iDreamPost
android-app
ios-app

ఓటీటీ మీదే ఫోకస్ పెట్టిన సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ

  • Published Feb 16, 2024 | 12:44 PM Updated Updated Feb 16, 2024 | 12:44 PM

Saif Ali Khan Focused on OTT: ఓటీటీ వచ్చిన తర్వాత చాలా మంది దీనికే ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు. ఇక సెలబ్రెటీలు కూడా ఒక్కొక్కరు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

Saif Ali Khan Focused on OTT: ఓటీటీ వచ్చిన తర్వాత చాలా మంది దీనికే ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు. ఇక సెలబ్రెటీలు కూడా ఒక్కొక్కరు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

  • Published Feb 16, 2024 | 12:44 PMUpdated Feb 16, 2024 | 12:44 PM
ఓటీటీ మీదే ఫోకస్ పెట్టిన సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ

కరోనా అనంతరం బాక్సాఫీస్ వద్ద స్టార్స్ గా చలామణి అయిన చాలా మంది బాలీవుడ్ హీరో హీరోయిన్లు ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ లిస్ట్ లో అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కాజోల్, విద్యాబాలన్, అలియా భట్, సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మీ తదితరులు ఉన్నారు. అయితే ఒక కుటుంబం మాత్రం ఓటిటి పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నెట్ ఫ్లిక్స్ లో సాక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్, హాట్ స్టార్ లో భూత్ పోలీస్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన జ్యువెల్ థీఫ్ అనే మరో ఓటీటీ వెంచర్లో నటిస్తున్నారు. ఇక ఆయన భార్య కరీనా కపూర్ ఎంతటి పెద్ద స్టార్ ఓ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో జానేజాన్ అనే క్రైమ్ థ్రిల్లర్ తో ఓటీటీ అరంగేట్రం చేసి శభాష్ అనిపించుకోవడమే కాక ఓటీటీ రంగంలో మరిన్ని ప్రాజెక్టులను చురుగ్గా చేపడుతున్నారు. సైఫ్ కుమార్తె సారా అలీఖాన్ ఇప్పటికే అత్రంగి రే, గాస్ లైట్ వంటి పలు ఓటీటీ చిత్రాల్లో నటించగా, మర్డర్ ముబారక్, కరణ్ జోహార్ తీసిన ఏ వతన్ మేరే వతన్ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

సైఫ్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ తో కలిసి నాదానియాన్ అనే ప్రాజెక్ట్ లో హీరోగా ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సైఫ్ బావమరిది కునాల్ ఖేము ఇది వరకే లూట్ కేస్, పాపా కౌన్ వంటి సినిమాలు, వెబ్ సిరీస్లతో ఓటీటీ రంగానికి విశేష కృషి చేశారు. సైఫ్ సోదరి సోహా అలీఖాన్ ప్రైమ్ వీడియోలో హుష్ హష్ సహా పలు ఓటీటీ ప్రాజెక్టుల్లో కనిపించారు. ఇది చూసిన వారందరూ సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ పూర్తిగా ఓటీటీ వైపు దృష్టి పెట్టారేంటి అని ఆశ్చర్యపోతున్నారు. ధియేటర్ అయినా ఓటీటీ అయినా ప్రేక్షకులను అలరించడమే లక్ష్యం కాబట్టి సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీకి ఆల్ ది బెస్ట్ చెప్దాం.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis