iDreamPost
iDreamPost
రాజ్‌భవన్ వేదికగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ గురువారం మహిళా దర్బార్‌ను నిర్వహించారు. తెలంగాణ మహిళలు ఇబ్బందిపడుతుంటే చూస్తూ ఊరుకోనని, వాళ్ల కోసం పోరాటం చేస్తానని తెలంగాణ గవర్నర్ అన్నారు. మహిళాదర్బార్ లో మహిళల సమస్యలను విన్నారు. తెలుగులోనే మాట్లాడారు.
నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు. తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాను. ప్రజల తరుపున బలమైన శక్తిగా ఉంటాను. నాను వ్యతిరేకంగా మాట్లాడే వారిని నేను పట్టించుకోను. బాలికలు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలను చూస్తుంటే, నా గుండె రగిలిపోతోంది. జూబ్లీహిల్స్ సామూహిక లైంగిక దాడి ఘటనలో నివేదిక ఇవ్వలేదు. దానిపై నేను అసంతృప్తిగా ఉన్నాను. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినా, స్పందించలేదు. తెలంగాణ గవర్నమెంట్ నా విషయంలో ప్రొటోకాల్ పాటించలేదు. దీనిపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
నేనేమీ నా కోసమే పోరాటం చేయడం లేదు. మహిళలను ఆదుకోవడానికి నేను ఎప్పుడూ బలంగా ఉంటాను. బాధితులు ఎవరైనా వారి కోసం నా హృదయం రోధిస్తుంది. నా బలమైన స్వరంతో, మహిళల సమస్యలను ప్రభుత్వానికి తెలియచేస్తాను. రాజ్‌భవన్ నుంచి వచ్చే వినతులను, అధికారులు పరిష్కరించాలి. మహిళా దర్బార్ వెనుక ఎలాంటి రాజకీయం లేదు. భవిష్యత్తలోనూ మహిళా దర్బార్ కొనసాగిస్తాను. మన గెలుపును ఎవరూ ఆపలేరు అని తెలంగాణ గవర్నర్ వాఖ్యానించారు.