iDreamPost
android-app
ios-app

OTTలోకి శోభితా ధూళిపాళ అదిరిపోయే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • Published May 11, 2024 | 10:31 AM Updated Updated May 11, 2024 | 10:31 AM

Sobhita Dhulipala: ఈ వీకెండ్‌లో మంచి క్రైమ్‌ థ్రిల్లర్‌ విత్‌ రొమాన్స్‌ చూడాలనుకుంటున్నారా.. మీ కోసం ఓటీటీలో ఓ సినిమా ఎదురు చూస్తుంది. ఇంతకు అది ఏ చిత్రం.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుంది అంటే..

Sobhita Dhulipala: ఈ వీకెండ్‌లో మంచి క్రైమ్‌ థ్రిల్లర్‌ విత్‌ రొమాన్స్‌ చూడాలనుకుంటున్నారా.. మీ కోసం ఓటీటీలో ఓ సినిమా ఎదురు చూస్తుంది. ఇంతకు అది ఏ చిత్రం.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుంది అంటే..

  • Published May 11, 2024 | 10:31 AMUpdated May 11, 2024 | 10:31 AM
OTTలోకి శోభితా ధూళిపాళ అదిరిపోయే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

వీకెండ్‌ వచ్చేసింది.. ఈవారం కొత్త సినిమాలు పెద్దగా లేవు. ఉన్న వాటిల్లో ఆసక్తి కలిగించే చిత్రాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. మరి ఈ వీకెండ్‌లో ఏ సినిమా చూడాలి అని ఆలోచిస్తున్నారా.. మీకు కనక క్రైమ్‌ థ్రిల్లర్‌.. అందునా రొమాంటిక్‌ సిరీస్‌ అంటే ఇష్టం ఉంటే.. ఇప్పుడు మేం చెప్పబోయే ఈ సినిమాను మాత్రం అస్సలు మిస్‌ చేసుకోకండి. తక్కువ రన్‌టైమ్‌.. చూస్తున్నంతసేపు ఊపిరి బిగబట్టి కూర్చుని.. నెక్స్ట్‌ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూసేలా చేయగలిగిన సినిమా ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇంతకు అది ఏ సినిమా.. ఎక్కడ అందుబాటులో ఉంది అంటే..

ఓటీటీ అనే కాకుండా థియేటర్లలో కూడా క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలకు డిమాండ్‌ కాస్త ఎక్కువ. ఇక ఈ జోనర్‌కు కాస్తా రొమాన్స్ యాడ్ చేస్తే.. వాటి క్రేజ్‌ మరింత పెరుగుతుంది. ఈ కోవకు చెందిన సినిమానే ది బాడీ. ఆద్యంతం థ్రిల్లింగ్ కలిగించే విధంగా తెరకెక్కిన రొమాంటిక్ క్రైమ్ అండ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది ది బాడీ మూవీ. ఈ సినిమాలో వచ్చే ఊహించని థ్రిల్స్, ట్విస్టులు ఆడియెన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ పంచుతాయి.

The Body Movie

ఆద్యంతం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే ది బాడీ సినిమా 2019లో విడుదలైంది. ఇందులో హాట్ బ్యూటి శోభితా ధూళిపాళ, బాలీవుడ్‌ సీరియల్‌ కిస్సర్‌ ఇమ్రాన్‌ హష్మీ జోడిగా నటించగా.. హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్, హీరోయిన్ వేదిక ముఖ్య పాత్రలు పోషించారు. 2012లో ఇదే టైటిల్‌తో వచ్చిన స్పానిష్ సినిమాకు రీమేక్‌గా హిందీలో ది బాడీ చిత్రాన్ని తెరకెక్కించారు.

దృశ్యం, దృశ్యం 2 వంటి క్రైమ్ అండ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు తెరకెక్కించి.. భారీ విజయాలు అందుకున్న మలయాళ డైరెక్టర్ జీతూ జోసేఫ్.. ది బాడీ సినిమాకు దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన ఈ సినిమాకు ప్రస్తుతం ఐఎమ్‌డీబీ 5.2 రేటింగ్ ఇచ్చింది. కానీ, ఈ సినిమాలోని ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు శోభితా గ్లామర్ షో ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. కనుక ఈ వీకెండ్‌లో మీరు ఈ సినిమాను చూసి ఎంజాయ్‌ చేయండి.

The Body Movie

ది బాడీ కథేంటంటే..

ది బాడీ కథ విషయానికొస్తే.. ప్రముఖ వ్యాపారవేత్త మాయ వర్మ అకస్మాత్తుగా చనిపోతుంది. కానీ, పోస్ట్‌మార్టం కాకముందే మార్చురీ నుంచి మాయ డెడ్‌ బాడీ మాయమైపోతుంది. దీంతో మాయ భర్త అజయ్ పూరి (ఇమ్రాన్ హష్మీ)కంగారు పడుతాడు. ఇక ఈ కేసుని సాల్వ్ చేసేందుకు ఎస్పీ జైరాజ్ రావల్ (రిషి కపూర్) ఎంట్రీ ఇస్తాడు. అసలు మాయ బాడీ ఏమైంది.. నిజంగానే ఆమె చనిపోయిందా.. అజయ్ పూరి కనిపెట్టిన రహస్యం ఏంటీ.. వంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ది బాడీ సినిమా తెరకెక్కింది. సుమారు గంట 40 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాను రూ. 3.46 కోట్లతో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మర్డర్ మిస్ట్రరీ థ్రిల్లర్ ది బాడీ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఇది హిందీ భాషలో మాత్రమే ప్రసారం అవుతోంది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş