iDreamPost
android-app
ios-app

ఏపీలో కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లు.. మొత్తం 26 జిల్లాల తాజా అధికారులు వీరే

ఏపీలో కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లు.. మొత్తం 26 జిల్లాల తాజా అధికారులు వీరే

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అధికార వైసీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ఫైనల్‌ డ్రాఫ్ట్‌‌కు ఇప్పటికే ఆమోదించింది. శనివారం నాడు వర్చువల్‌గా భేటీ అయిన కేబినెట్‌.. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది. 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇది వరకు 13 జిల్లాలు ఉండగా.. కొత్తగా మరో 13 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్ల వివరాలు..

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీరావు కొనసాగింపు, శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్‌.రాధిక, జాయింట్ కలెక్టర్ గా ఎం. విజయ సునీత

రెవెన్యూ డివిజన్లు: శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం

విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి కొనసాగింపు, విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక కొనసాగింపు, జాయింట్ కలెక్టర్ గా కె. మయూర్ అశోక్
రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్‌, పార్వతీపురం ఎస్పీగా వాసన విద్యాసాగర్‌ నాయుడు, జాయింట్ కలెక్టర్ గా ఒ. ఆనంద్,
రెవెన్యూ డివిజన్లు: పార్వతీపురం, పాలకొండ

విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున కొనసాగింపు, విశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ గా కే ఎస్ విశ్వనాథన్
రెవెన్యూ డివిజన్లు: భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌ కుమార్‌, అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ గా జి.సూరజ్ ధనంజయ్
రెవెన్యూ డివిజన్లు: పాడేరు, రంపచోడవరం,

అనకాపల్లి కలెక్టర్‌గా రవి సుభాష్‌, అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలి, జాయింట్ కలెక్టర్ గా కల్పనా కుమారి
రెవెన్యూ డివిజన్లు: అనకాపల్లి, నర్సీపట్నం,

కాకినాడ కలెక్టర్‌గా కృతికా శుక్లా, కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌ బాబు, ధ్యానచంద్ర, జాయింట్ కలెక్టర్ గా ఎస్.ఇలాకియా
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం, కాకినాడ

తూర్పు గోదావరి కలెక్టర్‌గా మాధవీలత, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, జాయింట్ కలెక్టర్ గా శ్రీధర్ చామకూరి
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం, కొవ్వూరు

కోనసీమ కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా, కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డి, జాయింట్ కలెక్టర్ గా ధ్యానచంద్ర
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

పశ్చిమ గోదావరి కలెక్టర్‌గా పి.ప్రశాంతి, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రవిప్రకాశ్‌, జాయింట్ కలెక్టర్ గా అభిషిక్త కిషోర్
రెవెన్యూ డివిజన్లు: నర్సాపురం, భీమవరం (కొత్త)

ఏలూరు కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌, ఏలూరు ఎస్పీగా ఆర్‌.ఎన్‌. అమ్మిరెడ్డి, జాయింట్ కలెక్టర్ గా అరుణ్ బాబు
రెవెన్యూ డివిజన్లు: జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రంజిత్‌ బాషా, కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ కౌశల్‌ కొనసాగింపు, జాయింట్ కలెక్టర్ గా మహేష్ బాబు
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.డిల్లీరావు, విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా కొనసాగింపు, జాయింట్ కలెక్టర్ గా అజయ్ కుమార్
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)

గుంటూరు కలెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి, గుంటూరు అర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హఫీజ్‌ కొనసాగింపు, జాయింట్ కలెక్టర్ గా రాజకుమారి
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు, తెనాలి

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శివశంకర్‌, పల్నాడు జిల్లా ఎస్పీగా రవిశంకర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ గా శ్యాం ప్రసాద్
రెవెన్యూ డివిజన్లు: గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

బాపట్ల జిల్లా కలెక్టర్‌గా విజయ, బాపట్ల జిల్లా ఎస్పీగా వకుల్‌ జిందాల్‌, జాయింట్ కలెక్టర్ గా శ్రీనివాసులు
రెవెన్యూ డివిజన్లు: బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా దినేశ్‌ కుమార్, ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లిక గార్గ్‌ కొనసాగింపు, జాయింట్ కలెక్టర్ గా మురళి
రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)

నెల్లూరు జిల్లా కలెక్టర్ గా చక్రధర్‌ బాబు, నెల్లూరు ఎస్పీగా సీహెచ్‌ విజయరావు కొనసాగింపు, జాయింట్ కలెక్టర్ గా హరేందిర ప్రసాద్
రెవెన్యూ డివిజన్లు: కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

శ్రీబాలాజీ జిల్లా కలెక్టర్‌గా వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ గా బాలాజీ
రెవెన్యూ డివిజన్లు: గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి.

చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా హరినారాయణ, చిత్తూరు ఎస్పీగా రిశాంత్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ గా వెంకటేశ్వర్
రెవెన్యూ డివిజన్లు: చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా శ్రీ గిరీష, అన్నమయ్య ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు, జాయింట్ కలెక్టర్ గా ధమీమ్ అన్సారియా
రెవెన్యూ డివిజన్లు: రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

కడప కలెక్టర్‌గా విజయరామరాజు, కడప ఎస్పీగా అన్బురాజన్‌ కొనసాగింపు, జాయింట్ కలెక్టర్ గా శ్రీకాంత్ వర్మ
రెవెన్యూ డివిజన్లు: బద్వేల్, కడప, జమ్మలమడుగు

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా పి.బసంత్‌ కుమార్‌, శ్రీసత్యసాయి ఎస్పీగా రాజుల్‌ దేవ్‌ సింగ్‌, జాయింట్ కలెక్టర్ గా దినేష్ కుమార్
రెవెన్యూ డివిజన్లు: ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

అనంతపురం కలెక్టర్‌గా ఎస్‌.నాగలక్ష్మి, అనంతపురం ఎస్పీగా ఫకీరప్ప కొనసాగింపు, జాయింట్ కలెక్టర్ గా కేతన్ గార్గ్
రెవెన్యూ డివిజన్లు: అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)

నంద్యాల కలెక్టర్‌గా మనజీర్‌ జిలాని శామూన్‌, నంద్యాల ఎస్పీగా కె.రఘువీరా రెడ్డి, జాయింట్ కలెక్టర్ గా నారపురెడ్డి మౌర్య
రెవెన్యూ డివిజన్లు: ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల

కర్నూలు జిల్లా కలెక్టర్‌గా కోటేశ్వరరావు, కర్నూలు జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ గా రామసుందర్ రెడ్డి
రెవెన్యూ డివిజన్లు: కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

Jojobet GirişMadridbetMadridbetbetciomatbet girişgrandpashabetDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren Sitelerdeneme bonusugrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet