Idream media
Idream media
అధికారమదంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అండ్ కో చేసిన ఒక కబ్జా వ్యవహారం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఓటుకు నోటు కేసు అయ్యే ముందు వరకు హైదరాబద్ వదిలిరాని ఆయన ఆ తరువాత ఏపీ వచ్చేశారు. అలా వచ్చి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామపరిధిలో కృష్ణానది ఒడ్డున లింగమనేని రమేష్ కు చెందిన గెస్ట్ హౌస్ లో నివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఆ విషయంలోనే వివాదం చెలరేగింది. బాబు నివాసముండే ఇంటిపక్కనే వున్న తన 8సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారని శింగంశెట్టి శ్రీనివాసరావు అనే బాధితుడు ఆందోళనకు దిగాడు.
ఆయనకు జనసేన నాయకులు కూడా మద్దతు తెలపడంతో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తన స్థలం అయినా తనకు అప్పగించాలి అని లేదా దానికి పరిహారం అయినా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆ నివాసంలో దిగిన చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కూడా ఆయన ఇదే ఇంట్లో నివాసముంటున్నారు. తన స్థలాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని… అందువల్లే ఆందోళనకు దిగానని శ్రీనివాసరావు చెబుతున్నారు.
కబ్జా చేసిన స్థలాన్ని అప్పగించాలని చంద్రబాబును కోరడానికి వెళితే ఆయన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని ఏం చేయాలో తెలియక ఆయన ఇంటిముందు ఆందోళనకు దిగారట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సదరు శ్రీనివాసరావు జనసెనకు చెందిన వ్యక్తి కావడంతో జనసేన పార్టీ నేతలు కూడా ఆయన ఆందోళనకు మద్దతు తెలిపారు. ఉండవల్లి చంద్రబాబు నివాసముంటున్న ఇల్లు అక్రమం అని ప్రభుత్వం నోటీసులు కూడా ఇచ్చింది. కరకట్ట మీద నిర్మాణం చేయకూడని ప్రాంతంలో నిర్మించడంతో నోటీసులు ఇచ్చారు.