నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ జారీ

ప్రకాశం జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్ కు చెందిన వివిధ ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ల్యాబ్ అటెండెంట్ 2 , కౌన్సెలర్ 1 , ఆడియో మెట్రిషియన్ 1, బయోమెడికల్ ఇంజినీర్ 2 , ప్లంబర్ 3, ఎలక్ట్రిషియన్ 2, రేడియో గ్రాఫర్ 1 పోస్టు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఆయా పోస్టులను అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, బీఏ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏపీ పారామెడికల్ లో రిజిస్టర్ అయిఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి రిజర్వేషన్, మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజుగాను ఓసీ అభ్యర్ధులు 500రూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులు 300రూ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్ లైన్ విధానంలో ఉంటుంది. దరఖాస్తులు.. డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపాలి. దరఖాస్తులు పంపేందుకు ఈ నెల 18 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలు https://prakasam.ap.gov.in/notice_category/recruitment/ లో అందుబాటులో ఉన్నాయి.

Show comments