iDreamPost
android-app
ios-app

ట్రూ లవర్ OTT ప్లాట్ ఫామ్ ఇదే !.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  • Published Feb 11, 2024 | 5:31 PM Updated Updated Feb 11, 2024 | 5:31 PM

ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. ఫిబ్రవరి 10న థియేటర్లలోకి విడుదలైన ట్రూ లవర్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆ ఓటీటీలో అప్పటి నుంచే స్ట్రీమింగ్ కానుందట.

ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. ఫిబ్రవరి 10న థియేటర్లలోకి విడుదలైన ట్రూ లవర్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆ ఓటీటీలో అప్పటి నుంచే స్ట్రీమింగ్ కానుందట.

  • Published Feb 11, 2024 | 5:31 PMUpdated Feb 11, 2024 | 5:31 PM
ట్రూ లవర్ OTT ప్లాట్ ఫామ్ ఇదే !.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మరో మూడు రోజుల్లో వాలంటైన్స్ డే రాబోతుంది. లవర్స్ డేకి మూవీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు పలు ఓటీటీ సంస్థలు లవ్ కంటెంట్ తో కూడిన సినిమాలను, సిరీస్ లను రిలీజ్ చేస్తున్నాయి. ప్రేమికుల రోజును మరింత స్పెషల్ గా మార్చేందుకు ప్రేమకథా చిత్రాలు రీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రూ లవర్ మూవీ కూడా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీని తెలుగులోకి డబ్ చేసి తీసుకొచ్చారు డైరెక్టర్ మారుతీ, బేబీ నిర్మాత ఎస్ కేఎన్. ఇక ఈ ట్రూ లవర్ సినిమా ఆ ఓటీటీలోనే రిలీజ్ కానుంది. స్ట్రీమింగ్ అప్పటి నుంచే కానుందట.

డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ తమిళంలో తెరకెక్కించిన లవర్ గా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో ట్రూ లవర్ గా విడుదలైంది. ఈ చిత్రంలో గుడ్ నైట్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు మణికందన్ హీరోగా నటించారు. హీరోయిన్ గా మ్యాడ్ మూవీ ఫేమ్ గౌరీ ప్రియ అలరించింది. నిన్న థియేటరల్లోకి విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి కలెక్షన్లను వసూల్ చేస్తూ దూసుకెళ్తోంది. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అప్పుడే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ‘డిస్నీ+ హాట్‍స్టార్’ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి మూడో వారంలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍ కానున్నట్లు తెలుస్తోంది. కాగా ట్రూ లవర్ మూవీ ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కథ:

అరుణ్ (మణి కందన్), దివ్య (గౌరి ప్రియ) కాలేజ్ డేస్ నుండి ప్రేమించుకుంటారు. అందరి ప్రేమలాగే.. వీరి ప్రేమ కూడా కొన్నాళ్ల పాటు అందంగా సాగిపోతుంది. అలా ఆరేళ్ల పాటు గడిచిపోతుంది. చదువు అయిపోయాక దివ్య సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉంటుంది. అరుణ్‌కు మాత్రం వ్యాపారం చేయాలని ఉంటుంది. కేఫ్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అరుణ్ పెంపకం, అభద్రత వల్ల దివ్యపై అనుమానం పడుతూ ఉంటాడు. దివ్య ఏం చేసినా, ఎక్కడికి వెళ్లాలన్నా తన అనుమతి తీసుకోవాలంటూ పట్టుబడుతుంటాడు. ఆమె అతడికి చెప్పకుండా ఏదైనా చేస్తే.. గొడవ పడుతుంటాడు. అలా పలుమార్లు గొడవలు పడి కలిసిపోతూ ఉంటారు. అయితే అరుణ్ తీరుతో విసిగిపోయిన దివ్య తన భవిష్యత్తుపై ఆందోళన చెందుతుంది. అతడిని వివాహం చేసుకుంటే.. తన జీవితం ఏంటని తికమక పడిపోతుంది. మరీ ఆమె ఏం చేసింది..? దివ్య.. అరుణ్ మళ్లీ కలిశారా..? అరుణ్ తన లక్ష్యానికి చేరుకున్నాడా అన్నది మిగిలిన కథ.

 

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş