iDreamPost
android-app
ios-app

ఏపీ స‌ర్కారు ఎఫెక్ట్.. దిగొస్తున్న ధరలు

ఏపీ స‌ర్కారు ఎఫెక్ట్.. దిగొస్తున్న ధరలు

అభివృద్ధి, సంక్షేమ‌మే కాదు.. పేద‌ల‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌తీ అంశంపైనా ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు దృష్టి కేంద్రీక‌రిస్తోంది. అందుకు నిద‌ర్శ‌న‌మే తాజా చ‌ర్య‌లు. దిగొస్తున్న ధ‌ర‌లు. క‌రోనా అనంత‌రం దేశ‌మంత‌టా ధ‌ర‌ల తారాజువ్వా పైపైకి దూసుకెళ్తోంది. తాజాగా ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు విప‌రీతంగా పెరిగాయి. దీంతో దేశీయంగా వ్యాపారులు వంట నూనెల కృత్రిమ కొరత సృష్టించారు. వాటికి క‌ళ్లెం వేయ‌డం ఒక్కోసారి కేంద్రానికి కూడా సాధ్యంకావ‌డం లేదు.

అస‌లే ఆర్థికంగా కుదేలైన పేద‌ల‌కు ఈ ధ‌ర‌ల పెరుగుద‌ల మ‌రింత ఇబ్బందిగా మారింది. దీన్ని గుర్తించిన ఏపీ ప్ర‌భుత్వం నిత్యావ‌స‌రాల్లో ప్ర‌ధాన‌మైన వంటనూనె ధ‌ర‌ల నియంత్ర‌ణ‌లో విజ‌య‌వంత‌మైంది. టాస్క్‌ఫోర్స్‌తో ధరలపై నిఘా, ఆకస్మిక తనిఖీలు.. మరోవైపు రైతుబజార్లు, మున్సిపల్‌ మార్కెట్లలో కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే విజయ ఆయిల్స్‌ విక్రయాల‌ ఫలితంగా వంటనూనె ధరలు దిగొస్తున్నాయి. ఎమ్మార్పీకంటే కనీసం రూ.5 నుంచి రూ.55 వరకు తగ్గించి అమ్ముతున్నారు. మార్కెట్‌లో ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు వీటిని కొనసాగించాలని నిర్ణయించింది.

ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం అనంత‌రం కృత్రిమ కొరత సృష్టించ‌డం కార‌ణంగా నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. జనవరిలో లీటర్‌కు రూ.150–175 మధ్య ఉండగా, ఒకేసారి రూ.200 దాటాయి. ప్రియా ఆయిల్స్‌ అయితే లీటర్‌ రూ.200 నుంచి రూ.265 కు పెంచేశారు. వెంటనే ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. స్టాక్‌ లిమిట్‌పై ఆంక్షలు విధించింది. టాస్క్‌ఫోర్స్‌తో మార్కెట్‌లో ధరలపై నిరంతర నిఘా పెట్టింది. హోల్‌సేల్, రిటైల్‌ షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించింది. విజయవాడ, గుంటూరు, విశాఖ తదితర ప్రధాన నగరాల్లో 75 మందికి పైగా వ్యాపారులు, హోల్‌సేల్‌ వ్యాపారులపై 6ఏ కేసులు నమోదు చేసింది. 1,802 టన్నులకు పైగా వివిధ రకాల నూనెలను స్వాధీనం చేసుకుంది.

రైతుబజార్లు, మునిసిపల్‌ మార్కెట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, వాటిలో విజయా ఆయిల్స్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్లల్లో స్వాధీనం చేసుకున్న నూనెలను కూడా ఈ కౌంటర్లలో విక్రయిస్తోంది. అయిదు వేల జనాభా ఉన్న గ్రామాల్లోనూ నూనెల కౌంటర్లు ఏర్పాటు చేసింది. వాటి ద్వారా గత ప‌దిహేను రోజుల్లో 61,759 లీటర్లు విక్రయించింది. ఇటీవల ఆయిల్‌ రిఫైనరీస్, ఉత్పత్తి, సరఫరాదారులు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో సమావేశాలు నిర్వహించింది. ఈ చర్యలతో ధరలు దిగొచ్చాయి. ఎమ్మార్పీ కంటే రూ.55 వరకు తగ్గించి విక్రయించేందుకు వ్యాపారులు ముందుకొచ్చారు. వంట నూనెల ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు నియంత్రణ చర్యలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే పామాయిల్‌ వారికి అందుబాటు ధరల్లో ఉండేలా చర్యలు చేపట్టింది.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş