iDreamPost
android-app
ios-app

సీపీఎస్‌ రద్దు దిశ‌గా ఏపీ చ‌ర్య‌లు

సీపీఎస్‌ రద్దు దిశ‌గా ఏపీ చ‌ర్య‌లు

ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేర్చ‌డంలో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందువ‌రుస‌లో ఉంటున్నారు. అధికారం లోకి వ‌చ్చిన ఏడాదిన్న‌ర‌లోనే 95 శాతం మేనిఫెస్టోలోని అంశాల‌ను అమ‌లుప‌రిచి చ‌రిత్ర సృష్టించారు. రెండున్న‌రేళ్ల‌లో మేనిఫెస్టోలో లేని ఎన్నో చారిత్ర‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. తాజాగా మ‌రో నిర్ణ‌యం అమ‌లు దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అదే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ర‌ద్దు.

ఉద్యోగుల విన‌తి మేర‌కు ఏపీ ప్రభుత్వం సీపీఎస్ రద్దు పై వేగం పెంచింది. సీపీఎస్ రద్దు అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా సమీక్ష నిర్వహించారు. సచివాలయం బ్లాక్ వన్ లో సమావేశం జరిగింది. ఈ భేటీకి ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.సీపీఎస్ స్కీమ్ పై సీఎం జగన్ కు పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు. పీఆర్సీ అంశం పై ఇప్పటికే ఉన్న మంత్రివర్గ ఉప సంఘం, అధికారులు కలిసి ఉద్యోగ సంఘాల నాయకులతో క‌లిసి సీపీఎస్ ర‌ద్దు కసరత్తు ప్రారంభించాలని జ‌గ‌న్ ఆదేశించారు. సీపీఎస్ రద్దు పథకాన్ని ఉద్యోగ సంఘాల నేతలకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని స‌మావేశంలో సూచించారు. అనంతరం చర్చల ప్రక్రియ చేపట్టాలని సూచించారు సీఎం జగన్. వచ్చేనెలలో సీపీఎస్ రద్దుకి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

సీపీఎస్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి రాకముందు ఉద్యోగుల జీతాల నుండి పెన్షన్ కోసం పైసా కూడ కట్ చేసేవారు కాదు. కానీ, కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతీ ఉద్యోగి జీతం నుండి కనీసం 10 శాతాన్ని పెన్షన్ స్కీమ్ కోసం కట్ చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాల నుండి కట్ చేసిన నిధులను షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే షేర్ మార్కెట్లలో పెట్టుబడులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతిల్లోకి వెళ్తాయని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయంతో ఉన్నారు. పాత పెన్షన్ స్కీమ్ లో అయితే పెన్షన్ కోసం ఒక్క పైసా కూడ ఉద్యోగి వేతనం కూడ కట్ చేసేవారు కాదు.

పాత పెన్షన్ స్కీమ్ పద్దతిలోనే ఉద్యోగులు ప్రయోజనం పొందేవారని ఉద్యోగ సంఘాలు అభిప్రాయంతో ఉన్నాయి. ఉద్యోగి బేసిక్ వేతనంలో 7 ఏళ్ళ పాటు సగం జీతాన్ని పెన్షన్ రూపంలో చెల్లించేవారు. ఆ తర్వాత 30 శాతం పెన్షన్ గా చెల్లించేవారు. కానీ సీపీఎస్ విధానం ద్వారా ఉద్యోగులకు పెన్షన్ అతి తక్కువగా పొందే అవకాశం ఉంది. అతి తక్కువ మొత్తాన్ని ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ గా పొందనున్నారని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. పాద‌యాత్ర‌లో వీరి ఆందోళ‌న‌ను గుర్తించిన జ‌గ‌న్ సీపీఎస్ ర‌ద్దు కు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఆ హామీ అమ‌లు దిశ‌గా క‌స‌ర‌త్తు వేగ‌వంతం చేశారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet