SNP
MLC Kavitha, Tihar Jail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. తనకు జైలులో ఎలాంటి సౌకర్యాలు కావాలో కోర్టును కోరారు. అందులో ఉన్న కొన్ని వస్తువులు ఆశ్చర్యపరుస్తున్నాయి.
MLC Kavitha, Tihar Jail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. తనకు జైలులో ఎలాంటి సౌకర్యాలు కావాలో కోర్టును కోరారు. అందులో ఉన్న కొన్ని వస్తువులు ఆశ్చర్యపరుస్తున్నాయి.
SNP
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో పది రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఈడీ జ్యూడీషియల్ కస్టడీకి కోరడంతో రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రీల 9 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. దీంతో కవితను తీహార్ జైలుకు పంపారు. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను ఏప్రిల్ 1న విచారించనున్నారు. అప్పటి వరకు తీహార్ జైలులోనే ఉండనున్నారు. అయితే జైలుకు వెళ్లే వీఐపీలకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. తమకు ఎలాంటి సౌకర్యాలు కావాలో నిందితులు కోర్టును కోరవచ్చు. ఈ క్రమంలోనే కవిత కూడా తనకు కావాల్సిన సౌకర్యాల లిస్ట్‌ను కోర్టు ముందు ఉంచారు.
సాధారణంగా వీఐపీలకు జైలులో వారి ఆరోగ్య సమస్యలను బట్టి ఈ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు. ఇంటి భోజనం, మెత్తటి పరుపు, దిండు, న్యూస్ పేపర్లు, కొన్ని సందర్భాల్లో టీవీ కూడా ఏర్పాటు చేస్తారు. ఇటీవల ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ రాజమండ్రి జైలులో ఉంచింది ఆ సమయంలో చంద్రబాబు ఉన్న సెల్‌లో ఏసీ కూడా ఏర్పాటు చేశారు. అయితే.. చంద్రబాబు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కోర్టు ఆయన సెల్‌లో ఏసీ ఏర్పాటుకు ఆదేశించింది. ఇప్పుడు తీహార్ జైల్‌లో ఉన్న కవిత ఏసీ లాంటి లగ్జరీ సౌకర్యాలు కోరలేదు కానీ, ఆమె కోరిన సౌకర్యాల్లో, వస్తువుల్లో కొన్ని చర్చనీయాంశంగా మారాయి.
తనకు జైల్లో ఇంటి నుంచి ఆహారంతో పాటు మంచి పరువు, బెడ్ షీట్స్, స్లిప్పర్లు, బుక్స్, బ్లాంకెట్స్, పెన్ను, పేపర్లు, మెడిసిన్స్ తో పాటు.. జ్యూయలరీ కూడా అనుమతించాలని కోరారు. ఆ జ్యూయలరీ ఏంటి అన్నది మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే.. సాధారణంగా జైలుకు వెళ్లిన వారి ఒంటిపై ఎలాంటి ఆభరణాలు ఉండనివ్వరు జైలు అధికారులు. కానీ మహిళలు, అందులోనా హిందూ మహిళలు కొన్ని ఆభరణాలు సెంటిమెంట్‌గా భావిస్తారు. అందులో తాళి, మెట్టెలు, ఉంగారులు ఉంటాయి. వారి సంప్రదాయన్ని గౌరవిస్తూ.. వాటిని తీసేయడం అశుభంగా భావిస్తారు. బహుశా .. కవిత కోరిన జ్యూవెలరీ కేటగిరిలో ఇవే ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#KKavithaArrested | ED will produce K Kavitha in Court. K Kavita’s ED remand is ending today.
During her last appearance in court, Kavita described her arrest as illegal in front of the media and said that she would continue to fight against this arrest in court.
Watch the… pic.twitter.com/zMwrfThQxZ
— NewsX World (@NewsX) March 26, 2024