iDreamPost
android-app
ios-app

సైరన్ ఓటీటీ రిలీజ్ డిటైల్స్

  • Published Feb 13, 2024 | 12:48 PM Updated Updated Feb 13, 2024 | 12:48 PM

జయం రవి. కోలీవుడ్ ప్రేక్షకులకే కాదూ.. టాలీవుడ్ జనాలకు ఈ హీరో గురించి తెలుసు. జయం మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రవి.. జయం రవిగా ముద్ర పడ్డాడు. అతడి సినిమాలు కొన్ని తెలుగులో డబ్బింగై.. మంచి ఆదరణ చూరగొన్నాయి.

జయం రవి. కోలీవుడ్ ప్రేక్షకులకే కాదూ.. టాలీవుడ్ జనాలకు ఈ హీరో గురించి తెలుసు. జయం మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రవి.. జయం రవిగా ముద్ర పడ్డాడు. అతడి సినిమాలు కొన్ని తెలుగులో డబ్బింగై.. మంచి ఆదరణ చూరగొన్నాయి.

  • Published Feb 13, 2024 | 12:48 PMUpdated Feb 13, 2024 | 12:48 PM
సైరన్ ఓటీటీ రిలీజ్ డిటైల్స్

 తని ఒరువన్’ (తెలుగులో ధ్రువ) ‘కొమాలి’ ‘పొన్నియిన్ సెల్వన్’ లాంటి చిత్రాలతో తెలుగులో మంచి ఆదరణ పొందిన హీరో జయం రవి తాజాగా ‘సైరన్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘గంగ ఎంటర్టైన్మెంట్స్’ పతాకం పై మహేశ్వర్ రెడ్డి మూలి ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నారు. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలలో కనిపించనున్న ఈ చిత్ర తెలుగు టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందన లభించింది.

తాజా అప్డేట్స్ ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ను అప్పుడే ఖరారు చేసుకుంది. సైరన్ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకోగా, శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానెల్ భారీ మొత్తానికి దక్కించుకుంది. తమిళ, మలయాళ సినిమాల ఓటీటీ హక్కులను సాధారణంగా హాట్ స్టారే కొంటుంది. ముందుగా చెప్పుకున్నట్టు సైరన్ సినిమా తమిళ్ లో ఫిబ్రవరి 16న రిలీజ్ కాబోతుండగా తెలుగులో మాత్రం ఫిబ్రవరి 23న రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాని గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై మహేశ్వర్ రెడ్డి మూలి విడుదల చేయనున్నారు. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

” జయం రవి  ఈ చిత్రంలో చాలా మెచ్యూర్డ్ ఫెర్మామెన్స్ ఇచ్చారు. ఈ చిత్రంలోని పాటలు నాకు చాలా స్పెషల్. నాకు ఈ సంవత్సరం ఈ చిత్రంతో ప్రారంభం అవ్వడం చాలా సంతోషంగా ఉంది” అని సంగీత దర్శకుడు జివి ప్రకాష్ తెలిపారు. “ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం, అదీ పెద్ద హీరోతో అయినప్పుడు, ఖచ్చితంగా హిట్ అవ్వాలనుకుంటారు. ఆ బాధ్యత జయం రవి తీసుకున్నారు” అని డైరెక్టర్ ఆంటోనీ భాగ్యరాజ్ ఇటీవలి ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. ఇక హీరో జయం రవి, జీ వీ ప్రకాష్ కూడా సినిమా విజయం పై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş