Tirupathi Rao
Tirupathi Rao
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. చంద్రబాబుకు బెయిల్ తెచ్చేందుకు ఆయన లాయర్లు తెగ కష్టపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఆయన నెత్తిన మరో పిడుగు పడ్డట్లు అయింది. అదేంటంటే.. మరో కేసులో చంద్రబాబును విచారణ చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పిటిషన్ దాఖలైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చినా.. ఈ పిటిషన్ లో రిమాండుకు వెళ్లాల్సి రావచ్చు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన తరఫున విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన తర్వాత తీర్పును వెలువరిస్తారు. అయితే ఈలోపే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యే వార్త ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటంటే.. మరో కేసులో చంద్రబాబుని పీటీ వారెంట్ కింద విచారణకు అనుమతి ఇవ్వాలని సీఐడీ కోరనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మరో పిటిషన్ దాఖలు కానుంది. 2022లో దాఖలైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనే చంద్రబాబును విచారణ చేసేందుకు అనుమతి కావాలంటూ సీఐడీ పిటిషన్ దాఖలు చేయనుంది.
ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ఏ1గా ఉండగా.. నారాయణ ఏ2గా ఉన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుతో సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీఆర్డీఏ ఛైర్మన్ గా ఉన్న చంద్రబాబు, వైస్ ఛైర్మన్ గా ఉన్న నారాయణ క్విడ్ ప్రోకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లోనే భారీ మోసం దాగుందని చెబుతున్నారు. తొలుత సీఆర్డీఏ అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రూపొందించగా.. దానిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ఆదేశాలతోనే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులు జరిగాయంటున్నారు. ముందుగా అనుకున్న అలైన్మెంట్ ని 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపినట్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: తాను ఓపెన్ చేసిన జైలు బ్లాక్ లో.. రిమాండ్ ఖైదీగా చంద్రబాబు!
ఇది కూడా చదవండి: జైలుకు చంద్రబాబు.. NTR ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి కామెంట్స్!