iDreamPost
android-app
ios-app

రాజ్యసభకు ఇళయరాజా?

రాజ్యసభకు ఇళయరాజా?

‘అంబేద్కర్ అండ్ మోడీ – రిఫార్మర్స్ ఐడియాస్ అండ్ పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్’ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ భాషలో బ్లూక్రాఫ్ట్ పబ్లికేషన్స్ ఇటీవ‌ల‌ ప్రచురించింది. ఈ పుస్తకంలో ఇళయరాజా ముందుమాట రాయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అలాగే.. ఈ ముందుమాటలో డాక్టర్ అంబేద్కర్ ను ప్రధాని నరేంద్రమోడీతో పోలుస్తూ ఇళయరాజా చేసిన వ్యాఖ్యలు తమిళ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇళయరాజా దళితుడు కావడం, ఆయన తండ్రి ప్రముఖ కమ్యూనిస్టు ప్లాట్‌ఫార్మ్ గాయకునిగా పని చేయడంతో హాట్ టాపిక్ గా మారింది.

అంబేద్కర్, నరేంద్ర మోడీ మధ్య ఉన్న అద్భుతమైన సారూప్యతలను కూడా ఈ పుస్తకం వెల్లడించింది. ”సమాజంలో అణగారిన వ్యక్తులు ఎదుర్కొంటోన్న సవాళ్లను ఈ ఇద్దరూ అధిగమించారు. పేదరికం, అణచివేతతో కూడిన సామాజిక వ్యవస్థ స్థితిగతుల్ని వీరిద్దరూ నిశితంగా గమనించి వాటిని అణిచివేసేందుకు కృషి చేశారు. భారత్ గురించి వీరిద్దరికీ పెద్ద కలలు ఉన్నాయి. ఇద్దరూ ప్రాక్టికల్‌గా ఆలోచించేవారే” అని ముందుమాటలో ఆయన రాసుకొచ్చారు. దీనిపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న మ‌రో ప్ర‌చారం ఆస‌క్తిగా మారింది.

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ‘మేస్ట్రో’ ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్‌ చేసేందుకు రంగం సిద్ధమైందని ఆ ప్ర‌చారం సారాంశం. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్థిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేసే విషయం తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన 12 మందిని ఆయన రాజ్యసభ సభ్యులుగా నియమిస్తారు. ఆ కోటాలోనే ఆరేళ్లకిందట మోడీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామి ని ఎగువసభకు పంపింది. ఆయన పదవీకాలం త్వరలో ముగియనుంది.ఇప్పుడు ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నియమించనున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆయన ఇటీవల మోడీని అంబేద్కర్ తో పోల్చడంపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. వారిపై బీజేపీ సీనియర్‌ నేతలు రాధాకృష్ణన్‌, హెచ్‌ రాజా తదితరులు విరుచుకుపడ్డారు. తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా ఇళయరాజాకు మద్దతిచ్చారు. మోడీపై ప్రశంసలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటిని విమర్శించడం తగదన్నారు. ఈ నేపథ్యంలో ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా నియమించనున్నారన్న వార్త చర్చనీయాంశంగా మారింది. ఇది ఎంతవ‌ర‌కు నిజ‌మ‌నేది నిర్ధార‌ణ కావాల్సి ఉంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet