Sitaram Yechury: CPM నేత సీతారాం ఏచూరి కన్నుమూత!

Sitaram Yechury Passed Away: ఇటీవల కాలంతో తరచూ సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రాజకీయ రంగలో ఓ కీలక నేత మరణించారు. సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారం ఏచూరి కన్నుమూశారు.

Sitaram Yechury Passed Away: ఇటీవల కాలంతో తరచూ సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రాజకీయ రంగలో ఓ కీలక నేత మరణించారు. సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారం ఏచూరి కన్నుమూశారు.

ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్యం, ఆత్మహత్య, రోడ్డు ప్రమాదం, గుండె పోటు వంటి కారణాలతో పలువురు ప్రముఖులు మరణిస్తున్నారు. బుధవారం ప్రముఖ నటి మల్లికా అరోరా తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. తాజాగా రాజకీయ రంగంలో విషాదం అలుముకుంది. ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం  ఆయన ఆరోగ్యం విషమించి..క్రితం తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మృతిపట్లపై  సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సీపీఎం పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఇక ఆయన మృతి సీపీఎం పార్టీకి తీరని లోటు అని పలువురు తెలిపారు.

దేశ రాజకీయాల్లో కీలక నేతగా పేరు తెచ్చుకున్న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. గురువారం సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ లో ఆయనకు చికిత్స జరుగుతుంది. సీతారాం ఏచూరి చాలా కాలంగా న్యుమోనియా లాంటి ఛాతి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరి.. ఐసీయూలో చికిత్స  ఉన్నారు. మూడు రోజుల క్రితం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికట్ గా ఉన్నట్లు పార్టీ వెల్లడించింది. ఆగస్టు 19వ తేదీన ఏచూరి సీతారంను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. దీంతో సీపీఎం పార్టీ నేతలు విషాదంలో మునిగిపోయారు. ఆయన పార్టీకీ చేసిన సేవలు తల్చుకుంటూ నివాళ్లర్పించారు.

ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే.. సీతారాం ఏచూరి కాకినాడకు వ్యక్తి. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. విభజన సమయంలో పార్లమెంట్ లో తనదైన స్వరాన్ని వినిపించారు. పార్లమెంట్ లో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకత విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టేవారు. కమ్యూనిస్టు అగ్ర నాయకులు అయిన పుచ్చలపాటి సుందరయ్య, ఈఎంఎస్, బీటీఆర్, హరికిషన్ సింగ్ సుర్జీత్, బసవ పున్నయ్య, జ్యోతి బస్ లతో కలిసి పనిచేశారు. ఇక సీతారం ఏచూరి మృతిపై పలువురు రాజకీయ నేతలు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మీరు కూడా సీతారం ఏచూరికి నివాళ్లను కామెంట్స్ రూపంలో  తెలియజేయండి.

Show comments