జీవితం పారదర్శకం. సెలవు కూడా తీసుకోకుండా పని చేస్తున్నా. నన్ను మార్చేస్తారని (గవర్నర్‌ పదవి నుంచి తప్పించడం) ఎవరూ బెదిరించలేరు. నా సమర్థతను, విధులను ఎవరూ ప్రశ్నించలేరు. ఎలా పనిచేయాలో ప్రధాని, కేంద్ర హోం మంత్రి నుంచి నేర్చుకున్నాం. వాటిని ఆచరిస్తున్నాం’’ అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. గవర్నర్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేసే విషయం తనకు తెలియదని తమిళిసై చెప్పారు. గవర్నర్‌పై టీఆర్‌ఎస్‌ మంత్రులు, నేతల వ్యాఖ్యలపై తమిళిసై స్పందించారు. గవర్నర్‌ వ్యవస్థను ఎందుకు గౌరవించడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దల మద్దతు ఉంది కాబట్టే తాను బలంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి నైతికంగా మద్దతిస్తున్నారని తెలిపారు.

సోమవారం ఆమె ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తన మీద విశ్వాసం ఉంది కాబట్టే తెలంగాణకు గవర్నర్‌గా, పుదుచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించారని చెప్పుకొచ్చారు. నాయకుల పట్ల తనకు అత్యంత గౌరవం ఉందన్నారు. అఖిల భారత సర్వీసుల అధికారులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడంపై తమిళిసై కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా అని విలేకరులు అడగ్గా.. ‘‘అన్ని విషయాలను నేను బయటపెట్టలేను. వ్యవస్థ తన పనితాను చేసుకుంటూ పోతుంది. కానీ, చేసిన తప్పులను వారు గ్రహించుకోవాలి. వాళ్లకూ ప్రొటోకాల్‌ తెలుసు. కాబట్టి వాళ్లే సరిదిద్దుకోవాలి. అధికారుల శైలిపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లడాన్ని ఫిర్యాదు అనుకోవడానికి లేదు. ప్రతి నెలా కేంద్రానికి నివేదిక అందిస్తుంటా. అందులో నేను ప్రతి విషయాన్నీ ప్రస్తావిస్తా. తొలుత ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, ఉద్దేశపూర్వకంగా చేస్తుండడంతోనే నెలవారీ నివేదికలో ప్రస్తావించా’’ అని వెల్లడించారు.

బీజేపీకి సహకరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. ‘‘నేను బీజేపీ వాళ్లకు సహకరిస్తున్నానని ఊహించుకోవచ్చు. కానీ, అందుకు ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? గతంలో నేను బీజేపీకి చెందిన వ్యక్తినే. దాన్ని ఎవరూ కాదనలేదు. అది నా చరిత్ర. కానీ, ఇప్పుడు కూడా అలాగే ఉంటాననుకుంటే ఎలా? కాంగ్రెస్‌ నేతను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని తక్షణమే అతడ్ని ఎమ్మెల్సీ చేయాలనుకున్నారు. మరి అతన్ని కాంగ్రెస్‌ వ్యక్తిగా ఎందుకు భావించడం లేదు..? అతనిపై ఉన్న నమ్మకం ఇతరుల మీద ఎందుకు లేదు?’’ అని తమిళిసై ప్రశ్నించారు. గవర్నర్‌ వ్యవస్థను అవమానించడం సరికాదని, అది ప్రజలకూ మంచిది కాదని చెప్పారు.

‘‘సోషల్‌ మీడియాలో నన్ను ట్రోల్‌ చేశారు. తమిళనాడులోని నా పాత వీడియోలను బయటికి తీశారు. ఏ ఎన్నికల్లో గెలవలేదు కాబట్టే గవర్నర్‌ను చేశారని ఓ మంత్రి అన్నారు. ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. కొంతమంది సాధారణ ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో నాకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వమూ లేదు. వాళ్లు ఎందుకిలా చేస్తున్నారో అర్థంకావడం లేదు’’ అని అన్నారు. ‘‘నేను యథాలాపంగా మాట్లాడిన విషయాలు బయటికి వచ్చాయి. నేను ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని ఎక్కడా చెప్పలేదు. ఆర్నెల్ల వ్యవధిలో అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంటుందని చెప్పా. ఈ విషయాన్ని చెబితే గవర్నర్‌ ప్రభుత్వాన్ని పడగొడతానన్నారని ఆరోపణలు చేస్తున్నారు. నేను అప్రజాస్వామిక పనులు చేయను’’ అని తమిళిసై పేర్కొన్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş