iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్‌కి పండుగ.. ఇవాళ ఒక్కరోజే OTTలోకి 12 సినిమాలు

  • Published Aug 09, 2024 | 10:26 AM Updated Updated Aug 09, 2024 | 10:26 AM

OTT Movies On Aug 9th 2024: మూవీ లవర్స్‌ పండగ చేసుకునే వార్త ఇది. ఇవాళ ఒక్కరోజే అనగా ఆగస్టు 9, శుక్రవారం నాడు 12 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటితో పాటు మరి కొన్ని వెబ్‌ సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఆ జాబితా మీ కోసం..

OTT Movies On Aug 9th 2024: మూవీ లవర్స్‌ పండగ చేసుకునే వార్త ఇది. ఇవాళ ఒక్కరోజే అనగా ఆగస్టు 9, శుక్రవారం నాడు 12 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటితో పాటు మరి కొన్ని వెబ్‌ సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఆ జాబితా మీ కోసం..

  • Published Aug 09, 2024 | 10:26 AMUpdated Aug 09, 2024 | 10:26 AM
మూవీ లవర్స్‌కి పండుగ.. ఇవాళ ఒక్కరోజే OTTలోకి 12 సినిమాలు

ప్రస్తుతం శుక్రవారం వస్తుందంటే చాలు.. మూవీ లవర్స్‌.. ఓటీటీల్లోకి రాబోయే సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సినీ ప్రియుల కోసం మరో శుక్రవారం వచ్చేసింది. మరి ఈ రోజు ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు రాబోతున్నాయి అనే దాని గురించి మూవీ లవర్స్‌ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇవాళ ఒక్క రోజే ఓటీటీల్లోకి 12 సినిమాలు రాబోతున్నాయి. వీటిల్లో ఏకంగా 8 సినిమాలపై ప్రేక్షకులకు విపరీతమైన ఆసక్తి ఉంది. వీటిల్లో భారతీయుడు 2 కూడా ఉంది. ఇక ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు విడుదల కాబోతుండగా.. వాటిల్లో ఏకంగా 12 ఈ రోజే స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. దాంతో మూవీ లవర్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.

ఇక ఓటీటీల సంగతి ఇలా ఉంటే.. నేడు థియేటర్లలో కొన్ని సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. వాటిలో నిహారిక కమిటీ కుర్రోళ్లు సినిమాతో పాటు.. హారర్ మూవీ భవనమ్, అనసూయ సింబా, విజయ్ ఆంటోనీ తుఫాన్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వీటిల్లో ఏ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు. వీటిపై బజ్‌ కూడా లేదు.

ఇక నేడు ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్న వాటిల్లో హారర్, తెలుగు డబ్బింగ్ మలయాళం, క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలు, వెబ్ సిరీసులు చాలా స్పెషల్‌గా ఉండనున్నాయి. మొత్తం 12 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో.. 8 మూవీల మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. నేడు ఓటీటీల్లోకి వచ్చే సినిమాల్లో అందరి దృష్టి భారతీయుడు 2 సినిమాపై ఉంది. డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఓటీటీల్లో చూసేందుకు ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నేడు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఏ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయో ఇప్పుడు చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్

  • భారతీయుడు 2 (తెలుగు చిత్రం)- ఆగస్ట్ 9
  • ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా (హిందీ మూవీ)- ఆగస్ట్ 9
  • కింగ్స్‌మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లీష్ సినిమా)- ఆగస్ట్ 9
  • మిషన్ క్రాస్ (కొరియన్ మూవీ)- ఆగస్ట్ 9
  • ఇన్‌సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 9
  • రొమాన్స్ ఇన్ ది హౌజ్ (కొరియన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 10

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • లైఫ్ హిల్ గయి (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 9
  • ఖాటిల్ కౌన్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 9

ఆహా

  • 7/జీ (తమిళ సినిమా)- ఆగస్ట్ 9
  • డెరిక్ అబ్రహాం (తెలుగు డబ్బింగ్ మలయాళ మూవీ)- ఆగస్ట్ 10

జీ5

  • గ్యారా గ్యారా (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 9

జియో సినిమా

  • గుడ్‌చడీ (హిందీ చిత్రం)- ఆగస్ట్ 9

సోనీ లివ్

  • టర్బో (మలయాళ సినిమా)- ఆగస్ట్ 9

సింప్లీ సౌత్

  • అన్నపూరణి (తమిళ సినిమా)- ఆగస్ట్ 9 (ఇండియాలో స్ట్రీమింగ్ లేదు)

marsbahis girişgamdom girişjojobet girişjojobet girişsiteye gitJojobet GirişJojobet