iDreamPost
android-app
ios-app

గ‌త త‌ప్పిదాల వ‌ల్లే న‌ష్టాలు.. స్ప‌ష్టం చేసిన ట్రాన్స్ కో సీఎండీ

గ‌త త‌ప్పిదాల వ‌ల్లే న‌ష్టాలు.. స్ప‌ష్టం చేసిన ట్రాన్స్ కో సీఎండీ

ఏపీలో విద్యుత్ ఛార్జీల భారం ప్ర‌జ‌ల‌పై ఎంత‌, ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల్లో నిజ‌మెంత‌, విద్యుత్ రంగాల్లో న‌ష్టాల‌కు అస‌లు కార‌కులెవ‌రు.. చార్జీలు పెంచేందుకు కార‌ణాలేంటి.. అనే అంశాల‌పై ట్రాన్స్ కో ఎండీ శ్రీ‌ధ‌ర్ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశాల‌ను వెల్ల‌డించారు. చార్జీలు ఎంత పెరిగాయి, ఎలా పెరిగాయి అనే వివ‌రాల‌ను తెలిపారు. వాస్త‌వాల‌కు విరుద్ధంగా విప‌క్షాల ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. విద్యుత్ చార్జీల స‌వ‌ర‌ణ ద్వారా ప్ర‌జ‌ల‌పై స్వ‌ల్ప భార‌మే అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీలను స‌వ‌రిస్తూ ఇటీవ‌ల ఏపీ ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. దీన్ని రాజ‌కీయంగా అనుకూలంగా మార్చుకునేందుకు విప‌క్షాలు ఎత్తుగ‌డ‌లు ప్రారంభించాయి. దీనిలో భాగంగా ప్ర‌జ‌ల్లో లేనిపోని అపోహ‌లు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని వైసీపీ వ‌ర్గాలు విమ‌ర్శిస్తున్నాయి. జ‌రుగుతున్న ప్ర‌చారం నేప‌థ్యంలో ట్రాన్స్ కో సీఎండీ శ్రీ‌ధ‌ర్ వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల ముందుంచారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వేసవి కావడంతో విద్యుత్‌ డిమాండ్ పెరిగిందని.. సాధారణ రోజుల్లో 180 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉండగా.. ప్రస్తుతం 230 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం పెరిగిపోయిందన్నారు.

అదిలా ఉంచితే.. పీపీఏల రద్దు వల్లే ప్రస్తుతం ఛార్జీలు పెరిగాయన్న వాదనలో నిజం లేదని కొట్టిపారేశారు ట్రాన్స్‌ కో ఎండీ. పీపీఏలను ప్రభుత్వం రద్దు చేయలేదన్న ఆయన.. ధరలను సమీక్షించమని కంపెనీలను కోరిందని వివరించారు. సెకీ నుంచి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని.. ఆ విద్యుత్ను వ్యవసాయం కోసమే వివియోగిస్తామని వెల్లడించారు శ్రీధర్. ఇక, గతంలో దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాలు అధిక ధరలకు చేసుకోవడం వల్లే ఇప్పుడు తీవ్ర నష్టం జరుగుతున్నట్టు పేర్కొన్నారు ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్.. బొగ్గు ధరల కారణంగా గతంలో కొన్ని యూనిట్లు మూసివేయాల్సి వచ్చిందన్న ఆయన.. ట్రూ అప్ ఆదాయం పెంపునకు ఏపీ ఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఈఆర్సీ ఆమోదించిన ట్రూ అప్ ఆదాయం.. డిస్కంలకు రూ. 2100 కోట్లు పెంచింది. రిటైల్ టారిఫ్ సప్లై ఆర్డర్ ద్వారా రూ. 1400 కోట్లు, అలాగే ట్రూ అప్ మరో రూ.700 కోట్లు వసూలు చేసుకునే వెసులుబాటు ఉందని వెల్లడించారు.

ఏపీలోని అన్ని రకాల విద్యుత్ సంస్థలకు రూ. 83 వేల కోట్ల మేర అప్పు ఉందన్న ఆయన.. రూ. 1400 కోట్లు రిటైల్ టారిఫ్ సప్లై ఆర్డర్ ద్వారా డిస్కంలకు ఆదాయం వస్తోంది.. రూ. 6.90 పైసల మేర విద్యుత్ కొనుగోలు ఛార్జీ అవుతోందని.. విద్యుత్ వినియోగంలో 50 శాతం జనాభా 75 యూనిట్లలోపు టారిఫ్ లోకి వస్తారు.. 50 శాతం మంది ప్రజల మీద పెరిగిన విద్యుత్ ఛార్జీలు భారం స్వల్పంగానే ఉంటుందని వివరించారు. ప్రజల కోరిక మేరకే టెలిస్కోపిక్ విధానం అమలు చేస్తున్నాం.. విద్యుత్ ఛార్జీల సవరణ ద్వారా ప్రజలపై పడే భారం స్వల్పమే అన్నారు.. ఇక, విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం ప్రభుత్వానిది కాదు.. ఈఆర్సీదే అన్నారు ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్‌.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusu