iDreamPost
android-app
ios-app

ఆ నవ్వు చూస్తే చనిపోతారు.. OTTలో ఒణికించే హారర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ వివరాలివే

  • Published May 04, 2024 | 9:52 AM Updated Updated May 04, 2024 | 9:52 AM

Smile Movie: నవ్వుతో భయపెట్టే హారర్‌ థ్రిల్లర్‌ సినిమా ఒకటి ఓటీటీలో దూసుకుపోతుంది. ఆ సినిమా వివరాలు.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుంది అంటే..

Smile Movie: నవ్వుతో భయపెట్టే హారర్‌ థ్రిల్లర్‌ సినిమా ఒకటి ఓటీటీలో దూసుకుపోతుంది. ఆ సినిమా వివరాలు.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుంది అంటే..

  • Published May 04, 2024 | 9:52 AMUpdated May 04, 2024 | 9:52 AM
ఆ నవ్వు చూస్తే చనిపోతారు.. OTTలో ఒణికించే హారర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ వివరాలివే

మన ఎంత టెన్షన్‌లో ఉన్నా సరే.. ప్రశాంతమైన చిరునవ్వు చిందించే వారి ముఖం చేస్తే.. అలసట మొత్తం దూరమవుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది. నవ్వుకున్న శక్తి అలాంటిది. ఇక బోసి నవ్వులు చిందించే చిన్నారులను చూస్తే.. ప్రతి ఒక్కరు మనసు పరవశిస్తుంది. కొందరు నవ్వు చూస్తే.. ఆటోమెటిగ్గా మన పెదాలపై కూడా చిరునవ్వు పూస్తుంది. పైగా మన పెద్దలు కూడా నవ్వు ఆరోగ్యానికి మంచిది అన్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే నవ్వు మాత్రం చాలా భయంకరం. ఆ నవ్వు చూస్తే కచ్చితంగా చనిపోతారు. అదేంటి నవ్వు చూస్తే ఎవరైనా తిరిగి స్మైల్‌ ఇవ్వాలి కానీ.. చనిపోవడం ఏంటి అనుకుంటున్నారు.. ఎందుకో తెలియాలంటే.. ఈ హారర్‌ థ్రిల్లర్‌ చూడాలి. ఆ వివరాలు..

మన దగ్గరనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా హారర్ సినిమాలకు బీభత్సమైన క్రేజ్‌ ఉంది. పాత కథనైనా సరే.. ఆసక్తికరంగా.. ప్రేక్షకులను భయపెట్టేలా చెప్పగలిగితే చాలు.. విజయం సాధించినట్లే. ఇక ఈ మధ్య కాలంలో చాలా కొత్త కాన్సెప్ట్స్‌తో హారర్ థ్రిల్లర్స్ తెరకెక్కుతున్నాయి. అవి ప్రేక్షకలు థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందజేస్తున్నాయి.. అలాంటి ఓ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీనే స్మైల్. డైరెక్టర్ పార్కర్ ఫిన్ తెరకెక్కించిన ఈ హాలీవుడ్‌ సైకలాజికల్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ 2022 సెప్టెంబర్‌ 30న అమెరికాలో విడుదలై మంచి విజయం సాధించింది.

Smile Movie

ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతుంది. గతేడాది జూన్ 22 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. దాంతో పాటు మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్‌లో కూడా అందుబాటులో ఉంది. కానీ అమెజాన్‌లో స్మైల్‌ సినిమా చూడాలంటే.. రూ. 75తో చెల్లించాలి. ఈ చిత్రం ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టాప్‌ ట్రెండింగ్‌లో ఉంటుంది.

కథ విషయానికి వస్తే..

ఇక స్మైల్‌ కథ విషయానికి వస్తే.. రోజ్ కార్టర్ (సోసి బేకన్) ఒక సైకాలజీ డాక్టర్. పబ్లిక్‌లో న్యూసెన్స్ చేస్తోందని పీహెచ్‌డీ స్టూడెంట్ లారా వీవర్ (కైట్లిన్ స్టాసి)ను ఎమర్జెన్సీ కేసు కింద రోజ్ దగ్గరికి తీసుకొస్తారు పోలీసులు. తన సమస్య గురించి చెప్పిన లారా ఒక్కసారిగా రోజ్‌ను చూసి నవ్వుతూ సూసైడ్ చేసుకుంటుంది. దాంతో రోజ్‌ తీవ్రంగా అప్సెట్‌ అవుతుంది. ఇక అప్పటి నుంచి ఆమె జీవితలో అనుకోని మార్పులు.. భయానక ఘటనలు ఎదురవుతాయి.

ఈ క్రమంలో రోజ్‌ను వెంటాడుతున్న తెలియని శక్తి ఏంటి.. దాన్నుంచి ఆమె ప్రాణాలతో బయటపడిందా.. నవ్వు చూస్తే చనిపోయే శాపం ఏంటి.. వంటి విషయాలు తెలియాలంటే స్మైల్ మూవీ చూడాల్సిందే. ఈ వీకెండ్‌ మంచి మంచి హారిఫిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఎదురు చూస్తుంటే.. మీకు స్మైల్‌ సినిమా బెస్ట్‌ ఆప్షన్‌.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomcasibommariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet giriş