Krishna Kowshik
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే ప్రతిపక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వంపై ఇంకా నీలి నీడలు కమ్ముకున్నాయి.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే ప్రతిపక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వంపై ఇంకా నీలి నీడలు కమ్ముకున్నాయి.
Krishna Kowshik
అగ్రరాజ్యంలో నాలుగేళ్లకు ఒకసారి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగుతుంటాయి. ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠత నెలకొంది. అధికారిక డెమొక్రటిక్, ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీల మధ్య రసవత్తర పోరు మొదలైంది. ఈ సారి అధికారాన్ని చేపట్టాలని రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హోరా హోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. రెండు సార్లు అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు డొమొక్రటిక్ అభ్యర్థిపైనే నీలినీడలు కమ్ముకున్నాయి. జో బైడెన్ ప్రెసిడెన్షియల్ రేసు నుండి తప్పుకుంటున్నాడన్న వార్త గుప్పుమంటున్నాయి.
2019లో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది సంవత్సరాల రిపబ్లిక్ పార్టీ అబ్యర్థి ట్రంప్‌కు ఝలక్ ఇచ్చి.. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు పట్టం కట్టారు ప్రజలు. అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్ నియమితులయ్యారు. అయితే అమెరికా ప్రజల ఆకాంక్షలను జో బైడెన్ నేరవేర్చలేదన్న అపవాదు నెలకొంటుంది. వయసు మీద పడటంతో పాటు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు వెంటాడాయి. పలుమార్లు తత్తరపాటుకు కూడా గురయ్యి ట్రోలింగ్ కు గురయ్యారు. దీంతో ఈ సారి అధ్యక్ష రేసులో ఈయన ఉండబోరని తెలుస్తోంది. ఆయన స్థానంలో భారత సంతతి మూలాలున్న మహిళ, దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ పోటీ చేయనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఓవైపు ట్రంప్ చాలా జోష్‌గా ప్రచారాన్ని కొనసాగిస్తుండగా.. ఇంకా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరో మీమాంస కొనసాగుతుంది. ట్రంప్‌ను ఎదురర్కొనేంత సత్తా బైడెన్‌కు లేదని సొంత పార్టీ నేతలు భావిస్తున్నారు. బైడెన్ పోటీ చేస్తే పార్టీ గెలవకపోవచ్చునని, డెమొక్రటిక్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని, చట్టసభపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి నెలకొందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేసు నుండి వైదొలగడం మంచిదని భావిస్తున్నారు. ఈ వార్తలకు ఆజ్యం పోసేలా.. కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. సొంత పార్టీ నేతలే బహిరంగంగా బైడెన్ పోటీ చేయడంపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు.
పార్టీ సీనియర్ నేత నాన్సీ పెలోసీతో పాటు మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం రేసు నుండి తప్పుకోవాలని ఆయనకే సూచించినట్లు తెలుస్తుంది. వీరితో పాటు పార్టీ ప్రతినిధి ఆడమ్, ఇతర నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ బైడెన్ వెనక్కు తగ్గడం లేదు. గతంలో ట్రంప్‌ను ఓడించిన అభ్యర్థిని తానేనంటూ , ఈ సారి కూడా తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. కానీ పార్టీ నేతలు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షురాలు అయ్యే సామర్థ్యం కమలా హ్యారిస్‌కు ఉందని.. నేషనల్ అసోసియేష్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ వార్షిక సదస్సులో జో బైడెన్ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బైడెన్ ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరీ ఈ సారి ఆయన పోటీ చేస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.