iDreamPost
android-app
ios-app

మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత

  • Published Feb 28, 2022 | 9:10 AM Updated Updated Feb 28, 2022 | 9:38 AM
  • Published Feb 28, 2022 | 9:10 AMUpdated Feb 28, 2022 | 9:38 AM
మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత

మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూశారు. ఆయన వయసు 104 సంవత్సరాలు. గత కొన్నిరోజులుగా వయోభారంతో ఏర్పడిన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో జన్మించిన ఈయన1967,1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978-80 మధ్య మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయశాఖ మంత్రిగా కూడా చేశారు.

1983లో ఏర్పడిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత 1995లో గుంటూరు జెడ్పీఛైర్మన్ గా, 1998లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సంగం డెయిరీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు.తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యునిగా, తెలుగురైతు అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 2004లో రాజ్యసభ పదవీకాలం ముగియడంతో వయోభారం కారణంగా అప్పటినుంచే ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఇక ఏపీ బీజీపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కు స్వయానా మేనమామ. వెంకట్రావు మృతి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom