iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ లోకి హీరో నితిన్.. క్లారిటీ ఇచ్చిన కీలక నేత!

  • Published Jul 08, 2023 | 5:15 PM Updated Updated Jul 08, 2023 | 6:25 PM
  • Published Jul 08, 2023 | 5:15 PMUpdated Jul 08, 2023 | 6:25 PM
కాంగ్రెస్ లోకి హీరో నితిన్.. క్లారిటీ ఇచ్చిన కీలక నేత!

టాలీవుడ్ ప్రముఖ హీరో నితిన్ వరుసబెట్టి సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉన్నారు. గతంలో తాను నటించిన మాచర్ల నియోజవర్గం మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇకపోతే నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ లో ఉన్న నితిన్ ఉన్నట్టుండి రాజకీయాల్లోకి వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నితిన్ రక్త సంబంధికులు ప్రస్తుతం చాలా మంది రాజకీయాల్లో రాణిస్తున్నారు. దీంతో నితిన్ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే కాకుండా.. నితిన్ ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సైతం కలిశారని, త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. నితిన్ కాంగ్రెస్ లో చేరి నిజామాబాద్ జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారట.

అయితే, ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత అరికెల నర్సారెడ్డి నితిన్ పొలిటికల్ ఎంట్రీపై తాజాగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. నితిన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడని, అది కాంగ్రెస్ నుంచే అని ఓ వార్త నేను టీవీలో చూశాను. నితిన్ రాజకీయాల్లోకి వచ్చే సీన్ లేదు, సినిమా ప్రమోషన్ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆయన తెలిపారు. మొత్తానికి నితిన్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలను కాంగ్రెస్ నేత అరికెల నర్సారెడ్డి కొట్టిపారేశారు. మరి నిజంగానే నితిన్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారా? అసలేం జరిగుతుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet